మీ గోత్రనామాలను పంపి "కార్తీక సాధనా శిబిరం"లో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నాము .
>> Tuesday, November 10, 2015
భక్తవత్సలుడైన పరమాత్మ మనలను కరుణించేందుకై వివిధరూపాలనుధరించి మన అర్చనాదులను అందుకుంటారు. అందుకై కొన్ని విశేషసమయాలు మామూలు రోజులకంటే ఎక్కువ గా ఫలితాలనిస్తాయని మహర్షులు నిర్ణయించి ఉన్నారు. అందులో కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైనది. ఈ సమయాన చేసే జపతపాదులు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. మనిషి మానసికశక్తులు విశేషంగా జాగృతమవుతాయి .
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నందు ఈ సంవత్సరం కూడా[ నవంబర్ 12 నుండి డిసెంబర్ 11 వరకు ] కార్తీక సాధనా శిబిరము నిర్వహించబడుతున్నది.
ప్రతిరోజూ ప్రభాత సమయాన పీఠమునకు చేరుకుని సాధకులంతా మట్టితో శివలింగాలను [పార్థివలింగం] నిర్మించుకుని అభిషేకాదులతో శివారాధన జరుపుతారు . అనంతరం శివపంచాక్షరీ మహామంత్రాన్ని జపిస్తూ ధ్యానంచేస్తారు. ఈసాధనలో పాల్గొనేవారు విద్యాధికులనుండి చదువులేని రైతులు కూలీలు కూడా ఉంటారు కనుక అభిషేకసమయములలో వారివారి అర్హతానుసారంగా రుద్రసూక్తముగాని లేక శతరుద్రీయముగాని ఏమీరానివారు శివనామస్మరణతోగాని స్వామివారిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తారు.
ఇక్కడకు వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనుటకు అవకాశం లేనివారు తమతమ స్థలములనుండే తమగృహములలో నిత్యం శివపంచాక్షరీ జపం చేసి మాసాంతమున జరిగే పూర్ణాహుతి నాటికి తమ జపసంఖ్యను తెలుపుతారు. మీగోత్రనామాలను పంపి మీరూ అలా పంచాక్షరీ జపం చేసి ఈ సాధనలో పాల్గొనవచ్చు. ఇక్కడ జరిగే నిత్యాభిషేకములలో మీగోత్రనామాలతోనూ సంకల్పం చెప్పబడుతుంది. అలాగే సహస్రలింగార్చనలో మీ కుటుంబం తరపున ఒక లింగమును ప్రతిష్టించి అర్చించటం జరుగుతుంది. అవకాశం ఉన్నవారు ఈ మాసం లో ఏరోజైనా వచ్చి ప్రత్యక్షంగా అభిషేకములో పాల్గొనవచ్చు. మీకు ఇక్కడ మాతోపాటు భోజనము,వసతి ఏర్పాట్లు ఉంటాయి .
చివరిరోజు పూర్ణాహుతి హోమము, అన్నప్రసాద వితరణ జరుగుతుంది.
అనంతకరుణామయుడైన పరమేశ్వరుని అనుగ్రహం మీకందరకూ కలగాలని ఈ సాధనాకార్యక్రమమునకు మిమ్మలనందరనీ ఆహ్వానిస్తున్నాము
మీగోత్రనామాలను durgeswara@gmail.com పంపగలరు.

1 వ్యాఖ్యలు:
అద్భుతం
Post a Comment