శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అనుభూతికందని అద్భుతం

>> Saturday, July 30, 2016

అనుభూతికందని అద్భుతం
28-07-2016 22:50:27

సద్గురు బోధ

శ్వాస అంటే.. ఆక్సిజన్‌, కార్బన్‌ డై అక్సైడ్‌ల మార్పిడి కాదు. శ్వాస తీసుకునే విధానం మనిషిపై ఎంతో ప్రభావం చూపుతుంది. మీ అనుభూతులు, ఆలోచనలు, భావోద్వేగాలకు అనుగుణంగా శ్వాస క్రమంలో మార్పులను గమనించవచ్చు. కోపంగా ఉన్నప్పుడు ఒకలా, శాంతంగా ఉన్నప్పుడు మరోలా శ్వాస ఉంటుంది. అంతేనా ఏవిధంగా ఊపిరి తీసుకుంటే ఆ విధంగా ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తే.. అలా శ్వాస తీసుకుంటారు.
 
ఈ శ్వాసను ఒక పరికరంలా వాడుకుని శరీరం, మనసులతో అనేకం చేయవచ్చు. శాంభవీ మహాముద్ర చేసేటప్పుడు మనం ఒక సరళమైన శ్వాస ప్రక్రియను ఉపయోగిస్తాం. కాని శాంభవీ మహాముద్రకియ్ర కేవలం శ్వాసకు ప్రక్రియను మాత్రమే ఉపయోగించేది కాదు. ఇక్కడ శ్వాస.. ప్రేరణ కోసం కేవలం ఓ సాధనం మాత్రమే. శ్వాసకు సంబంధించినది మాత్రం కాదు. ప్రాణాయామం ఒక శాస్త్రం. దీన్ని ఉపయోగించి ప్రత్యేకమైన విధానంలో శ్వాస తీసుకోవడం ద్వారా మీరు ఆలోచించే విధానం. మీ అనుభూతులు, మీ అవగాహన, జీవితాస్వాదనా అన్నిటినీ మార్చుకోవచ్చు.
శ్వాస దివ్యత్వానికి (సృష్టి కర్తకు) చెయ్యివంటిది. మీరు దాన్ని అనుభూతి చెందలేరు. మీ అనుభూతికందని ఈ శ్వాసనే ‘కూర్మ నాడి’ అంటారు. ‘కూర్మ నాడి’ అనేది మిమ్మల్ని దేహానికి కట్టే ఒక సూత్రం (దారం) వంటిది. ఈ సూత్రం ఎక్కడ తెగిపోకుండా అలా వెళ్తూనే ఉంటుంది. నేను మీ శ్వాసను తీసేస్తే.. మీరు, మీ శరీరం విడిపోతాయు. ఎందుకంటే ప్రాణి, శరీరం ‘కూర్మ నాడి’తో బంధించబడి ఉంటాయి.
 
మీరు శ్వాసతో పాటుగా ప్రయాణిస్తూ, మీ అంతర్ముఖంలోకి లోతుగా మీ శ్వాస మూలం దాకా చేరుకోగలిగితే, మీరు మీ దేహంతో ఎక్కడ ముడివేయబడ్డారో తెలిస్తే, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే దాన్ని విడిచిపెట్టవచ్చు. మీరు మీ శరీరంపైనున్న బట్టలు విడిచినంత సునాయాసంగా ఎరుకతో శరీరాన్ని విడిచి పెట్టవచ్చు. మీ బట్టలు ఎక్కడ ముడి పెట్టారో మీకు తెలిస్తే, వాటిని వదిలెయ్యడం మీకు సులువే. అవి ఎక్కడ ముడిపెట్టబడ్డాయో, కట్టబడ్డాయో మీకు తెలియనప్పుడు మీరు ఎలా లాగినా, అది ఊడి రాదు. శరీరానికీ ఇదే వర్తిస్తుంది.
 
మీ బట్టలు ఎక్కడ కట్టబడి ఉన్నాయో మీకు తెలియనప్పుడు, వాటిని తీసెయ్యాలని మీరు అనుకుంటే, వాటిని చించేయాల్సిందే. అలాగే మీ దేహం మీతో ఎక్కడ ముడిపెట్టబడి ఉందో మీకు తెలియక పోతే, మీరు దాన్ని విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు, మీరు దేహానికి ఏదో విధంగా పగలగొట్టాలి లేదా ఏదో విధంగా దాన్ని విరిచివేయాలి. అదే కనుక మీకు ఈ రెండు ఎలా ముడిపడ్డాయో తెలిస్తే, మీరు మీ దేహాన్ని మీ నుంచి కొంత ఎడంగా చూడగలుగుతారు. మీకు దాన్ని విడిచిపెట్టాలని అనిపించినప్పుడు తేలికగా వదిలివేయగలుగుతారు. అప్పుడు జీవితాన్ని అనుభవించే విధానం ఎంతో మారిపోతుంది.
 
ఎవరైనా ఇచ్ఛానుసారం దేహాన్ని పూర్తిగా విడిస్తే, మనం దాన్నే ‘మహా సమాధి’ అంటాం. దీన్నే సాధారణంగా ‘ముక్తి’ లేదా ‘మోక్షం’ అని కూడా సంబోధిస్తాం. మీరు దేహానికి వెలుపల, దేహానికి లోపల అన్న భేదం లేని ఒక గొప్ప సమన్వయ స్థితి పొందితే, ఇక ఈ ఆట ముగిసినట్లే.
 
ప్రతి యోగీ దీనికోసమే తపిస్తాడు. ఒకవిధంగా చూస్తే ప్రతి మనిషీ కూడా ఇందుకే ప్రయత్నిస్తాడు. దీనిపట్ల వారికి ఎరుక ఉండవచ్చు, లేకపోవచ్చు. ఏదో ఒక విధంగా వాళ్లు విస్తరించాలని అనుకుంటున్నారు. ఇది పరమోత్తమ విస్తరణ. కాని ఇది చాలా సుదీర్ఘమైన, అసాధ్యమైన ప్రక్రియ. మీరు 1,2,3,4 అని లెక్కించడం మొదలుపెడితే మీరు చేసేది అనంతమైన గణన అవుతుంది. అంతేకాని మీరు అనంతాన్ని చేరుకోలేరు. ఈ ప్రక్రియలోని నిరర్థకత్వాన్ని గుర్తించినప్పుడు శరీరం నుంచి జీవన ప్రక్రియను విడదీస్తూ, సహజంగానే మనిషి అంతర్ముఖుడు అవుతాడు. ప్రేమతో..

సద్గురు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP