శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నవరం దేవాలయం లో కంప్లయింట్ చేస్తే తీసుకున్న చర్యలు

>> Wednesday, December 7, 2016

అన్నవరం దేవాలయం లో కంప్లయింట్  చేస్తే   తీసుకున్న చర్యలు
ప్రసాదం పొట్లంలో పరిమాణం తక్కువగా ఉందని, దీనిపై కౌంటర్‌లో సిబ్బందిని ప్రశ్శిస్తే మరో పొట్లం ఇచ్చారని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిధి కాకరపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ అనే మహిళ కూడా మంగళవారం జరిగిన డయల్‌యువర్‌ ఈవో కార్యక్రమంలో తెలిపారు. దీనిపై పరిశీలించి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన ఈవో కార్యక్రమం తర్వాత నేరుగా ప్రసాదం తయారుచేసే విభాగం వద్దకు వెళ్లిపరిశీలించారు. ప్రసాదం నాణ్యతను పరిశీలించి గోధుమలు పూర్తి స్థాయిలో ఇంకా ఉడకలేదని గమనించి.. అందుకు కారణాలను ప్రసాదం తయారుచేసే వంట సిబ్బంది, గోధుమలు మిల్లు ఆడించే సిబ్బందిని అడిగి తెలుసుకుని.. పలు ఆదేశాలిచ్చారు. ప్రసాదం ప్యాకింగ్‌ చేసే విస్తరి ఆకులు సక్రమంగా, నాణ్యంగా లేవని, దాంతో ప్యాకింగ్‌ చేసిన తర్వాత ప్రసాదం బయటకు వస్తోందని సిబ్బంది ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఆకులను పరిశీలించి నాణ్యంగా లేవని గుర్తించి గుత్తేదారును మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆ విభాగ అధికారులను ఈవో ఆదేశించారు. డయల్‌యువర్‌ ఈవోలో అనేక సమస్యలను భక్తులు వివరించారు.

ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోంది 
ప్రధానాలయంలోనికి దర్శనానికి వచ్చిన తర్వాత లోపల సిబ్బంది అంతరాలయ దర్శనానికి రూ. 100 టికెట్టు.. అంటూ బిగ్గరగా అరుస్తూ ప్రశాంతతకు భంగం కల్గించడంతో భక్తులకు అసౌకర్యంగా ఉంటుండడంతోపాటు ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోందని గుంటూరుకు చెందిన దుర్గేశ్వరరావు ఈవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సహాయ కమిషనర్‌ ఈరంకి జగన్నాథరావుతో ఈవో వెంటనే చర్చించి ఇటువంటి పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని, రూ. 100 టికెట్టు కౌంటర్‌ ప్రధానాలయంలో గుమ్మం బయట పెట్టాలని ఆదేశించారు. కొండపైకి వచ్చే కొన్ని ఆటోలపై ఉన్న పోస్టర్ల అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఈవోకు భక్తుడు వివరించగా అటువంటివి లేకుండా పక్కాగా పరిశీలిస్తున్నామని, రద్దీ సమయాల్లో కొన్ని బయట ప్రాంతాలనుంచి వచ్చే ఆటోల్లో ఈ విధమైన పోస్టర్లు ఉండవచ్చునని, ఇకపై మరింత పకడ్బందీగా పరిశీలన చేస్తామని ఈవో హామీ ఇచ్చారు.
తమలపాకులు నాణ్యంగా లేవు 
సత్యదేవుని వ్రతమాచరించే సమయంలో భక్తులకు ఇచ్చే తమలపాకులు నాణ్యంగా లేవని కడియపులంకకు చెందిన జి.ఆదినారాయణమూర్తి ఈవోకు వివరించారు. వెంటనే స్పందించిన ఈవో తమలపాకుల కట్టలను కార్యాలయానికి తెప్పించి పరిశీలించారు. తమలపాకులు నాణ్యమైనవి సరఫరాచేసేలా గుత్తేదారుకు ఆదేశాలివ్వాలని ఆ విభాగ అధికారులు ఆదేశించడంతోపాటు భక్తులకు ఇచ్చే తమలపాకులు కొన్ని ఎక్కువగా ఇవ్వాలని ఆదేశించారు. కొంతమంది అనధికార వ్యక్తులు కొండపై దర్శనాలు చేయిస్తామని భక్తులను ఇబ్బందులుపెడుతూ సొమ్ములు డిమాండ్‌ చేస్తున్నారని ఆదినారాయణ ఈవోకు ఫిర్యాదు చేశారు.
* భక్తులకు చిల్లర ఇబ్బందులులేకుండా దేవస్థానంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అమలాపురానికి చెందిన భీమశంకరం ఈవోకు సూచించారు. 
* అదనపు పురోహితులను తొలగించడంపై కాకరపల్లికి చెందిన అన్నపూర్ణ ఈవోను అడగ్గా.. అది పరిపాలనా సంబంధమైన విషయమని ఈవో తేల్చిచెప్పారు. 
* శాశ్వత కల్యాణం, శాశ్వత వ్రతాలకు పరిమితి విధించడంపై ఇంజరానికి చెందిన సత్యశ్రీకాంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఈవో స్పందిస్తూ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు. 
* సత్యదేవుని ప్రచార రథంలో స్వామివారి విశిష్టతను 


[ఎంతసేపూ  కొబ్బరిచిప్పలు ,బోడిగుండ్లు  వరకే చూసుకోవటం కాదు   అనాచారాలను  నిరసించడం కూడా మనభక్తి  నిబద్దతలో  భాగమే   దయచేసి   స్పందించండి    ఇది హిందువులబాధ్యత ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP