శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీతోపాటు పదిమందిచే రామనామ లేఖనం చేసి "హనుమత్ రక్షాయాగం" లో మీరూభాగస్వాములు కండి.

>> Friday, February 21, 2014

హనుమత్ స్వామి అనుగ్రహంతో ఇప్పటికి ఐదు ఆవృతులుపూర్తయిన హనుమత్ రక్షాయాగం ఈసంవత్సరం ఆరవ ఆవృతిగా  వైశాఖమాసంలో హనుమజ్జయంతికి నిర్వహించబడనున్నది. స్వామి ఆనతితో  సామూహికంగా 24కోట్లరామనామలేఖన సంకల్పం తీసుకోవటం జరిగినది. ఇప్పటికే రామనామ లేఖన ప్రతులను రాష్ట్రం లో వివిధ ప్రాంతాలలో ని భక్తులకు అందజేయటం జరిగినది. రామనామ లేఖనము సాగుతున్నది . ఈ రామ కార్యంలో అందరూ భాగస్వాములు  కావాలని మా కోరిక.   మీరంతా చేయిచేయి కలపాలని విన్నపము.
 ఇందుకోసం మనకు ఇంకా మూడునెలల సమయం ఉన్నది. కనుక మీరు ,మీతోపాటు,మీ బంధు,మిత్రపరివారములలో మరో పదిమంది చేత రామ నామ లేఖనం ప్రారంభింపజేయండి. అందుకొరకు మేము తయారుచేపించిన రామనామ లేఖనపుస్తకములను అందజేయుట వ్యయప్రయాసలతో కూడుకున్నది .మీప్రాంతంలో పుస్తకాలషాపులలో  రామనామ లేఖన పుస్తకాలు దొరుకుతాయి కనుక అవికూడా కేవలం ఇరవైరూపాయల ఖరీదే కాబట్టి పదిమందికి మీవంతుగా అవి కొని అందజేయాలని మనవి. లేఖనం పూర్తయ్యాక ఆపుస్తకాలను
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం
నూజండ్ల మండలం
గుంటూరు  జిల్లా   522660          cell  9948235641
కు    చేరులాగున పోస్ట్ లో పంపగలరు.  యాగానికి వచ్చేవారు వీటిని సేకరించి తీసుకుని రావచ్చును. హనుమత్ స్వామికి అత్యంత ఇష్టమైన రామనామాన్ని లిఖించడం పదిమందిని ఈకార్యక్రమంలో పాల్గొనేలా చేయటం వలన స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మీ కార్యములన్నీ దిగ్విజయమై సకలశుభాలుప్రాప్తిస్తాయి .


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP