శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గోపూజ అంటే పసుపుకుంకుమలతో అలంకరించటం కాదు..... కడుపునింపటం

>> Friday, June 6, 2014

గోవు సకలదేవతా స్వరూపం .  భీమిపై మానవుల తల్లి. సకలదోషాలను పరిహరించి  శుభాలను  ప్రాప్తింపచేస్తుంది గోసేవ. గోపూజ. ఈమధ్యకాలంలో కాస్త గోవులపట్ల శ్రధ్ధాశక్తులు పెరుగుతున్నాయి ఆస్తికలోకంలో. ఏగుడిలో చూసినా గోపూజలు నిర్వహించబడుతున్నాయి. కొన్నిచోట్ల సామూహికంగా ఒక ఉత్సవంలా జరుపుతున్నారు. మంచిదే. కానీ  ఒక్కరోజు గుడికి వచ్చి  అక్కడ అట్టహాసంగా వివిధ పూజాద్రవ్యాలతో పూజచెసేవారు మాత్రం నాలుగు అరటిపండ్లన్నా పట్టుకురారు.  పాపం ఆ గోవులు మనం పసుపుకుంకుమలతో అలంకారాలు  చేస్తుంటే ఏవైనా   తినటానికి పెట్టమని ఎగబడుతుంటాయి . వాటిని అదిలించైనా మన పద్దతి ప్రకారం పూజ జరుపుతాము గాని వాటి ఆకలి తీర్చటానికి ప్రాధాన్యత ఇవ్వము. ఆమధ్య ఓ క్షేత్రంలో జరిగిన ఓ భారీ కార్యక్రమంలో నేనూ మాకార్యకర్తలూ పాల్గొన్నాము. అక్కడ గోపూజకు  బ్రహ్మాండంగా ఏర్పాట్లు  చేశారు. పూలతో సహా పూజాద్రవ్యాలన్నిటికీ బాగాఖర్చుపెట్టి  అరటిపండ్లుమాత్రం రెండంటే రెండు ఇచ్చారు పూజ   చేసే దంపతులకు .
నాకు  అలా
పూజచేయటం మనస్కరించక[ అలాచేయటం తప్పని కాదు.] మా కార్యకర్తనొకరిని పంపి ఒకసంచినిండా అరటిపండ్లు తెప్పించి అన్నింటికీ తినిపించాము. ఇదే తల్లీ  మేము నీకుచేయగలిగిన పూజ అని మనసులో చెప్పుకున్నాము.

మా మనవి ఏమిటంటే మీరు గోపూజకు  సిద్దమయితే పూజాద్రవ్యాలు వారకార్ధం తీసుకెళ్లండి. పచ్చిగడ్డి,మార్కెట్లో దెబ్బతిన్న కాయలు చౌకగా ఇస్తారు అవి ఎక్కువగా కొని తీసుకువెళ్ళండి. ఆగోవులకు కడుపునిండా పెట్టండి.
చేయగలిగితే మీపిల్లలకు చిరుతిళ్ళు కొనుక్కోవటానిఇస్తున్నట్లుగా రోజుకో రెండు మూడు రూపాయలు ఒక హుండిలో వేసి ఆడబ్బుతూ గోశాలలలో ఉన్న గోవులకు గ్రాసం కొని ఇవ్వండి.దాణా అయినా కొని ఇవ్వవచ్చు.
మీరు కడుపునింపిన ప్రతిసారీ తృప్తిగా దీవిస్తుంది గోమాత, అది మీకుటుంబానికి మీపిల్లల భవిష్యత్తుకు  శ్రీరామ రక్ష


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP