శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తలచినవెంటనే దర్శనమిచ్చిన స్వామి

>> Friday, May 30, 2014

రనమండలం   అనే వూరు మంత్రాలయం వద్ద వుంది  అక్కడ ఓ కొండ దాని మీద రాములవారి కోవేల  ఎదురుగా ఆంజనేయ స్వామీ విగ్రహం చాలా పెద్దది ఉందిట
అగస్త్యుల వారి అనుగ్రహం తో ఒకవ్యక్తి మత్రాలయం లో శ్రీ రాఘవేంధ్రస్వామీ ని నిజ దర్సనం చేసుకుని చేసుకుని వారే ప్రహ్లాదుడనీ తెలుసుకుని అక్కడ నుండి రనమండలం వెళ్లి ఆ పర్వతం యెక్కసాగేరు
చాల ఎండ గావుంది నీరు లేదు దాహం నాలిక పిడచగట్టుకు పోతూo టే వొక కొండ వాడు కనిపిస్తే నీరు కావాలని అడుగుతారు వాడు వొక కుండ నెత్తిన పెట్టుకున్నవాడు భయపడి పారిపోసాగేడు  వాడి వెనకనే కొండ దిగ నారంభించేరు వాడి వెనక పరిగెత్తి దగ్గరకు చేరేసరికి అక్కడ కుండ పడేసే వాడు పారిపోతాడు  ఆ కుండలో నీరుందేమో అని  చూస్తే అది కల్లు  కుండ  నిరుత్సాహ పడి చుట్టూ  చూస్తే పక్కనే కొంత దూరం లో వొక చెరువు కనపడుతుంది  అక్కడకి వెళ్లి చూస్తే స్వచ్చ మయిన నీరు కన్పించి తాగి   చుట్టూ చూస్తే కొంత దూరం లో వొక పాడు పడిన కోవెల కనిపిస్తుంది లోపలసీతా రాముల విగ్రహాలు వుంటాయి ఎక్కడా పూ జారి వున్నట్టు కనిపించక కోవెలచుట్టూ ప్రదక్షిణ చేసి కొంత దూరం లో పెద్ద ఆంజనేయ స్వామీ విగ్రహం కనిపించగా   స్వామీ వద్ద కు వెళ్ళగానే అంతవరకూ ఎంతో వేడిగా వున్నా వాతావరణం చల్లగా మారి ఆహ్లాదకరంగా అయిపోతుంది  స్వామీ పాదా లని పట్టుకుని కళ్ళు  మూసుకుని నామజపం చేస్తూండగానే ఆపాదాలు చల్లగా మంచు లా అయిపోతాయి ఏమి ఈ విచిత్రం అనుకుంటూ కళ్ళు తెరవగానే స్వామీ నిజ రూప దర్సనం అవుతుంది  స్వామీ ఆశీర్వాద ముద్రలో కనిపిస్థా రు కొద్ది సేపు అలా వుండి  వారు మాయం అయిపోగానే మళ్ళీ వాతావరనం వేడిగా అయిపోతుంది  అగస్త్యులవారిని అంత మంచి దర్శనం కలిగించినందుకు కృతజ్ఞత తో ప్రార్థించగానే వారు స్వామి దర్శనంచేసుకున్నావు కాబట్టి యిక నుండి నీ పేరు హనుమద్ధాస్  అవుతుంది అని ఆశీర్వదిస్తారు మ ని పర్సు లోంచి 101 రూపాయలు తీసి అక్కడ పట్టి యెగిరి పోకుండా వాటి మీద రాళ్ళు పెట్టి తిరిగి చెన్నై వెళ్లి పోతారు  యింటికి వేల్లీసరికి వొక m o receipt వుంటుంది  అది రసమండలాఅంజనేయస్వామి వారివద్దనుడి  వచ్చింది
ఆయన తల్లి  నాయనా !నేను యింతకాలం నించీ రామ కోటి రాస్తున్నాను  నాకు వారి దర్సనం కలగా లేదు నువ్వు ఏమీ చెయ్యకుండా  నీకు స్వామీ దర్సనం ఎందుకు కలిగింది అనీ అడుగుతుంది
ఆయన అగస్త్యులవారిని ఆ ప్రశ్న అడగ్గానే  అయన నువ్వు ఏమీ చెయ్యలేదు కాబట్టి అంత కష్టపడి ఆకొండ ఎక్కి వారి దర్సనం కలిగింది .కాని నిజ భక్తుడు కోరిన వెంటనే ఆయన   సీతారాముల దర్సనం యిస్తారు  నీ తల్లి అడగ లేదు కాని త్వరలో ఆమెకి స్వామీ దర్సనం కలుగుతుంది అంతే కాదు  ఆమె కొద్ది రోజులలో శివ సాయుజ్యం పొందుతుంది యిక ఆమెకి జన్మ లేదు  అనిచెప్తారు .

Regards
G .BHASKARA RAMAM
INDIA

1 వ్యాఖ్యలు:

anrd May 31, 2014 at 5:48 AM  

చక్కటి విషయాలను తెలియజేసారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP