శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భీష్మఏకాదశి రోజు "హనుమత్ రక్షాయాగ" పారాయణములు ప్రారంభం .

>> Tuesday, February 16, 2016



భగవద్భంధువులందరకూ   నమస్కారములు

 ఇప్పటివరకు  ఏడు సార్లు  సాగిన  హనుమత్ రక్షాయాగం  సాధకుల సత్ సంకల్పాలను నెరవేరుస్తూ , వారి సమస్యలను తొలగించి భౌతిక ఆథ్యాత్మిక  శుభములను ప్రసాదించినది .  ఈ సంవత్సరం ఎనిమిదవ ఆవృతి ని  ఈనెల పద్దెనిమిది గురువారం    భీష్మ ఏకాదశి నాడు ప్రారంభించవలెనని  సద్గురుపరంపర నుండి   సూచింపబడినది . స్వామి వారి కరుణతో దివ్యముహూర్తము   నిర్ణయింపబడినది .

భీష్మ ఏకాదశి నుండి    హనుమజ్జయంతి [మే  ముప్పై ఒకటి       మంగళవారం   హనుమాన్ చాలీసా పారాయణములు   ,శ్రీరామ నామ లేఖనము  చేయవలెను.   పారాయణ సంఖ్య, శ్రీరామ నామ లేఖన సంఖ్య  ఎవరి శక్త్యానుసారం వారు నిర్ణయించుకొనగలరు.
 ఎవరి శక్త్యానుశారంగా వారు  ఎన్నిరోజులు పారాయనములు చేయాలో నిర్ణయించుకొనవచ్చు. కాకుంటే మండలము అంటే నలభై ఎనిమిది రోజులపాటు చేయటం చాలా మంచిది.
ప్రతిరోజు   ,,, అలావీలుకానివారు మంగళ ,శనివారములలో నైనా  మీ సమీపం లోని స్వామి ఆలయంలో యథాశక్తి ప్రదక్షణములు చేయవలెను.
మీ పారాయణముల సంఖ్యను,  శ్రీరామనామ లేఖన ప్రతులను    మే ఇరవై అయిదు నాటికి మాకు అందేలా పంపగలరు.  వీలైనవారంతా   పూర్ణాహుతి కార్యక్రమమునకు రావచ్చు.

వారి వారి సంకల్పములను స్వామికి చెప్పుకొని    పారాయణములు. అలాగే ఒక చిన్న నోట్ పుస్తకముపై గాని శ్రీరామ నామలేఖన పుస్తకములపై గాని శ్రీరామనామ లేఖనం ప్రారంభించగలరు.
  మీ గోత్రనామములను     durgeswara@gmail.com     నకు పంపగలరు. ఇంకా ఏవైనా సందేహములున్నట్లైతే మరిన్ని వివరములకు  9948235641  లో సంప్రదించగలరు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP