శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"అవ్వ"మోకాలుకు ,తాతబోడి గుండుకు ముడిపెట్టే మతపిచ్చగాల్ల కపిత్వాలు చూడండి ఆంధ్రజ్యోతిలో.....

>> Monday, February 3, 2014

http://www.andhrajyothy.com/node/61206
http://www.andhrajyothy.com/node/61207

ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన పైరెండు క[పి]వి తలను చదవగానే  నాకు పై సామెత గుర్తొచ్చింది. మొన్న బొంబాయి లో అనూహ్య అనే యువతి దారుణమృతికి సంతాపంగా ఇద్దరు రచయితలు వ్రాసిన కవితలో అసలు ఉద్దేశ్యమేమిటో నాకర్ధం మైంది. ముందుగా వారిరువురకూ ఫోన్ చేసి వివరణ అడిగాను.
ఇంది దురదృష్టకరమైన సంఘటనే. ఆమె తల్లిదండ్రులకు కలిగిన కడుపుకోత ఎంతవేదన కలిగిస్తుందో అందరికీ తెలుసు. ఈవిషయం పట్ల ఎవరైనా ఆవేదనవెలిబుచ్చవచ్చు. కానీ ఈ కవితలో వీల్లురువురూ  రాముణ్ణి,కృష్ణున్ని, కులాలను ప్రస్తావించే అవసరమేముంది? రాముడు, కృష్ణుడు అవతారాలలో స్త్రీకి అవమానం జరిగితే, ఆవమానాలకు కారకులైన వాళ్లను  తలకు కొరివిపెట్టేదిక్కులేకుండా నశింపజేసి లోకానికి ధర్మానికి కోపం వస్తే ,ధర్మహానిజరిగితే ఏమవుతుందో చూపారు.
 ఇప్పుడు మనం భౌతికవాదానికి గేట్లుబార్లాతెరచి,  అమ్మా,అక్కా, అనే వరుసలతో పరాయిస్త్రీలను పిలచి గౌరవించే సంస్కృతీ,సాంప్రదాయాలను కించపరచి,హేళనచేసి త్రూణీకరించి వదలివేస్తూ నేటి సమాజంలో మగవారిలో,ఆడవారిలో విచ్చలవిడితనాన్ని,పశుత్వాన్ని పెంచుతున్నాం. రాముడు కృష్ణుడు లేరా? కాపాడలేదే? అని అంటున్న ప్పుడు  ఎప్పుడన్నా మనం రాముడు,కృష్ణుడూ ఏంబోధించారో తెలుసుకున్నామా? మనపిల్లలకు నేర్పుతున్నామా ? మనప్రమేయం లేకుండానే   ఆడపిల్లలను ఏడ్పిమ్చటం హీరోయిజంగా,అర్ధనగ్నంగా పరమరోతడైలాగులతో రెచ్చగొట్టే అభినయాలతో హీరోయినిజంగా వస్తూన్న సినిమాలు  హిట్లవుతున్నాయా?
తెల్లావారి లేస్తే భౌతికసుఖాలను సంపాదిమ్చుకోవటమే పరమలక్ష్యంగా తల్లిదండ్రులు పిల్లలలో భావనలు పెరిగేలా చేస్తున్నారనేది కాదనగలమా ?
ఇన్ని అనర్ధాలు మనం సృష్టించుకుని పెంచిపోషించుకుని ఇప్పుడు మనపిల్లలు వాటికి బలవుతున్నారంటే   లోపం ఎక్కడుంది?

ఇవన్నీ వదలిపెట్టి పై కవులిరువురూ ఎకాఎకిన హైందవ సంస్కృతిపై,భారతదెశ అఔన్నత్యంపై తమ కసిని వెల్లగక్కారు. బుద్దుడిమాట వినలేదే అని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా మతాలదేవుళ్లను మాత్రం స్త్రీలపై అత్యాచారాలకు కారనం కాదని హిందూ దేవీదేవతలే కారణమని వీరి ప్రగాఢ దురభిప్రాయం లాఉంది .లేదా ఏఘటననైనా మతప్రచారానికి వినియోగించుకునే వ్యాపారమతాల అనుకూలధోరణియేమో?
బుధ్ధుడ్ని నమ్మిన జపాన్,థాయిలాండ్ లాంటిదేశాలలో నూ స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈమధ్య వార్తాపత్రికలో వచ్చిన ఓవార్త చదివారో లేదో"అత్యాచారాలు  అమెరికాలోనే అత్యధికంగా జరుగుతున్నాయనే సర్వే వెల్లడించింది.
మనంమాత్రం  ఏవిషయానికైనా ఆవుమీదవ్యాసం వ్రాయటం వచ్చినవారిలో అన్నింటికీ హైందవమే మూలమని ఆరోపణలు చేస్తాం.దేశాన్ని కించపరుస్తూ, దేవభూమిని చిన్నబరుస్తూ.

ఇక మరోట్విస్ట్ ఏమిటంటే   పక్కపేజీలోనే ఓవార్త వచ్చింది  అనూహ్యపై అత్యాచారం జరగలేదని,  స్నేహితుడే మరణానికి కారకుడా ? అని
ఈఅమ్మాయివెంట రైల్లో  ప్రయాణించిన ,మధ్యలో ఆహారం కూడా అందించిన ఆమె స్నేహితుడి ఫోన్ కాల్స్ ,ముంబాయి రైల్వేస్టేషన్ సి.సి.టివీ పుటేజీల్లో రికార్డులు పరిశీలించిన  విషయాలు పోలీసుల అనుమానాలు.
 వీటికి కారణం ఎవరు?  పైన నేను ఉదహరించిన సామెతకు సరిపోవటం లేదా వీరి కవిత్వాలు?

5 వ్యాఖ్యలు:

Unknown February 3, 2014 at 10:19 AM  

విల్సన్ సుధాకర్ గారి కవిత కొంత మత ప్రసక్తి (అనవసరంగా) ఉంది కానీ ఎండ్లూరి సుధాకర్ గారి కవిత అలా లేదు. ఆయన బాధితులందరి పట్లా సంతాపం వ్యక్త పరిచారు.

ఎవరి మతం వాళ్లకి గొప్పది! మనం ఏమైనా తక్కువ తిన్నామా? వాళ్ళ మీద చల్లినట్లే వాళ్ళు మన మీద చల్లుతారు విద్వేషం

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी February 3, 2014 at 9:01 PM  

మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అనే సామెత ఇలాంటి వారిని చూసే పుట్టి ఉంటుంది.

durgeswara February 3, 2014 at 11:19 PM  
This comment has been removed by the author.
durgeswara February 3, 2014 at 11:21 PM  

మీరు సత్యదృష్టి అని పెరెట్టుకున్నారుగాని,ఆలొచన అలాలేదు.
హిందువులు ఇతరులపై విద్వేషం వెల్లగక్కరు. జరుగుతున్న దాడులగూర్చి ఆవేదన చెంది నోరువిప్పినా ఇలా కనిపిస్తుంది హ్రస్వదృష్టితో చూస్తే

G.P.V.Prasad February 4, 2014 at 4:03 AM  

మతం తప్పు మతం తప్పు అంటారు అసలు చేస్తున్న వాళ్ళు మతం ఆచరించడం మానేసి చాలా కాలం అయ్యింది, కేవలం అబద్దపు ప్రపంచంలో రాజులు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP