హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి కార్యక్రమమునకు మీకిదే భక్తిపూర్వక ఆహ్వానము.
>> Wednesday, May 17, 2017
భగవద్భక్తులందరికీ నమస్కారములు.
స్వామి వారి అపారకరుణతో ప్రారంభమైన హనుమత్ రక్షాయాగం ఇప్పటివరకు తొమ్మిది ఆవృతులుగా తొమ్మిది సంవత్సరములనుండి కొనసాగుతూ ఈనెల వైశాఖ బహుళ దశమి అనగా మే ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు పూర్ణాహుతితో తొమ్మిదవ ఆవృతి పూర్తికానున్నది.
ఒక ఆథ్యాత్మిక ప్రయోగముగా చేపట్టిన ఈ యాగ కాలములో ఎందరెందరో భక్తులకు ఎన్నెన్నో దివ్య అనుభూతులు, ఆర్తులకు రక్షణ ప్రసాదించిన హనుమత్ స్వామి వారి దివ్యపాదారవిందములను కొలచే భాగ్యం లభించటం ,ఇంతమంది భక్త జనులతో కలసి ఈ కార్యక్రమములో నడవటం నిజంగా మా పూర్వజన్మసుకృతమే
ఈ సారి వేసవి ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నది. అందువలన హోమ కార్య క్రమము ఏడు గంటల కల్లా ప్రారంభమవుతుంది. కనుక ఆ సమయానికి భక్తజనులంతా యాగశాలకు చేరుకోవాలి..శనివారం రాత్రికే వస్తున్నవారు ముందుగా ఫోన్ చేయవలసినదిగా మనవి
ఇక ఈ కార్యక్రమములో పాల్గొంటూ హనుమాన్ చాలీసా పారాయణము,శ్రీరామనామలేఖనము చేస్తున్న భక్తులు రామనామ లేఖన ప్రతులను వెంటనే పంపాలి. ముందుగా జపసంఖ్యను మెయిల్ లేదా ఫోన్ ద్వారానైనా తెలుపవలసినదిగా కోరుతున్నాము.
ఇప్పటివరకు తమ గోత్రనామాలను పంపని వారు వెంటనే పంపగలరు , మరొక ముఖ్య గమనిక వరుసగా తమ గోత్రనామాలను పంపుతున్నవారు. ఇక్కడ ముఖ్యసేవలలో పాల్పంచుకుంటున్నవారు కూడా ప్రతిసారీ గోత్రనామాలను పంపవలసినదే . ఇక్కడ మీరు గోత్రనామాలను స్వయంగా పంపటం మీశ్రధ్ధకు నిదర్శనం గా భావిస్తాము.
భగవత్సేవలో మనందరం కలసి నడిచే ఈ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ.........భక్తజనదాసుడు
దుర్గేశ్వర
మీకు మరేవైనాసందేహాలు ఉంటే నా ఫోన్ లో సంప్రదించగలరు 9948235641
1 వ్యాఖ్యలు:
యజ్ఞం ఫోటోలు పెట్టండి స్వామి
Post a Comment