శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జైశ్రీరాం అంటూ నినాదాలతో దరిశిపట్టణాన్ని మార్మోగించిన విద్యార్థులు. విజయీభవ కార్యక్రమం

>> Saturday, March 8, 2014

 విజయీభవ  కార్యక్రమంలో రక్షాధారణ చేస్తున్న విద్యార్థులు
 స్వామివారి అభిషేకంలో
 ప్రసాదాలు స్వీకరిస్తూ
ఆలయం ముంగిట వీధులలో  బారులు తీరినవిద్యార్థులు
దరిశిపట్టణం  ఈరోజు  విద్యార్థులు చేస్తున్న జైశ్రీరాం,జైహనుమాన్ అనే జయధ్వానాలతో మార్మోగిపోయింది.
పదవతరగతి,ఇంటర్మీడియేట్ ,డిగ్రీ చదువుతూ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక ఆంజనేయస్వామివారి మందిరంలో  నిర్వహించిన "విజయీభవ" కార్యక్రమానికి విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు.  వారందరిచే  స్వామివారికి అభిషేకము  నిర్వహింపజేసి ,స్వామివారి రక్షలను,ఆంజనేయస్వామి దండకమును,స్వామివారి పాదాలవద్దఉంచి  పూజించిన  "పెన్" లను ప్రసాదంగా అందజేయటం జరిగింది. వివిధ విద్యాసంస్థల యాజమాన్యం తమ విద్యార్థులగోత్రనామాలతో పూజలు జరిపించారు.
ఈకార్యక్రమంలో  స్థానిక ఆలయ హనుమత్సేవాసమితి తరపున కోటేశ్వరరావు,గోవిందరెడ్డి,పున్నయాచార్యులు
విశ్వహిందూపరిషత్ తరపున,లక్ష్మీనారాయణరెడ్డి,అమర్ ,భజరంగ్ దళ్ తరపున శ్రీధర్,వెంకటసుబ్బారావుగారు, రామదండు తరపున  అంజిరెడ్డి,సురేంద్ర. రామాంజిరెడ్డి  సేవాకార్యక్రమాలలో పాల్గొన్నారు.

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం  నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలలో భాగంగా ఈ ఉత్సవం స్వామివారి పాదపద్మాలకు సమర్పించాము. జైశ్రీరాం


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP