;కొండగురునాథ స్వామి తిరుణాళ్ల మాఘపౌర్ణమి రోజు
>> Monday, February 2, 2015
ఈరోజు
[మాఘపౌర్ణమి] మావూరి కొండపై వేంచేసియున్న కొండగురునాథుని తిరుణాళ్ళ.
రాష్త్రంలో వివిధప్రాంతాలలో స్వామి వారిని కొండగురునాథ, గురునాధ, గురప్ప
అనేపేర్లతో కులదైవముగా కొలుస్తారు. దక్షిణామూర్తి స్వరూపమైన స్వామి
వేపవృక్షరూపంలో వైదీశ్వరన్ కోవెల్ లోవలె] ఉండగా ఈప్రాంతం లోని మెకపాడు
కరణం గారు కొష్ఠం నిర్మాణనిమిత్తం కూలీల చేత కొట్టించగా రక్తం,పాలు
చిమ్మాయత. పనివాళ్లు భయపడినా మూర్ఖంగా వృక్షాన్ని కొట్టించి పాక నిర్మాణం
కప్పు పూర్తిచెసి కిందకు దిగగానే ఒక్కసారిగా భగ్గుమని మంటలు లేచి పాక
దగ్దమయింది. స్వామి వారు ఓభక్తున్ని ఆవేశించి తన ఉనికిని తెలియజెశరట,
ఆబూడిద కుప్పల్లో మిగిలిన మూడు మొద్దులను దారుశిలలుగా కొండపై
ప్రతిష్టించారట. ఎన్నివందలసంవత్సరాలయిమ్దో తెలియదు గాని అప్పటినుండి
ఇప్పటివరకు స్వామివారు ఎండకు ,వానకు అలానే ఉన్నాచెక్కుచెదరకుండా నిలుచుని
భక్తులను కాపాడుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో పలు కుటుంబాలలో గురప్పపొంగలి
నివేదించనిదే పెళ్లి జరగదు. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఇక్కడ ఉన్న
సంతానలింగేశ్వర స్వామి వారి లింగాన్ని భార్యాభర్తా తడిబట్తలతో వచ్చి
తిప్పితే సంతానం కలుగుతుంది. అమ్దుకే కొత్తదంపతులు ఈ తిరుణాళ్లకు విరివిగా
వస్తారు. స్వామివారు కొలువైఉన్న కొండ తాబేలు ఆకారం లో ఉంటుంది సాధనలో
మనసు త్వరగా అంతర్ముఖమవుతుందని పెద్దలమాట.ఎంతోమంది సాధకులు రహస్యంగా వచ్చి
తమ అనుష్ఠానాలను పూర్తిచేసుకుని వెళుతుంటారు.
ఈసంవత్సరం భారీగా ప్రభలు ,కోలాటాలు, భజనలు సాగుతున్నందున కోండకు జనం పోటెత్తుతున్నారు. నేను నిన్న ఉదయమే తెల్లవారు జామునే వెళ్లి అభిషేకం అర్చన చెసుకుని పొంగళ్లు చెల్లిమ్చి వచ్చాను ఈరోజు ఆజనం తాకిడి తట్టుకోలేమని.
జైశ్రీరాం
0 వ్యాఖ్యలు:
Post a Comment