శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సత్యమేవ జయతే

>> Wednesday, February 5, 2014


శ్లోకం ః ఓం పూర్ణమద: పూర్ణమిద:
పూర్ణాత్పూర్ణ ముదచ్యుతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవాయశిష్యతే!!


అర్థము: పరమాత్మ నుండి విడిపోయిన ఆత్మలు తిరిగి పరమాత్మను చేరుట ద్వారా పూర్ణత్వం పొందుట. ``నా నుండి వేరయి తిరిగి నన్ను చేరుట'' -పరమాత్మ. ఆత్మ స్వరూపుడగు పరమాత్మ శ్రీ మహావిష్ణువునకు సర్వస్య శరణాగతి కోరుతూ మనసా, శిరసా పాదాభివందనం.

ఒక అతీతమయిన శక్తి యీ సృష్టినంతటినీ నడిపిస్తూవుంది అని, ఆ శక్తినే మనము భగవంతుడు, దేవుడు, పరమాత్మ, పురుషోత్తముడు అని, ఎవరికి యిష్టమైన పేరుతో వారు భక్తితో (నమ్మకము, విశ్వాసము) పూజిస్తూంటాము. మన ప్రాణము (ఆత్మ) అయిన భగవంతుడు అంటే ఎవరు? ఎలా వుంటాడు? ఏమి చేస్తూ ఉంటాడు? పరమాత్మ ధర్మములు ఏవి? ఇలా మనకు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. మనము ఎందుకు పుట్టాము? దేని ఆధారంగా పుట్టాము? మరణం అంటే ఏమిటి? మరణం తరువాత ఏమి జరుగుతుంది? అనేక ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. అనేక భయాల వలన కూడా ఆ విషయాలను లోతుగా పట్టించుకోము. కానీ ఒక పటిష్ఠమైన నియమానుసారంగా యీ సృష్టికార్యం జరుగుతోంది. ఇంత నియమబద్ధంగా జరుపుతున్న శక్తే భగవంతుడు. ఆ కార్యము పేరు ధర్మము. సత్యదీక్ష నాచరిస్తూ ధర్మకార్యములను జరిపించుతున్న భగవంతుడు వేదములకు కూడా వర్ణించటానికి శక్తికి అందని ఆదిపురుషుడు, అదై్వతుడు, అచ్యుతుడు, అనాది, అనంతరూపుడు, అఖిలాంతరంగుడు, పురాణ పురుషుడు, అవతార పురుషుడు, పరిపూర్ణుడు, పరమాత్ముడు, పరంధాముడు, శుద్ధ సత్యమూర్తి ``అయం భగవాన్‌'' అని స్వయంగా చెప్పగల ధీరుడు, పురుషోత్తముడు, స్వయంప్రకాశకుడు, సర్వవ్యాపి, విరాట్‌రూపుడు, జగదీశ్వరుడు, విశ్వేశ్వరుడు, చైతన్య స్వరూపుడు, సకల రక్షకుడు, ఘనుడు, కరుణామయుడు, పరమానందుడు, పరబ్రహ్మము, లోకాలనేలే చక్రవర్తి, ప్రభువు, సర్వాత్ముడు, సర్వాంతరాత్ముడు, అఖిలాత్ముడు, మోక్షప్రదాత, సర్వాంతర్యామి, సృష్టికర్త (మూలము), ఆదిమూలము, ఆదిదేవుడు, వర్ణించటానికే అలవికాని విశ్వరూపుడు అయిన ``మహా విష్ణువు'' ఏక స్వరూపుడు, సనాతనుడు, నిర్మలుడు, శాంతమూర్తి.

భగవంతుడు:
 • సమగ్రమగు ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అను యీ ఆరు ``భగ''వత్‌ శబ్దమును సూచించుచున్నవి. సమగ్రమగు జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సుల సముదాయమే భగవ(త్‌)చ్ఛబ్ద వాచ్యము.
 • కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము యీ ఆరు లక్షణాలు భగవద్‌ లక్షణములు.
 • ఒకే ఒక అద్వయ, అఖండ జ్ఞానతత్త్వమగు, అచింత్య, అనంత శక్తి విశిష్టమగు, సచ్చిదానంద విగ్రహుడగు భగవానుడొక్కడే ప్రకాశించుచున్నాడు. అతి సూక్ష్మరూపుడు, అఖండ, అనంత విశ్వరూపుడు అయిన భగవంతుని లీలలు దివ్యములు.
 • మరమ పవిత్రమైన సృష్టి కార్యములో కఠినమైన నియమ నిబంధనలతో సృష్టి నిర్మాణము జరుపబడినది.
 • పరమాత్ముడు తప్ప భిన్నమైనదేదియు లేని అభిన్న, ఏకత్వమైన భేదము లేని అదై్వత ధర్మము ఆచరణకు వచ్చిన భగవానుని అగకాంతి బ్రహ్మమనియు, అతని అంశము ఆత్మ అనియు, సద్గుణాలు కలిగి ఉండుట వలన (భగవద్‌ లక్షణాలు) భగవంతుడుగా తెలుపబడుతున్నది.
 • అతీతమైన, అఖండమైన జ్ఞాన, వైరాగ్యములతో త్యాగమూర్తి, ప్రేమ, కరు ణ, ఔదార్యం, దయామూర్తి శ్రీమన్నారాయణుడు అయిన శ్రీ మహావిష్ణువు.
 • సర్వోత్క్రుష్ఠ్రుడు, విశిష్ణుడు, శ్రేష్టుడు, ఉన్నతుడు, ఉత్తముడు అవడం వలన భగవంతుడు మనకు భిన్నంగా ఉన్నాడన్న భావన కలుగుతోంది.
 • సాధన వలన జ్ఞానమును పొందినటై్లతే ఏకత్వ భావన కలిగి పరమార్థమును గ్రహింపగలుగుతాము.
  భగవంతుని స్మరించు వారిని కరుణించి అతి శీఘ్రముగా తరింపచేయువాడు.
  మరమ మహత్త్వపూర్ణమగు భగవంతుని చరణములను ఆశ్రయింపుము. అజ్ఞానం వలన, మూర్ఘత్వం వలన భగవత్తత్వాన్ని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. భగవద్గీత, విష్ణు సహస్ర నామస్తోత్రం మొదలైనవి మనకు మార్గదర్శకములు. ``కృష్ణం వందే జగద్గురుమ్‌.'' జగద్గురువు కృష్ణుని సారథ్యంలో భగవన్నామ స్మరణ చేసే మానవజన్మ ఉత్తమమైనది. హరి భక్తి లేక మానవుడు సంసార బంధము నుండి తరించలేడు. కలియుగములో భగవన్నామ సంకీర్తనచే సునాయాసముగా ముక్తి పొందవచ్చును. భగవంతుడు భక్త జన సులభుడు. ప్రాపంచిక విషయములపై మనసునిల్పి, పరమార్థిక విషయములను విస్మరించి చెడుమార్గాన నడిచే జనావళికి భక్తికన్నా దుష్కర్మల ఫలమే ప్రాప్తిస్తుంది. కాబట్టి ఉత్తమ మార్గంలో పయనించే జన్మ ధన్యము చేసుకోవాలంటే భగవంతుని (శ్రీ మహా విష్ణువు) శ్రీ చరణములను ఆశ్రయించండి.

 • శుభమస్తు. -సత్యగాయత్రి[[surya daily]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP