శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సైకిల్ పై పార్లమెంట్ కెళ్ళే ఈ ఎంపీ ని గుర్తించరు.. ప్రజారోగ్యం కోసం శ్రమిమ్చే రాందేవ్ బాబాని సహించదు ఈ మీడీయా.. ఎందుకంటే వీళ్ళు హిందువులు కనుక

>> Sunday, May 3, 2015

రామ్ దేవ్ బాబా....
ఇతనికి 8 సం. వయసులోనే పెరాల్సిస్ వచ్చి ఎడమభాగం మొత్తం చచ్చుపడింది. ఇతని తల్లితండ్రులు కూలీ పనులు చేసుకుని బ్రతికేటి వారు. ఆ పరిస్థితుల్లో అతన్ని పోషించలేక హరిద్వార్ లోని ఒక ఆశ్రమంలో వదిలి వెళ్లారు. ఆ ఆశ్రమంలో ఉన్న యోగులు, మహానుభావులు అతన్ని చేరదీసి పంచకర్మ, ఆయుర్వేదం, యోగలతో అతన్ని 100% ఆరోగ్యవంతుణ్ణి చేసి, ఆదర్శమూర్తిగా తీర్చి దిద్దారు. ఈ క్రియలు వల్ల వచ్చే ఫలితాలు మానవాళికి అందాలని ఆ రామ్ దేవ్ బాబాగారి తపన. హిమాలయాల్లో దొరికే ఆహార పదార్ధాలు పరిపుష్టి అయినవి. ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వాడరు. అక్కడ దొరికే వనమూలికలు ప్రపంచంలో ఎక్కడ దొరకవు. పతంజలి ప్రాడక్ట్స్ ఎక్కువ అక్కడి లభించే పదార్ధాలతో తయారయ్యేవే.. చాలా స్వల్ప లాభాలతో ప్రజలకి తక్కువ ధరకు అందించబడుతుంది. ఉదా:- గోధుమ పిండి బయట మార్కెట్ లో Kg. 35 నుండి 50 రూ. అమ్మబడుతుంది. కానీ పతంజలి వారు రెండు కేజీ ల ప్యాకెట్ కేవలం 62 రూ. ఇస్తున్నారు. ఆ లాభం కూడా ఎందుకంటే అనాధలకు, వృద్ధుల సేవ కొరకు మరియు ఈ సేవ కార్యక్రమాలు అందరికి అందించటం కొరకు!
ఇలాంటి గొప్ప వ్యక్తిని విమర్శించే వారు ఎవ్వరో? వారి వెనుక ఎటువంటి శక్తులు పనిచేస్తున్నవో? ఎందుకోసం పని చేస్తున్నవో ఆలోచించండి!!!
Naani Sahasra's photo. 

1 వ్యాఖ్యలు:

Kondala Rao Palla May 3, 2015 at 11:23 PM  

సుందరయ్యగారు గతంలో ఇలా సైకిల్ పై చట్టసభలకు వెళ్లేవారని విన్నాను. ఇపుడు కూడా ఉన్నారన్న మాట. అభినందనీయం. ఇటువంటి వారికి మీడియాలో తగిన ప్రచారం రాకపోవడం దురదృష్టకరం.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP