శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

‘భారత్‌కీ బర్బాదీ తక్ జంగ్ లడేంగే.. జంగ్ లడేంగే..[ భారత్ వినాశనం అయ్యేంత వరకూ పోరాడతాం.. పోరాడతాం] ఇది భావప్రకటనా స్వేచ్చా ?

>> Wednesday, February 17, 2016

శ్రీ రాయపెద్ది అప్పయ్య శాస్త్రి గారి అద్భుతమైన వివరణ చదవండి.
SHARE IT WITH FRIENDS
‘భారత్ కీ బర్బాదీ తక్ జంగ్ లడేంగే.. జంగ్ లడేంగే..’ ఇది ఒక నినాదం.. ఈ నినాదానికి అర్థం ఏమిటో ఎవరికైనా తెలుస్తోందా.. ? భారత దేశం అనే పేరును అలియాస్‌గా పిలవబడే ఇండియాలో ఇలాంటి నినాదాలు స్వేచ్ఛగా చేయవచ్చు..హ్యాపీగా బతికేయవచ్చు.. ఇలా ఎందుకన్నావంటే ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటూ పెద్ద పెట్టున అరిచేయవచ్చు,. ఈ దేశంపై.. ఇక్కడి పార్లమెంటుపై దాడి చేసిన వాణ్ణి ఉరితీస్తే వాడికి దండలేసి నివాళులు అర్పించవచ్చు. వాణ్ణి ఎలా ఉరి తీస్తారంటూ ర్యాలీలు నిర్వహించవచ్చు.. వాళ్లను పల్లెత్తు మాట ఎవరూ అనరు. ప్రశ్నించరు. అన్ని హక్కులనూ వాళ్లు అడ్డగోలుగా.. వాడేస్తారు. హక్కులు కాలరాసేస్తున్నారంటూ గగ్గోలు పెడతారు. ఈ దేశానికి.. ఈ జాతికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవడికీ పట్టదు.. ఎవడూ వాళ్ల వంక కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించడు. ఇదిగో చూడండి.. భారత దేశంలో అత్యంత శక్తిమంతమైన మేధావులు అవతరించిన ఒక గొప్ప విద్యాసంస్థ.. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో.. రెండు రోజుల క్రితం అద్భుతమైన సమావేశం జరిగింది. భారత అత్యున్నత శాసన వ్యవస్థ అయిన పార్లమెంటుపై దాడి చేసి ఉరికంబమెక్కిన అఫ్జల్‌గురు అనేవాడికి ఈ విశ్వవిద్యాలయంలో తమను తాముగా మేధావులుగా, స్కాలర్‌లుగా, హేతువాదులుగా.. భావ ప్రకటనా స్వేచ్ఛా వాదులుగా, ఈ దేశంలో తాము మాత్రమే చెప్తున్నది వినాలనే నిరంకుశులుగా ఉద్యమాలు చేసే ముష్కరులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. దీన్ని ఎవరూ ప్రశ్నించలేదు. పాలకులు మాట్లాడలేదు. ప్రజల్లో స్పందన లేదు. ‘ప్రిన్సిపుల్ గా ఉరితీత’కు వ్యతిరేకమనే ముసుగులో దేశ సార్వభౌమాధికారాన్ని సైతం ధిక్కరించారు. ఈ సమావేశంలో.. ర్యాలీలో వీళ్ల నినాదాలు చూడండి.. వినండి.. ‘భారత్‌కీ బర్బాదీ తక్ జంగ్ లడేంగే.. జంగ్ లడేంగే..’ ఆప్‌కీ అర్మానోంకో పూరా కర్నాహీ హమారా మక్సద్ హై’ అంటూ నినాదాలు చేశారు. వీటికి అర్థం ఏమిటి? భారత్ వినాశనం అయ్యేంత వరకూ పోరాడతాం.. పోరాడతాం.. అని తొలి నినాదం అర్థం.. మీ ఆకాంక్షలు తీర్చటమే మా లక్ష్యం అన్నది మలి నినాదపు అర్థం. అంటే ఎవరి ఆకాంక్షలు. అఫ్జల్ గురు ఆకాంక్షలను నెరవేర్చటమంటే.. భారత పార్లమెంట్‌పై మరోసారి దాడి చేస్తారా? దీన్ని భావ ప్రకటనా స్వేచ్ఛ అంటారా? దేశ ద్రోహం అంటే అర్థం ఏమిటి? ఈ నినాదాలు కావా? వీటిని దేశద్రోహంగా పరిగణించక్కర్లేదా? మరో దేశంలో ఇలాంటివి మాట్లాడితే..మరుక్షణం తల తెగి దేశ సరిహద్దు ఆవల విసిరిపడుతుందే... మరి మన దేశంలో వీళ్లను ఎందుకు భరించాలి. మిగతా సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు పక్కన పెట్టండి. సోకాల్డ్ అవార్డ్ వాపసీ బ్రిగేడ్‌లు దీనిపై ఎందుకు మాట్లాడరు? గో మాంసం తినటం.. తినకపోవటంపై ఉద్యమాలు, పండుగలు నిర్వహించిన వారికి ఈ రకమైన నినాదాలపై నోరెత్తే సాహసం ఎందుకు చేయరు? ఉరిని వ్యతిరేకించటానికి.. అఫ్జల్ గురు అనే ఒక కిరాతక టెర్రరిస్టు ఆకాంక్షలను నెరవేరుస్తామనటానికి తేడా వీరికి కనిపించటం లేదా? భారత్‌కీ బర్బాదీ కోసం పోరాడతాం అంటే.. ఉరిని వ్యతిరేకించటమా? దేశ ద్రోహమా? కశ్మీర్ ఉగ్రవాది మఖ్బూల్ భట్‌ను ఎప్పుడో 1980లలో ఉరితీస్తే.. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో బాజాప్తా దండలేసి దండం పెడతారు. వాణ్ణి మహానుభావుడని పొగిడేస్తారు. ముంబైలో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న మెమన్‌ను ఉరితీస్తే.. భారత్‌లో బ్లాక్‌డే అంటారు. ఒకడు భారత జాతీయ పతాకాన్ని తగులపెడతాడు. మరొకడు పాకిస్తాన్ జండా పట్టుకు ఊరేగుతాడు. ఇంకొకడు విశ్వమంతా ఆరాధించే స్వామి వివేకానందను ఫేక్ ఇంటెలెక్చువల్ అంటాడు. వీళ్లంతా మేధావులు.. కులరహిత సమాజం కోసం.. మత రహిత సమాజం కోసం పోరాడే వాళ్లు.. అంబేద్కర్‌ను నెత్తిన పెట్టుకు పూజిస్తారు. ఆ అంబేద్కర్ రాసిన, రాయించిన రాజ్యాంగం ప్రకారం, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను అవమానిస్తారు. 2010 అక్టోబర్‌లో అరుంధతీ రాయ్ అనే మహా సెక్యులర్ మేధావి..‘ భూకా నంగా హిందుస్తాన్.. జాన్‌సే ప్యారా పాకిస్తాన్’ అంటూ నినదిస్తే.. ఆమెది భావ ప్రకటనా స్వేచ్ఛ అయింది. ఏ ఒక్కడూ ఈ నినాదంపై మాట్లాడలేదు. కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగమే నంటూ.. కశ్మీర్‌కు స్వతంత్రాన్ని ఇవ్వాలంటూ ఈ మేధావుల ముఠా నినాదాలిస్తే ఈ దేశంపై ప్రేమ ఉందని చెప్పుకునే వారికి నోట మాటరాలేదు. ఎందుకింత అలసత్వం..? ఇలా ఈ దేశాన్ని.. ఈ జాతిని, ఈ సంస్కృతిని, ఇక్కడి సమాజాన్ని నిరంతరం నిందిస్తూ.. పరాయి దేశాలను పొగుడుతూ సమావేశాలు పెడుతూ.. ర్యాలీలు తీస్తూ.. కొవ్వొత్తులు వెలిగిస్తూ.. నిర్లజ్జగా, నిర్భయంగా.. ప్రవర్తిస్తుంటే.. వాళ్లను ఏమీ అనలేని ఈ సమాజాన్ని జీవచ్ఛవం అని కాకుండా ఇంకేమి అనాలి. వాళ్లను ఒక రోజు కూడా జైల్లో పెట్టలేని ఈ రాజ్యాంగానికి విలువేమిటి? దీన్ని భావ ప్రకటనా స్వేచ్ఛ అని నిర్వచించే స్థాయిలో.. దాన్ని ఆమోదించే స్థాయిలో మనం ఉండటాన్ని ఏమనాలి? ఈ దేశంలో పుట్టినందుకు కనీసం సిగ్గూ శరం ఉండక్కర్లేదా? వాళ్లు రోడ్లెక్కి చిత్తం వచ్చినట్లు ఊరేగుతున్నారు. వాళ్ల ఆగడాలను నిరసించే పరిమిత వర్గం ఫేసుబుక్కుల్లో, వాట్సప్పుల్లో.. కొందరు మేధావుల అంతర్గత సమావేశాల్లో నిరసనలు తెలిపి.. ఆందోళనలు వ్యక్తం చేసి వారి పాపాన వారే పోతారులే అంటూ కడుపులో చల్ల కదలకుండా గడిపేస్తున్నారు. ఎందుకీ బతుకులు? వాళ్లు మనల్ని వ్యక్తిగతంగా తిట్టకపోవచ్చు.. కానీ.. మనం పుట్టిన నేలను తిడుతున్నాడు.. అవమానిస్తున్నాడు..ఆ నేలను ఒక వెలియాలిగా ట్రీట్‌చేస్తున్నాడు. ఇక్కడి వ్యవస్థను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను, సమాజాన్ని అన్నింటినీ తిడుతున్నాడు. పరాయి దేశాన్ని పొగుడుతున్నాడు. పరాయి దేశపు కీటకాలు ఇక్కడ చేస్తున్న సామూహిక జనహననాన్ని సమర్థిస్తున్నాడు. ఎర్రకోటపై శత్రువు జండా ఎగరాలని ఆకాంక్షిస్తున్నాడు. అయినా మన ఒంటిపై చీమైనా పాకినట్లు అనిపించవద్దా? ఎందుకు మాట్లాడరు? ఈ నినాదాలను ఎందుకు సమర్థిస్తున్నారు? ఎలా భరిస్తున్నారు? ఇలాంటి సమాజం సమాజమేనా.. కాదు... ఇది ఒక మృత సమాజం..

[from  face book ]


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP