శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీ ఊరిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణమునకు తలంబ్రాల కొరకై బియ్యం ఇలా సమర్పించండి

>> Saturday, March 29, 2014

                                                                         శ్రీరామ



జగన్మాతా పితరులగు శ్రీరామ చంద్రప్రభువు, సీతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాలు జయనామ సంవత్సర నవమి నాడు అన్నిచోట్లా  వైభవంగా జరుగుతాయి. మనగ్రామాలలో, పట్టణాలలోనూ ,ఆలయాలు ,కళ్యాణమండపాలు
దివ్యమంగళమూర్తులగు సీతారాముల కళ్యాణవైభవంతో ప్రకాశిస్తుంటాయి. ఈసమయంలో ఆ దేవదేవుని సేవలో భ అందరూ పాలుపంచుకొనుటకై "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం " ఇక్కడ పరిసర ప్రాంతాలలో  ప్రతి ఇంటినుండి స్వామి వారి కళ్యాణమునకు తలంబ్రాలు సమర్పించే కార్యక్రమం చేపడుతున్నది. ఇది అన్నిచోట్లా ఆచరించి స్వామి అనుగ్రహం పొందవచ్చు.

విధి విధానములు
------------

ఉగాది నుండి మీ ఇంటిలో  సభ్యులు స్నానానంతరం[ఉదయంలేదా సాయంత్రమైనా ] వడ్లు  తీసుకుని  "శ్రీరామ" అని గోటితో వలచి ఆ బియ్యమును పవిత్రంగా ఒక పాత్రలో పోయండి. ఇలా నవమి వరకు తయారు   చేసిన బియ్యమును నవమి ఉదయాన్నే తీసుకెళ్ళి మీ ఊరిలో కళ్యాణం జరుగుతున్న మండపంలో తలంబ్రాలు నిమిత్తం అక్కడి అర్చక,పురోహితులకు అందజేయండి.  అవి  ఎన్నైనా పరవాలేదు. వందగ్రాములు కావచ్చు,అరకేజీ కావచ్చు. మీ కున్న సమయాన్ని బట్టి స్వామి నామస్మరణతో తయారు చేసి పంపండి. మీ ఇంటిలో ధనధాన్యములు వృధ్ధి  చెంది ,పరంధాముని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ తొమ్మిదిరోజుల నామస్మరణతో మీ గృహంలో గల దోషాలు తొలగిపోతాయి. ఇల్లు శక్తితరంగాలతో వెలుగొందుతుంది.
 ఈ విధానం పాటించడానికి ఇక్కడ పరిసర గ్రామాలన్నీ సిద్ధమవుతున్నాయి.  మీగ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువమందిచే జరిపించండి. అక్కడ బాధ్యులకు ఈ విషయాన్ని పరిచయం చేయండి. అక్కడ పెద్దలు,పురోహితులు ,అర్చకులవారితో ఏదైనా చర్చించవలసి వస్తే వారి నంబర్  నాకు తెలిపితే వారితో మాట్లాడి విషయాన్ని విన్నవిస్తాను.

ఇది రామకార్యం. మనం మనతో పదిమంది కలసి మన తల్లిదండ్రులైన సీతారాముల కార్యక్రమానికి సన్నధ్ధమవుదాం.
జైశ్రీరాం

దుర్గేశ్వర
9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP