శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

యంత్రాలతో ప్రయోజనమేనా?!

>> Friday, September 12, 2014

మన ప్రాచీన సంస్కృతి ఎల్లప్పుడూ బలీయమైన శక్తి క్షేత్రాలు లేదా అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాల చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. ఈ సంస్కృతిలో, జీవితంలోని ప్రతి అంశమూ కూడా ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఉన్నతికి తోడ్పడాలన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా అధ్యయనం చేయబడింది. ఆలయాలు లేదా ప్రతిష్ఠీకరించబడిన స్థలాలు ఈ ప్రాచీన సమాజాల యొక్క నివాస ప్రాంతాల మధ్యలో ఉండేవి. ఒక ప్రతిష్ఠీకరించబడిన స్థలంలో నివసించడం మానవ శ్రేయస్సుని పెంపొందించి, జీవితంలోని వివిధ విషయాల్లో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఒక ప్రతిష్ఠీకరించబడిన స్థలంలో నివసించడం మానవ శ్రేయస్సుని పెంపొందించి,

మానవ శ్రేయస్సుని సృష్టించి, జీవితంలోని వివిధ అంశాలలో ప్రయోజనాలను పొందడానికి ప్రాణ శక్తులను ఉపయోగించే ప్రక్రియనే ప్రతిష్ఠీకరించడం అంటారు. అది భౌతిక పధార్ధాన్ని అత్యంత సూక్ష్మమైన ప్రకంపనగా శక్తివంతం చేసే ఒక ప్రక్రియ. అది ఒక రాయిని, ఒక ఖాళీ ప్రదేశాన్ని, అసలు ఒకరి సొంత శరీరాన్ని కూడా ఒక దివ్యమైన అవకాశంగా పరివర్తనం చేయగల ఒక విజ్ఞా నం. అయితే యం త్రాలు...తంత్రాలు మనిషికి తాత్కాలిక ఉపశమనం కలిగించేవే...కష్టపడాలి...ఆ తర్వాత ఫలితాన్ని భగవంతుడిపై వదిలేయాలి. అంతేగానీ తెలిసీ తెలియకుండా యంత్రాలను మిడిమిడి జ్ఞానంతో ప్రతిష్ఠింపజేసుకుంటే ఎక్కువగా కీడువాటిల్లే ప్రమాదం లేకపోలేదు.

అనాదిగా ఉన్న ప్రక్రియ:
నేటి ప్రపంచంలో కూడా శక్తిపూరిత యంత్రాల ద్వారా మీరూ, మీ కుటుంబం ప్రతిష్టీకరించబడిన ప్రదేశంలో నివసించే అవకాశం ఇంకా ఉంది. ఆత్మజ్ఞానులైన వారూ, యోగులు అనాది కాలం నుండి ప్రజలకు వారి తక్షణ మరియ శాశ్వత శ్రేయస్సు కోసమై ఈ యంత్రాలను తయారుచేసి అందిస్తూ వచ్చారు. అలాగే సద్గురు కూడా ప్రాచీన శాస్త్రమైన రసవైద్యంలో చెప్పిన విధంగా ఘనీభవించిన పాదరసాన్ని ఉపయోగించి వివిధ లింగ భైరవి రూపాలను, ముఖ్యంగా వారి గృహాలలో లేదా పని లేదా వ్యాపార స్థానాలలో ఉంచుకోవడానికి వీలుగా లింగభైరవి యంత్రాలను సృష్టించారు. ఇవి ఐశ్వర్యారోగ్యాలను కలిగించి, పెంపొందించిడమే కాకుండా, అన్ని ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందిస్తాయి.ఈ శక్తివంతమైన యంత్రాలను సొంతం చేసుకొని పూర్వకాలంలో ఆరోగ్య, ఐశ్వర్యవంతులుగా ప్రజలు జీవించేవారు.

ప్రతిష్ఠీకరించడం:
మట్టిని ఆహారంగా రూపాంతరం చెందిస్తే, మనము దానిని వ్యవసాయం అంటాము. ఆహారాన్ని మాంసమూ, ఎముకలుగా మారిస్తే దానిని జీర్ణక్రియ అంటాము. మాంసాన్ని మట్టిగా మారిస్తే దానిని దహనం అంటాము. ఈ మాంసాన్ని లేదా ఒక రాయిని లేదా ఒక ఖాళీ ప్రదేశాన్ని ఒక దివ్య అవకాశంగా మార్చుకుంటే, దానిని ప్రతిష్ఠీకరించడం అంటారు లింగ భైరవి యంత్రం సంవత్సరానికి రెండు సార్లు పౌర్ణమి రాత్రి సమయంలో యోగి, మర్మజ్ఞుడు ఐన సద్గురు సమక్షంలో ఇవ్వబడుతుంది. ఇచ్చే గురువు నుండి ఈ యంత్రాన్ని ప్రత్యక్షంగా అందుకునేటప్పుడు ఎదుటివారు ఒక శక్తివంతమైన ప్రక్రియలోకి ఉపదేశింపబడుతారు.

మరింత మెరుగైన జీవన విధానం:
undefinedప్రాధమికంగా యంత్రం ఒక రూపం. ఒక నిర్దేశిత ఉద్దేశ్యం కోసం ఒక భౌతిక రూపాన్ని ఉపయోగించినప్పుడు మనము దానిని ఒక యంత్రం లేదా మెషీను అని అంటాం. మానవుడు నిరంతరం తనను తాను మెరుగుపరచుకోవాలని కోరుకుంటాడు. అంటే మనము కనుగొనే లేదా తయారు చేసే ప్రతి మెషీను కూడా మనము ఇప్పటికే చేయగలిగిన వాటిని మరింత మెరుగ్గా చేయడం కోసమే. ఐతే, బహుశా ప్రస్తుతం ఈ రెండిటినీ అనుసంధానించ లేని విధంగా మనం యంత్రాలను తయారు చేస్తున్నాము.మనం కనుగొనే లేదా తయారు చేసే ప్రతి మెషీను కూడా మనము ఇప్పటికే చేయగలిగిన వాటిని మరింత మెరుగ్గా చేయడం కోసమే యంత్రం ఒక మెషీను. ఇవి భౌతికపరమైన పునాదిలో పొదగబడి ఉన్నా కూడా అవి పూర్తిగా శక్తి రూపాలు. అంటే వాటిలో జడత్వం లేదు. అవి జీవితాంతం, ఇంకా జీవితం తర్వాత కూడా 24 గంటలూ పని చేస్తూనే ఉంటాయి. మనము ఒకసారి భౌతికపదార్ధాలను ఉపయోగించి మెషీన్లను తయారు చేస్తే వాటిలో కొంత జడత్వం ఉంటుంది.

జడత్వం భౌతికమైన వాటి సహజ ప్రకృతి. మన దేశంలో, ప్రాచీన కాలంలో, ఈ గ్రహం మీద ఉండే భౌతిక పదార్ధాలను ఉపయోగించకుండగా యంత్రాలను సృష్టించే టెక్నాలజీలను కనుగొన్నారు. ఎందుకంటే వారు యంత్రాలలో జడత్వం వద్దనుకున్నారు. మనం, అంటే మానవులం నమ్మదగ్గ వారిమి కాదని వారికి తెలుసు కాబట్టి, మనం చేసేదాని మీద గానీ, చేయనిదాని మీద గానీ ఆధారపడని యంత్రాలను తయారు చేయాలనుకున్నారు. మనం ఊగిసలాడుతూ ఉంటాం. నిన్న మీకు ఏంతో ముఖ్యమని అనిపించిన విషయం రేపటి రోజున ఎంతమాత్రమూ ముఖ్యము అనిపించదు.మీ కోసం మీరే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, రాత్రిపూట పడుకున్నప్పుడు దాని కోసం మీరు పని చేయడం లేదు. మీరు ఉదయాన్నే దాన్ని మొదలుపెట్టవచ్చు కానీ అది అప్పటికి నీరుగారి పోవచ్చు. అందుకని యోగులు జడత్వం లేని శక్తి రూపాలను సృష్టించారు. అవి వ్యక్తులు జఢత్వంగా ఉన్న సమయంలో కూడా పని చేస్తూనే ఉంటాయి. నిద్ర అలాంటిదే అది ఆవహిస్తే... మనుషులు భౌతికత్వం యొక్క జడత్వానికి వశులవుతారు. మనుషులకు శరీరం లేకపోకపోయినటై్లతే, అసలు నిద్రే పోరు.

జడత్వం లేని మెషీన్లను వివిధ ఉద్దేశ్యాల కోసం, అంటే ఆరోగ్యం, సంపద, సౌభాగ్యం, మేధస్సుల కోసం సృష్టించవచ్చు. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత, మనం పడుకున్నా, స్పృహలో లేకపోయినా, దాని గురించి మనం పట్టించుకోకపోయినా కూడా యంత్రం ఆ దిశలో మన కోసం పని చేస్తూనే ఉంటుంది. యంత్రాలు భౌతికపరమైన పునాదిలో పొదగబడి ఉన్నా కూడా అవి పూర్తిగా శక్తి రూపాలు, అంటే వాటిలో జఢత్వం లేదు.మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత, పడుకున్నా, స్పృహలో లేకపోయినా, దాని గురించి మీరు పట్టించుకోకపోయినా కూడా యంత్రం ఆ దిశలో మీ కోసం పని చేస్తూనే ఉంటుంది

ఆత్మజ్ఞానుల పర్యవేక్షణలో:
ఆత్మజ్ఞానులు ప్రజలకు వారి తక్షణ మరియ శాశ్వత శ్రేయస్సు కోసమై ఈ యంత్రాలను తయారుచేసి అందిస్తూ వచ్చారు. యోగులు కూడా వివిధ లింగ భైరవి రూపాలను కొన్నిటిని ప్రాచీన శాస్త్రమైన రసవైద్యంలో చెప్పిన విధంగా ఘనీభవించిన పా దరసాన్ని ఉపయోగించి, ప్రజ లు వారి మెడలో ధరిం చడానికి వీలుగా లేదా కారుల లో ఉంచు కోవడానికి వీలుగా ఒక పెండెం టులాగా, వారి గృహాలలో లేదా పని లేదా వ్యా పార స్థానాలలో ఉంచుకోవడానికి వీలుగా యంత్రాల రూపాలలో సృష్టించారు.
---------------------------------------------------------------------------------------------

నా అభిప్రాయం

  తీవ్రమైన సాధనాశక్తిగల ఉపాసకుల ద్వారా మంత్రజపం  ధారబోయబడిన యంత్రాలు మహిమాన్వితంగా ఉంటాయి కాని ఇప్పుడు మార్కెట్ గా వేలం వెర్రిగా సాగుతున్న అమ్మకపు యంత్రాలు నాలుక గీచుకోవడానికి కూడా పనికిరావు.   ఒకవ్యక్తి రోజుకు ఎంత మంత్రజపం చేయగలడు? ఒక్కో యంత్రానికి నిర్దేశించిన మంత్రజప సంఖ్య వేలలో,లక్షలలో ఉంటూంది. అంత జపం చేయాలంటే నెలలు తరబడి పడుతుంది. ఆయన ఏకాగ్రతనంతా కేంద్రీకరించి సాధించిన సాధనాశక్తిని  కేవలం వందలు వేలరూపాయలకు అమ్ముకుంటాడా ? అలా అమ్మితే అసలు మంత్రశక్తే నిర్వీర్యమవుతుంది . లాజిక్ గా  ఆలోచించి చూస్తే ఈ నాటి మాయా మార్కెట్ తంతు అర్ధమవుతుంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP