శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీకో విషయం తెలుసా?ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు.

>> Wednesday, July 23, 2014


మీకో విషయం తెలుసా?ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? .....మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు.అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం...
 
[అంతర్జాలం నుండి అందిన వ్యాసం]
 by     RAVINDRANADH
8 8 0 1 0 1 1 3 6 3

4 వ్యాఖ్యలు:

Iconoclast July 23, 2014 at 3:54 PM  

ఆక్సిజన్ విషయంలో మీరన్నది సరికాదు. కుదిరితే Hemoglobin reactions గురించి చదువగలరు. రక్తమున్న ప్రతిప్రాణీ గాలినుంచి ఆక్సిజన్‌ని ఒకేవిధంగా ప్రాణవాయువుని సంగ్రహిస్తుంది -పీల్చుకున్నగాలిలోంచి ఐరన్ ఆక్సైడ్ సహాయంతో ఆక్సిజన్‌ని వేరుచేయడంద్వారా. ఈపధ్ధతివల్ల కొద్దిశాతమ్మేర ఆక్సిజన్‌ని రక్తంలోని ఐరన్ ఆక్సైడ్ ధాతువులు సంగ్రహించలేకపోవచ్చు. కానీ అది అన్నిప్రాణులవిషౌయంలోనూ నిజం. చివరిగా : రక్తమున్న ప్రాణులు ప్రాణవాయువుని తయారుచేయలేవు. తముపీల్చుకున్నదానిలోంచి కొంతభాగాన్ని వినియోగించుకోకుండా తిరిగి ఇవ్వగలవు. ఈ విషయంలో గోవులు ఏమాత్రమూ ప్రత్యేకమైన ప్రాణులుకావు.

Edge July 24, 2014 at 9:38 AM  

గోమాత గురించి అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు చాలా తెలియచేసారు, దుర్గేశ్వర గారు ధన్యవాదాలు. ఐతే, తార్కికంగా హేతుబద్ధంగా ఆలోచిస్తూ కారణము, ఋజువు, ఆధారము లాంటి పద్ధతులపై పట్టు పట్టేవారికోసం మరికొన్ని వివరాలు అందించ వలిసింది గా కోరుచున్నాను. మన్నించగలరు.

1. మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది.
ఆ గ్రంధి పేరు ఏమిటి? ఇది ఆవులకే ప్రత్యేకమా లేక గేదెలకు కూడా ఉంటుందా?
ఆ పాలు తాగడం వల్ల ఏ వ్యాధులు నయమౌతాయి?
2. మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి.
భారత జాతి ఆవుల లోని 36 రకాల పేర్లు, వివరాలు తెలియచేయ కలరు
వింత వ్యాది సోకడంతో నశించి పోయిన కొన్ని జాతుల వివరాలు తెలియచేయ కలరు
3. ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు
గత వంద సంవత్సరాలుగా మన గోవులను ఎగుమతి చేసుకొన్న ప్రపంచ దేశాల వివరాలు, ఎగుమతైన గోవుల సంఖ్య తెలియచేయకలరు
4. గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి.
47 రకాల మూల పదార్థాల పేర్లు, వివరాలు తెలియచేయ కలరు
5. పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు.
పరిశోధన చేసిన శాస్త్రజ్ఞుల పేర్లు, పరిశోధనాంశాలు వాటి ఫలితాలు అందించగలరు
300 రకాల మానవ, 25 రకాల వ్యవసాయ అవుషదాల వివరాలు తెలియచేయ కలరు

durgeswara July 24, 2014 at 9:53 AM  

మితృలకు
నమస్కారం
పై పొస్ట్ లో సమాచారమంతా యథాతథంగా అంతర్జాలంలో ప్రచారమవుతూ నావద్దకొచ్చినది. గోవుయొక్క ప్రాధాన్యత అందరికీ అందించటం లక్ష్యంగా ఈ వార్తను నా బ్లాగులో ఉంచాను. ఇక ఈవిషయంలో మనం శాస్త్రీయ ఆధారాలను తెలుసుకోవటం మంచిదే. ఈవిషయం ఈ వార్తను నాకు పంపిన మిత్రులద్వారా ఈ మెస్సేజ్ పంపినవారి ని ఆధారాలుకూడా ఇవ్వవలసినదిగా అడుగుతున్నాము. వారు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని వారు వచ్చాక ఆయనకందిన వివరాలన్నింటినీ అందిస్తారని మితృలు తెలిపారు. ఇక ఈవిషయం ఇక్కడ ఉండటం వలన ఇంకా మరింత సమాచారమున్న వారు కూడా ఈచర్చలో పాల్గొనే అవకాశం ఉందికనుక మరింత మేలుజరుగుతుంది . ధన్యవాదములు

Vsk Telangana July 26, 2014 at 8:24 AM  

Edge గారు చాలా తెలివైన వారని ఇప్పుడు తెలిసింది. వారి ముందు ఇక ఏ విషయం చెప్పకపోవడమే మంచిది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP