శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సాయబు గారి భక్తి

>> Wednesday, August 13, 2014

అది 1982  టి టి దే సంస్థ స్వర్ణజయంతి కి తయారవబోతూంది 

షేక్ మస్తాన్ వలి  అనే సాయబుగారు గుంటూరు జిల్లావాసి  స్వామి భక్తుడు  

స్వామికోవెలలో దర్శనమునకువెళ్లి అర్చకుల వద్ద తన వొక చిన్న కోరిక వెలిబుచ్చేడు 
 
అర్చకులు విబ్రమం చెంది కార్యనిర్వహణాధికారి వద్దకు పంపేరు 

వారు లోపల సభ్యులతో చాలా వ్యవహారములలో  నిమగ్నమయిన సమయం లో వొక సాయబుగారు  వారిని కలవడానికి వచ్చేడ ని వర్తమానం వెళ్ళింది 

వారు అతడిని వెంటనే లోనికి రమ్మని మేము చాల పనిలో ఉన్నాము మీరు వచ్చిన పని వెంటనే తెలియచేయ్యవలసినది  అని చెప్పేరు 

నన్ను  లోనికి రానిచ్చినందుకు ధన్యవాదములు 

నా పేరు షేక్ మస్తాన్  గుంటూరు జిల్లాలో వొక చిన్న గ్రామము లో చిన్నవ్యాపారస్థుడను  మా యింట్లో వారందరమూ  కొన్ని తరాలనుండీ స్వామి, భక్తులము మేము ఇంటిలో రోజూ  ఉదయాన్నే లేచి స్వామీ సుప్రభాతం నించీ మంగళా   శాసనము వరకూ అన్నీ చదువుతాము  నాకు వెంకటేశ్వర గద్యం కూడా తప్పులులేకుండా చదవడం వచ్చు 

మా తాత గారు కొన్ని దశాబ్దాలకిందట స్వామికి 108 బంగారు పుష్ప లని కైoకర్యం  చేసి వాటి తో అష్టోత్తర సేవ చేయించాలని కోరిక  ధనం లేకపోవడం వల్ల  యిన్నాళ్ళూ  ఆ సేవా భాగ్యం కలగ లేదు  యిప్పుడు అన్నీ సమకూరేయి  ఈ పుష్పాలని స్వీకరించి నన్ను ధన్యుడ ని చేసి మా పూర్వీకుల మొక్కు తీర్చండి అని కోరేడు 

ఆ సభ లో నిశ్శబ్దం తాండవించింది  కొన్ని లిప్తలపాటుత తరువాత ఆ కార్యనిర్వహణాధికారి తేరుకుని  అయ్యా! ముందు కూర్చోండి . మీ వంటి భక్తులు రావడం మాకు చాలా ఆనందం గా వున్నాది   కాకుంటే మీరు యిచ్చిన ఈ పుష్పాలని స్వీకరిస్తాము కాని మీరు చెప్పినట్టు అష్టోత్తర పూజకి కొన్ని ప్రతి బంధకాలున్నాయి మేమయినా వారి వద్ద సేవకులమే వారు నిర్ణయించాలి  ఆయన అనుజ్ఞ అయితే కొద్ది రోజులలో మేము మీకోరిక తీరుస్తాము  అని వారికి అభయమిచ్చి సజల నయనాలతో పంపేసేరు 

1984 లో తి తి దే సంస్థ స్వర్ణ జయంతి ఉత్సవాల సమయం లో  ప్రతి మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన సేవ అనే ఆర్జిత సేవ ప్రారంభించి  ఆ సాయబు గారి స్వర్ణ పుష్పాలతో పూజ మొదలెట్టేరు 
 Regards
G .BHASKARA RAMAM
INDIA
 
 
ఆ సాహెబ్ గారి పేరు సయ్యద్ మీరా అనే భక్తుడు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ వాసి.   

దయిత వరప్రసాద్
 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP