సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నందుకు దేశ బహిష్కరణ
>> Wednesday, November 18, 2015
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): అనుమతి
లేకుండా సత్యనారాయణ వ్రతం చేసి, గట్టిగా శ్లోకాలను చదివి ఇతరులకు ఇబ్బంది
కల్గించారనే అభియోగంపై తొమ్మిది మంది భారతీయులు దేశ బహిష్కరణకు గురయ్యారు.
కువైట్‌లో వివిధ హోదాలలో పని చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్,
ఉడిపి ప్రాంతాలకు చెందిన ప్రవాసీయులు భారతీయ ఎంబసీ అనుమతితో ఒక ప్రవాసీ
సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా
సత్యనారాయణ వ్రతం సహా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం
కూడా వ్రతం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా గట్టిగా శ్లోకాలను
చదవడంతో తమకు ఇబ్బంది కలిగిదంటూ చుట్టుపక్కల ఉన్న అరబ్బులు పోలీసులకు
ఫిర్యాదు చేశారు. దీంతో పూజా కార్యక్రమంతో సంబంధం ఉన్న 11 మందిని అరెస్ట్
చేశారు. నెలరోజుల పాటు కస్టడీలో ఉంచారు. తర్వాత వారిలో 9 మంది వీసాలను
రద్దు చేసి కువైట్ నుంచి బహిష్కరించారు. అంతేకాదు వీరు తమ జీవిత కాలంలో ఏ
గల్ఫ్ దేశంలోనూ ప్రవేశించకుండా నిషేధం విధించారు. వీరిపై దేశ బహిష్కరణ
శిక్ష విధించకుండా భారతీయ ఎంబసీ, సహా కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి
అనంతకుమార్, ఇతర నేతలు ప్రయత్నించినా కువైట్ పోలీసులు ఒప్పుకోలేదని
తెలిసింది. ఇదే కారణంతో గత ఏడాది సౌదీ అరేబియాలోనూ కర్ణాటక, కేరళ
రాష్ర్టాలకు చెందిన క్రైస్తవులపై కఠిన చర్యలు తీసుకొన్న సంగతి తెలిసిందే.
[ దీనిపై మన మన మేతావులు ఏ మంటారో ?]
2 వ్యాఖ్యలు:
అక్కడ మతపరమైన రాజ్యాంగాలున్న దేశాల్లో అధికారమతాన్ని కాని దాన్ని అనుసరించేవారిని కాని ఏమాత్రం ఇబ్బందిపెట్టరాదు. వాళ్ళదే ఇష్టారాజ్యం. అందుచేత అక్కడ మనవాళ్ళదే తప్పు ఏ మాత్రం తమ మతాన్ని పాటించినా కూడా అని మన మేతావులు తాళం వేస్తారు.
ఇక్కడ మనది లౌకిక రాజ్యం కాబట్టి మైనారిటీ మతాల్ని కాని వాటిని అనుసరించే వారిని కాని ఏమాత్రం ఇబ్బంది పెట్టరాదు. వారిదే ఇష్టారాజ్యం. అందుకని ఇక్కడ మనవాళ్ళదే తప్పు తమ మతాన్ని పాటిస్తే కూడా అంటారు మన మేతావులు.
ఇలా కొనసాగగా కొనసాగగా మైనారిటీ మతం ఒకటి మెజారిటీ అవుతుంది. ఇంక చెప్పేదేముంది? మొదటి పేరా ఇక్కడికి వస్తుంది. ఇక్కద మతపరమైన రాజ్యాంగం ఉండే ఈదేశంలో అధికారమతాన్ని కాని దాన్ని అనుసరించేవారిని కాని ఏమాత్రం ఇబ్బందిపెట్టరాదు. వాళ్ళదే ఇష్టారాజ్యం. అందుచేత నాడు కూడా ఇక్కడ మనవాళ్ళదే తప్పు ఏ మాత్రం తమ మతాన్ని పాటించినా కూడా అని మన మేతావులు తాళం వేస్తారు.
అంటే హిందువులకి ఏ హక్కూఎప్పుడూ ఉండదు. అదీ మన మేతావుల సిధ్ధాంతం.
సౌదీ అరేబియా ఇంకా ఘోరం. మహిళలు అందరూ (మతమేదయినా సరే) ఇంటి బయటికి వస్తే బురఖా వేసుకోవాలి. ఇస్లామేతర మతపరమయిన వెబ్ సైటులు ఫైర్వాల్ ద్వారా నిషేధం. మద్యాహ్న ప్రార్తన వేళలలో మసీదుకు వెళ్ళని ముస్లిములను "మత పోలీసులు" బెదిరిస్తారు. ఇంకా ఎన్నెన్నో!
Post a Comment