శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏమిస్వామీ ! ఈ ఆటంకాలు ?

>> Friday, May 9, 2014

స్వామి ఆజ్ఞగాభావించి అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం ప్రారంభించాము. "శ్రేయాంసి బహు విఘ్నాని" అనే వాక్యం నిజంచేస్తూ ఎదో ఒక ఆటంకం మనలను ఇబ్బందిపెడుతున్నది. గ్రావెల్ సరిచేయటానికి మనుషులకోసం ఐదురోజులు ఎదురు చూడాల్సి వచ్చి ఆలస్యమైనదే అనుకుని  బాధపడగా సమయానికి మనుషులను అందించారు స్వామి. ఆపద గడిచినదిలే అనుకునేసరికి ఇప్పుడు సెంట్రింగ్ చెక్క దొరకలేదని మేస్త్రీ ఆలస్యం చేస్తున్నాడు. దాదాపు పదిహేను యూనిట్ల చెక్క కావాల్సిఉంది . అయితే ముహూర్తములు ముగుస్తున్నాయని ముందుగా ఒప్పుకున్నవారికి చెక్క సరఫరా చేశామని  వెయిట్ చెయ్యమంటున్నారు చెక్కవాళ్లు.  మేస్త్రీ కాలుగాలిన పిల్లిలా  ఎన్ని ఊర్లు తిరుగుతున్నా చెక్క సెంట్రింగ్ దొరకలేదు అదీగాక నిన్నటివరకు ఎన్నికల సీజను. నేనుకూడా పోలింగ్ ఆఫీసర్ గా తెనాలి వెళ్ళీ డ్యూటీచేసి  నిన్నరాత్రే  ఇంటికి చేరాను.

ఇక్కడ ఇంకా చెక్క చేరలేదు. కనీసం ముందు గోడలు కట్టిద్దామంటే  కిటికీలు ద్వారబంధాలు ఇంకా తయారు చేపించలేదు వాటి అవసరం తరువాత అనుకున్నందున ఇలా అయింది. 

స్వామి ఇలా ఎందుకు పరీక్షిస్తున్నాడో ఆయనకే తెలియాలి.

దుర్గమకాజ జగతకే జేతే --సుగమ అనుగ్రహ తుమహరతేతే
జైశ్రీరాం
 

1 వ్యాఖ్యలు:

Vamshi Krishna May 10, 2014 at 5:51 AM  

దుర్గమమగు ఏ కార్యమైనా
సుగమము అగు హనుమాను అనుగ్రహమున....

రామ లక్ష్మణ జానకి
జై భోలో హనుమాను కి.....

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP