శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గణపతి పూజ చేశాం ...ఆయన తత్వంగూర్చి చదువుకున్నాం...సరే.......... ఆయన లా ఆచరణలో చూపామా !!!!!!!!

>> Sunday, August 31, 2014

భీష్మ హిందు
భీష్మ హిందు 6:18pm Aug 30
అందరూ వినాయక చవితికి పొస్టింగ్స్ మరియు చిత్ర విచిత్రమైన ఫొటోలు పెట్టారు. తమ తమ ఇళ్ళలో గణపతి పూజలు, బయట మన వీధులలో పెట్టబడిన వినాయక విగ్రహల వద్ద కూడా పూజలు చేసారు, వినాయక వ్రత కథలు చదువుకున్నారు. మరి వినాయక పూజలోని తత్వం ఎంతమందికి, ఎంతవరకు మనసుకి ఎక్కించుకున్నారు ??? వినాయకుడు పెద్ద పొట్ట కలవాడు, పెద్ద పెద్ద చెవులు కలవాడు అని చెబుతారు, తల్లి తండ్రులకి అయన ఇచ్చిన మర్యాద గురించి చెబుతారు వ్రత కథలలో...... అయన శరీర సౌందర్యం కంటే మానసిక సౌందర్యానికే ప్రాధాన్యత ఇచ్చాడు అనే తత్వాన్ని ఎంతమంది వంటపట్టించుకున్నారు... పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి అంటే ఎవరు ఏది చెప్పినా వినే లక్షణమునకు ప్రతీక.... భూప్రదక్షిణ చేయమని చెప్తే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసిన భూప్రదక్షిణతో సమానం అని చెప్పిన ఆ తత్వం ఎవరు పట్టుకున్నారు... కనీసం నిన్న ఒక్క రోజైనా తల్లితండ్రులకు ప్రదక్షిణ వేసారా...

నిన్న ముఖపుస్తకంలో మా ఇంట్లో వినాయకుడు అని, మా ఇంట్లో ఇలా పూజ చెసుకున్నాం అని, మీరు చెసుకున్నరా అనీ పోస్టింగ్స్ పెట్టారు.... ఒక్కరైనా మా తలితండ్రులకి గణేశ పూజానంతరం ప్రదక్షిణ వేసాము అని చెప్పలేదు ఎందుకని ??? సిగ్గుపడ్డరా అలా చెప్తే మీ తోటివారు ఏమి అనుకుంటారో అని... గర్వంగా చెప్పుకోండి మేము మా తల్లితండ్రులని పూజిస్తాము అని... తలిదండ్రులను గౌరవిద్దాము, నమస్కరిద్దాము, పూజిద్దాం... అప్పుడే మనం చేసిన, చేస్తున్న, చేయబోతున్న పూజలు కానీ, పనులలో కానీ విజయం సంప్రాప్తిస్తుంది.

ఇంత పెద్ద పోస్టింగ్ పెట్టాడు అసలు వీడు తల్లితండ్రులకి పూజ చేసాడా అనుకొవచ్చు.... నేను ప్రతిదినము నా మాతాపితరులకు నమస్కరించి మాత్రమే నా దైనందిన చర్యలు మొదలుపెడతాను.

ఎవరి మనోభావాలనైనా కించపరిస్తే క్షంతవ్యుడను. __/|\__
 
...................................................................................................................................భీష్మ

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP