శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమెరికాలోనైనా ఆసియాలోనైనా ఇప్పుడు హనుమంతుడే రక్ష

>> Monday, February 27, 2017

గ్రహస్థితులను అనుసరించి ప్రపంచంలో విద్వేషాలు పెరుగుతూ  జాతులమధ్య ఘర్షణలు  పెరుగుతూ ఆందోళనలు కలిగిస్తున్నాయి. బ్రతుకుదెరువు కోసం పరాయి దేశాలలో ఉన్న తమవారి గురించి ఇక్కడవారికి భయాందోళనలుకలుగుతున్నాయి.   ఇక అక్కడ జరిగినదానికంటే ఇక్కడ ప్రచార మాధ్యమాలలో వస్తున్న అతి వార్తలు మరింత గా వారి భయాన్నిమరింత  పెంచుతున్నాయి.


     ఇక మనవంతుగా మనమేధస్సులు ఉపయోగించి వీటిని తగ్గించాలని చూసినా విద్వేషాలు పుడుతున్నది కూడా మన మేధస్సులనుండే ననే విషయం మరువకూడదు.   గ్రహస్థితులననుసరించి  భూమిపై సంభవిస్తున్న పరిణామాలను మనం పూర్తిగా ఆపలేం. కాకుంటే  సూర్యతాపాన్ని  ఆపలేకపోవచ్చుగాని దాని ప్రభావం నుంఛి రక్షణగా గొడుగు ను వాడుకున్నట్లుగా భగవంతుని ఉపాసనా మార్గాలను ఆశ్రయించి ఆయన కరుణను పొందగలిగితే విపత్కర పరిస్థితులనుండి  తప్పుకోవచ్చు.  

ఈశ్వరుని అంశ హనుమంతుని రూపంలో రక్షణశక్తిగా భూమిపై అవతరించి భక్తజనరక్షణచేస్తున్నది.     మన పెద్దలు విద్యను చాలా సులభమార్గంలో మనకు అందించారు.   భక్తితో ఆయనను ధ్యానించి  స్తుతించి ఆయన వలే పవిత్రజీవనం గడపటానికి ప్రయత్నిస్తే   హనుమత్ శక్తి మీకండగా నిలబడుతుంది . ఇది వాస్తవం. రుషిప్రోక్తం .అనుమానం అక్కరలేదు.

నిత్యం  హనుమాన్ చాలీసా పారాయణం, శుచీ శుభ్రత పాటించటం, మధ్యమాంసాలకు దూరంగా ఉండటం ,సింధూర ధారణ వలన ఇప్పటి  విపత్కర పరిస్థితులనుండి రక్షణకలుగుతుందిఒకవేళ ఎవరికైనా వారి మతాచారాల వల్ల సింధూరధారణ చేయను వీలుకాకపోయినట్లైతే కనీసం చాలీసా పారాయణం, స్వామి ధ్యానం సద్యోఫలితాలను ఇస్తాయి.
స్వామిని ఆశ్రయించి అందరూ శుభములనొందాలని కోరుకుంటూ   ......

శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష

1 వ్యాఖ్యలు:

Zilebi February 27, 2017 at 7:56 PM  హనుమంతుడే కదా ర
క్ష నూతనత్వము నొసంగ క్షతగాత్రులకున్
గన యమెరికాకు మనకు
న్ను నెల్లరకును గల దిక్కు నున్నతి గానన్

జిలేబి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP