శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మరల వైదిక ధర్మపు వైభవమును చూడగలమా?

>> Thursday, June 18, 2015

* నేటి వివాహ వ్యవస్థ మన సంప్రదాయాలను పూర్తిగా విస్మరించింది. పురోహితులుగూడా తూతూ మంత్రం గా ముగిస్తున్నారు. వైదిక ధర్మం కనుమరుగవుతోంది. మరల వైదిక ధర్మపు వైభవమును చూడగలమా?
-వి.బాలకేశవులు, గిద్దలూరు
ఈమధ్యనే ఒక విదేశీయుడు చెప్పినట్లుగా ఒక దేశంలో అత్యధిక సంఖ్యాకులు అనసరించే ధర్మాన్ని అదే ధర్మానుయాలు విమర్శించటమనేది ప్రపంచంలో ఒక భరతదేశంలో మాత్రమే వుంటోంది. ఈ దుస్థితి తొలగితే వైదిక ధర్మం పునర్వైభవాన్ని అందుకుంటుంది. అది జరగాలంటే, పిల్లలకు మన వైదిక ధర్మాన్ని గురించి చిన్నప్పటినుంచే మనం బోధించగలగాలి. ఇతర మతాల వ్యవహారాలలో వేలుపెట్టడానికి దమ్ములేని ప్రభుత్వాలు, మన ధర్మంలో తలదూర్చటాన్ని మనం అరికట్టగలగాలి.
* పరమశివునికి పశుపతి అని పేరు ఎందుకు వచ్చింది? కృష్ణుడు గోపాలుడు అవటానికీ దీనికీ ఏమైనా సంబంధం వుందా? - యజ్ఞేశ్, హైదరాబాదు
అహంకార మమకార పాశాలుగల జీవులు పశువులు. ఆ పాశాలను వదిలించేవాడు పశుపతి. జీవులే గోవులు. వారికి జీవత్వాన్ని వదిలించి, పరమాత్మత్వాన్ని కలిగించేవాడే గోపాలుడు. ఈ నామాల అంతరార్థాలను బట్టి శివకేశవుల అభేదం స్పష్టం కావటం లేదా?
* వచ్చినవాడు ఇంద్రుడని తెలిసినా అహల్య మోహపడిందని చదివాను. అది నిజమా? - సీతాలక్ష్మి, నెల్లూరు
వాల్మీకి మహర్షి అలాగే చెప్పాడు. దేవేంద్రుడిది తేజోమయ దేహం. అహల్యది పథ్వీమయదేహం. ఈ దేహాలకు సంగమం కుదరదు. కానీ, ఉన్నత తాపసిక స్థాయిలో ఉన్నవారికి మానసిక సంకల్పంలో దోషం ప్రవేశించినా సరే, వారి ఉన్నతస్థితి పడిపోతుందని బోధించటానికే ఆ మహర్షి అహల్య చరిత్రను మనకు అందించాడు.
* రావణాసురుడు బ్రహ్మచే మృత్యువు రాకుండా వరం పొందాడు కదా! అగస్త్యమునికి రామునకు అనుగ్రహించిన బ్రహ్మస్తమ్రుచే మరణించాడు కదా!
- రామారావు, వెల్లూరు
మీరు గ్రంథాలను కలగాపులగం చేసుకుంటున్నట్లున్నారు. రావణుడికి బ్రహ్మదేవుడు నర, వానరుల ద్వారా వినా, ఇతరుల వల్ల మృత్యువులేదని వరమిచ్చాడు. అగస్త్యమహర్షి శ్రీరాముడికి ఉపదేశించింది ఆదిత్య హృదయమే గాని, బ్రహ్మాస్త్రం కాదు.
* రాఖీ పండుగ విశిష్టచరిత్ర వుంటే తెలుపండి?
- యన్.సురేంద్ర, కొత్తగాజువాక
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమకు ధర్మశాస్త్ర గ్రంథాలలో పెట్టిన పేరు ‘‘హోళికా పూర్ణిమ’’. ఆరోజు హోళికోత్సవము అనే పేరుతో రంగురంగుల జలధారలతో కృష్ణుడ్ణి అభిషేకించాలి. దీపావళి పండుగకు వికృత రూపంగా బాణసంచా పెరిగిపోయినట్లుగా, రంగుల అభిషేకాలు ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకునే ఆచారంగా విపరిణామం చెందా యి. ఇది స్ర్తిపురుషులలో వింత చేష్టలకు దారితీయకుండా నిరోధించటంకోసం మధ్యయుగాలలో రాఖీ బంధనమనే నూతన ప్రక్రియ రూపొందిందని చారిత్రకులు అంటున్నారు.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP