మన లక్ష్మి కి కార్తీక సోమవారం నాడు "నంది" పుట్టాడు
>> Monday, December 7, 2015
నిన్నమొన్నటిదాకా చిన్నపిల్లలా గెంతులు వేసిన లక్ష్మి [గోమాత] ఈరోజు తల్లి అయింది శుభసమయంలో కపిలవర్ణపు మోముపై విభూది అలుముకున్నట్లు ఉన్న నందుబాబుకు జన్మనిచ్చింది . తెల్లవారుఝాము నాలుగుగంటలకు నేను మా ఆవిడా గదిలోంచి బయటకొచ్చి చూసేసరికి లక్ష్మి మందిరం ముందున్న మండపం [ఆవిడ రోజూ అక్కడ పనుకోవటానికే ఇష్టపడుతుంది]లో నుండి క్రిందకు దిగి ఉంది . ఏమ్మా లేచావా ? అంటూ నేను వెళ్లి తలుగు విప్పదీయగనే చేలోకి వెళ్లి నిలబడింది . బయట చలిగాఉంది రమ్మని తీసుకురావటానికి ప్రయత్నించే సమయానికే నెప్పులు రావటం లక్ష్మి ప్రసవనొప్పులతో అల్లాడిపోవటం మొదలైంది ,నేను ఊర్లో ఉన్నమావాళ్ళకు ఫోన్ చేసే పిలచాను కార్తీకచివరి సోమవారం ఈరోజు ప్రభాతసమయ శుభముహూర్తాన నందు బాబును ఈనింది . కార్తీక అభిషేకాలలో పాల్గొంటున్న సాధకులంతా ఆ సమయానికి పీఠానికి చేరుకున్నారు . కార్తీక మాసం పూర్తయ్యే లోగా స్వామి అభిషేకానికి పాలు ఇవ్వటానికే లక్ష్మి ఈనిందని అందరూ సంతోషం తో కేరింతలు కొట్టారు మధ్యాహ్నం నుండి లేచి తిరుగుతున్నది నందిబాబు . ఇంట్లో ఉన్న రెండు జర్మన్షేఫర్డ్ కుక్కలు [రాజు,చంటి ] దూడ దగ్గరకు రావాలని ఒకటే గొడవ .వాటి సంతోషం పట్టనలవి కాకుండా ఉంది .పొద్దున్నుంచి అన్నము కూడా సరిగా తినకుండా దగ్గరకొచ్చినప్పుడల్లా నంది బాబును నాకుతూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నాయి
తల్లిదగ్గర పాలుతాగటం నేర్పుతున్న సురేంద్రారెడ్డి
మా అమ్మగారితో
5 వ్యాఖ్యలు:
భలే ఉందండీ శ్రీనివాస్ గారూ .. ఒకసారి దాన్ని చూడడానికి అయినా ఆ ఊరేళ్ళాలి
సంతోషకరమైన వార్త చెప్పారు. వేదరూపమైన నంది పీఠంలోకి కార్తీకమాసంలో వచ్చింది.
నిన్న మా అమ్మాయికి చూపిస్తే, లక్ష్మి అని గుర్తు పట్టింది.
your love for cows is commendable sir.
చాలా చాలా సంతోషం అండి.
Chala Anandakaram
Post a Comment