శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రామనామము రక్షణరా....ఇటురారా ..అని చెప్పినా కర్మఫలితం తో వినిపించుకోక ప్రమాదం పాలైన యువకుడు.

>> Friday, April 25, 2014

ఈ సంవత్సరం హనుమత్ రక్షాయాగం లో ఇరవై నాలుగుకోట్ల రామనామలేఖనం జరుపుతున్న విషయం తెలిసినదే . సమయం దగ్గర పడుతున్నందున  వివిధ గ్రామాలలో  కార్యకర్తలుగా బాధ్యతలుతీసుకున్నవారందరినీ ఫోన్ ద్వారా పలకరిస్తున్నాము.  
ప్రకాశం జిల్లా లోని పెద్దవరం గ్రామం లో ఉన్న శంకర్ అనే కార్యకర్తకు  ఫోన్ చేశాను ఈరోజు.
 
శంకర్ ! ఈమధ్య మీరెవరూ ఫోన్ లో అందుబాటులో లేరు. రామనామ లేఖనం ఎంతవరకొచ్చింది . తీసుకున్న పుస్తకాలు అందరూ పూర్తిచేశారా ? అనడిగాను
స్వామీ మొన్నటిదాకా వ్యవసాయ పనులవత్తిడి,ఈమధ్య మాకు ఊర్లో ఇబ్బంది జరిగి , సూదకంలో ఉండటం వలన ఎవరినీ కలవలేదు. వరుసన ఒక ముసలావిడ, అనుకోకుండా  మా అన్న ఒకాయన మరణించారు. అందువలన దాదాపు నెలపాటు ఈ కార్యక్రమం గూర్చి  ఆలొచించలేదు అన్నాడు.

ములమ్మంటే సహజం పెద్దావిడ సహజ మరణం. కానీ మా అన్న [దాయాది] మరణమే మాకు చాలాబాధగా ఉంది. అన్నాడు.
అయ్యో ! ఏమయింది పాపం అనడిగాను

 కరెంట్ షాక్ తో చనిపోయాడు. వాడు చేతులారా ప్రమాదం తెచ్చుకున్నాడని అనిపిస్తుంది అన్నాడు.శంకర్

ఎలా జరిగింది ? అనడిగాను

ఇతను వెల్డింగ్ వర్క్  చేస్తుంటాడు. ఆపనిలో  కరెంట్ తో ఆటలాడు కునేలా వ్యవహరించే అతను సెల్ చార్జ్ పెడుతుంటే షాక్ కొట్టి చనిపోయాడు ,, అదీ విచిత్రం .

సెల్ చార్జర్లుకూడా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు జరుగుతున్నాయి అక్కడక్కడా అన్నాన్నేను .

అదీగాక  మావాడు ఈమధ్య ఒక బైక్ కొన్నాడు స్వామీ! దానిని కొన్నవాడు ప్రమాదంలో చనిపోయాడు,ఆతరువాత ఇంకొకరి చేతికి ఆబండి వెళ్లగానే అతనూ చనిపోయాడు. అది తెలిసీ కూడా మావాడు ఆబండి కొన్నాడట  ...విచారంతో చెప్పాడు శంకర్.

అయినా ఆపిల్లవాడు  పోయిపోయి అటువంటి బండి కొనుక్కోవట మెందుకు కర్మ ఫలితం కాకపోతే ! అని చెప్పి
త్వరగా పుస్తకాలు తీసుకున్నవారందరినీ వివరించండి అని ఫో పెట్టేశాను.

రామనామ లేఖనం పుస్తకాలు పంచుతూ ఆవూరిలో మాట్లాడిన మాటలు  గుర్తుకువచ్చాయి .
 కాలం చాలా ప్రమాదాలతో కూడి ఉంది . మన తెలివి తేటలు, మన బలాలు మనలను కాపాడతాయనుకోవటం వెర్రితనం. ఈ సమయంలో భగవన్నామమొక్కటె శరణ్యం. మనం ఏపని చేస్తున్నా భగవంతుని నామాన్ని స్మరించటం ద్వారా ఆపదలనుండి రక్షించబడతాం అని ఆరోజు ఆవూరి జనసమూహంతో సమావేశంలో మాట్ళాడాను. రామ నామము ఎక్కడ పలకబడుతుందో  అక్కడ హనుమంతుడు రక్షకుడై నిలుచుంటాడు. కనీసం రోజూ కొద్దిసేపైనా రామనామం లిఖించడం అలవాటు చెసుకోండి . అందుకోసం ఈ యాగంలో పాల్గొనండి ఇలా రామనామం వ్రాసి ....... వివరించానారోజు.
అది జ్ఞప్తికి వచ్చి ఓ అనుమానం మెదలింది మనసులో 
 మరలా శంకర్ కు ఫోన్  చేశాను
 శంకర్ ! అతని పేరేమిటీ అడిగాను
అతనిపేరు కాశయ్య   స్వామీ ! చెప్పాడు శంకర్
వయస్సు

 ఇరవైనాలుగు

 అవునూ! అతను రామనామం వ్రాయటం లేదా ? 
 
లేదు   స్వామీ !

 ఏం? ఎందుకని ? మీరతనికి రామనామ లేఖన పుస్తకం ఇవ్వలేదా ? వ్రాయమని అడగలేదా ?

అయ్యో ! ఎందుకడగలేదండి !
అన్నా !   అందరం వ్రాస్తున్నాం నువ్వుకూడా ఒకపుస్తకం తీసుకో అని వెంటపడి మరీ చెప్పానండి. చూద్ద్దాం లేరా... వ్రాద్దాం లే... తొందరేముంది? అని ఎప్పుడడిగినా మాట దాటవేసే వాడు . అన్నాడుశంకర్ బాధపడుతూ.

అప్పుడనిపించింది నాకు" బుధ్ధి కర్మానుసారణి.....అని పెద్దలెందుకు చెప్పారో

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటుంది

చెడు కర్మ ప్రబలంగా ఉన్నప్పుడు  దాని ప్రభావాన్నుంచి తప్పించుకోవటం మన ఒక్కరి ప్రయత్నం వలన సాధ్యం కాదు. భగవంతుని నామాన్ని ఆశ్రయించి ఆయన దరికి చేరినప్పుడు మాత్రమే మనం ఉధ్ధరింపబడతాం.కాకుంటే మన మనస్సుకు ఇది అంత త్వరగా ఎక్కదు.
అన్నీ అనుకూలంగా ఉంటే అంతా మన గొప్పతనమేనని భ్రమిస్తాం.

చెడుకర్మప్రభావం బలీయంగా ఉన్నప్పుడు  ఏ పూర్వజన్మపుణ్యం వలనో  ఎవరో ఒకరిద్వారా భగవన్నామాన్ని ఆశ్రయించమని మనకు సంకేతమొచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేస్తాం . కర్మఫలితాలకు గురవుతుంటాం . 
ఏమో! స్వామిని ఆశ్రయించి ఉంటే  ఆకుర్రవానికి ఏదో ఒక ప్రమాదరూపంలో చిన్న దెబ్బగా ఆచెడు కర్మ తొలగిపోయి ఉండేదేమో! పాపం ఇలా జరిగిందే అని మనసులో బాధకలుగుతున్నది.

1 వ్యాఖ్యలు:

స్వర్ణమల్లిక April 27, 2014 at 6:20 AM  

Maa babu ki rojula vayasu unnappati nundi ramanama tarakam lali patala padi nidrapuchedanni. Ippudu ika vaade rama rama ani paadukuntu bajjuntunnadu.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP