శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రక్కన నిలబడి

>> Monday, June 26, 2017

👆👆ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రక్కన నిలబడి
అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్న ఈయన గురించి మీకు తెలుసా..........?

అయితే ఒక్కసారి ఇతని గురించి చదవండి.

ఇతని పేరు శంభాజీ భిడే. ఇతను సాధారణ వ్యక్తి కాదు. MSc అటామిక్ పిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఈయన.

పూణే లోని పర్గూన్స్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ న్యూక్లియర్ పిజిక్స్ ను చాలా సంవత్సరాల పాటు బోధించారు.

ఆయన ప్రొఫెసర్ గా రిటైర్ అయిన తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేసి, మహారాష్ట్రలో విస్తృతంగా నిర్వహిస్తూ పది లక్షల మందికి పైగా యువతరం తనతో పాటు సేవలలో పాల్గొనేలా చేస్తున్నారు.

కాలి నడకకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే ఆయన, కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంత దూరమైనా నడుస్తారు.
తెల్లటి ఖాదీ వస్త్రాలు మాత్రమే ధరిస్తూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తున్నారు.

ఆయన వ్యక్తిత్వం, ఆలోచనా విధానాన్ని బట్టి  తెలిసిందేమిటంటే.

“మనం పవిత్రమైన ఈ దేశంలో పుట్టాం. ఈ గాలిని పీలుస్తూ.....
ఈ నీటిని తాగుతూ....... ఈ నేలపై నడుస్తున్నాం.

మన ఊపిరి ఉన్నంతవరకు ఈ దేశానికి ఏదో విధంగా సేవ చేయడం మనందరి బాధ్యత“  అనే ఉన్నతమైన ఆశయంతో ఆయన ముందుకు పయనిస్తున్నారు.

అలాంటి గొప్ప వ్యక్తిని గురించి ఈ ప్రపంచానికి తెలియజేయడం మనందరి బాధ్యత.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP