శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బైబిల్ పట్టుకోకుంటే అన్నంపెట్టనన్న కోడలు. మానవత్వ విలువలుకూడా లేకుండా చేస్తున్న మతమార్పిడి

>> Wednesday, January 22, 2014

సాటిమనిషికి ఆపదవచ్చినప్పుడు,ధర్మాచరణలోను మానవత్వమే ప్రమాణమని  ఈపుణ్యభూమిలో ఆచరణాత్మకంగా కనపడుతుంది .ఇతరుల అసహాయతను స్వప్రయోజనంకోసం వాడుకోచూడటం నీఛంగా పరిగణింపబడుతుంది.  కానీ కలిప్రభావం, వ్యాపారమతాల ప్రభావం తో మనుషులు మానవీయ విలువలను కూడా పోగొట్టుకుంటున్నారనే సంఘటన ఒకటి మనవి చేస్తాను.

పల్నాడు ప్రాంతంలో మాబంధువర్గంలో ఓ పెద్దాయన ఉన్నారు. ఉపాధ్యాయులుగా పనిచేశారు . కొన్ని ఆథ్యాత్మిక సంస్థలలో పనిచేశారు. భార్య గతించటంతో ఆస్తులు కుమారులకు పంచి  అథ్యాత్మిక సాధనలో మునిగిఉండేవారు .మళయాలస్వామివారి ఆశ్రమవాసులతో సాధనా సహచరుడు.  

ఇక ఆయనకు ఒక కూతురు ఇద్దరు కుమారులు .కాలప్రవాహంలో మార్పులు తప్పవుకదా ?  వయసు ఉడిగింది . కదలికలు తగ్గిపోయాయి.  పిల్లలసంరక్షణలో ఉండవలసిన వయస్సు . కానీ పెద్దకుమారుడు తన ఆరోగ్యమే సరిలేనందున తాను పెద్దాయన సేవలు చేయలేనని తప్పుకున్నాడు.  ఇక చిన్నకుమారుని భార్య తల్లిదండ్రులు మతం మార్చుకున్నారు. వారి ప్రభావంతో ఉన్న చిన్నకోడలికి ఈయన ఆథ్యాత్మిక మార్గమంటే చిన్నచూపు. [ఆయన ఏటియమ్ తమదగ్గరే ఉంచుకుని డబ్బులుమార్చుకోవటంలో మాత్రం చిన్నతనం లేదు]  

సరే ! ఇక తప్పదుకనుక చిన్నకుమారుడే ఈయనపోషణ,సేవాబాధ్యతలు చూడాలి. ఆయనకొచ్చే పెన్షన్ తీసుకుంటూన్నాసరే ,ఆయనకు అన్నంపెట్టాలంటే చిన్నకోడలు ఓ దారుణమైన షరతు విధించింది .  మేం అన్నంపెట్టాలంటే   నువ్వు బైబిల్ చదవాలి. ప్రార్ధనలు చేయాలి. ఇదీ ఆవిడ షరతు.

ఎంత దుర్మార్గం. ఎంత క్రూరం?  జీవితమంతా తాను ఆచరించిన ఆథ్యాత్మిక సాధనలను నమ్మకాలను జీవితం చివరిదశలో  పిడికెడు అన్నం మెతుకులకోసం వదిలివేయవలసి వస్తుందని ఏనాడు ఆయన ఊహించి ఉండడు. 
ఎన్నిసాధనలుచేసినా  మమకారాన్ని వదులుకోకపోవటం  ఆయనకు ఈ ఇబ్బందితెచ్చిపెట్టింది. ఎంత కష్టసమయంలోనైనా ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉండే ఆయన హ్రుదయం ఎంత క్షోభిస్తున్నదో గానీ చివరిదశ కుమారులదగ్గరే ఉండాలనే మమకారపాశం వలన కోడలి షరతును అంగీకరించేలా చేసింది.   వాస్తవానికి ఆయన ఆంతరంగిక సాధన తననమ్మకాలకు అనుగుణంగా సాగుతున్నా పైకి మాత్రం బైబిలుచేత పట్టుకుని కాలం గడుపుతున్నారు  నేడు. 
ఇక్కడ ఓ విషయం గమనిద్దాం. హిందువులు తమ ఇంట్లో లేక ఇంటిపక్కల ఎవరన్నా మతం మారినా వారి పట్ల ఆదరభావం చూపుతారే గాని వారిని ద్వేషించరు. ఎవరిష్టం వారిది. వారికి నమ్మకం ఉన్న మార్గంలో వారు భగవంతుని ఆరాధిస్తున్నారు అని గౌరవిస్తారు. కానీ మతం మారినవారికి మాత్రం తమ మార్గమే భగవంతుని మార్గమని ఇతరమార్గాలన్ని సైతాన్ మార్గాలనే మూర్ఖత్వం ప్రబలిపోతున్నది.     అనేక ఇల్లలో ఈరోజు ఈ మతమార్పిడి చిచ్చు అలజడులను రేపి మానవతా విలువలనుకూడా ధ్వంసం చేయటం చూస్తూ ఉన్నాం.

చిత్రమేమిటంటే   ఆయన చిన్నకోడలి తల్లీదండ్రులు మాత్రం ఈమధ్య తామనుసరిస్తున్న క్రైస్తవ మతం వదలి మాతృధర్మం లోకి ప్రవేశించారు .


ఇక్కడ మనం ఓ పెద్దాయన చెప్పిన మాట గుర్తుచేసుకోవలసి వస్తున్నది.
నువ్వు క్రిష్టియన్ వైతే కిర్స్తానీలందరినీ ప్రేమిస్తావు
నువ్వు ముస్లిం వైతే ముస్లిములందరినీ గౌరవిస్తావు.
కానీ నువ్వుహిందువుగా ఉంటే   అందరినీ ప్రేమిస్తావు.అన్ని మతాలనూ గౌరవిస్తావు.

4 వ్యాఖ్యలు:

మనోహర్ చెనికల January 22, 2014 at 7:51 PM  

please enable g+ and face book sharing on your blog.

Manohar.Ch

Hari Babu Suraneni January 22, 2014 at 8:45 PM  

నిజమే, అయినా అందరికీ హిందువులే మతతత్వ వాదులుగా కనిపిస్తారు - అదేమిటో మరి?!

Hari Babu Suraneni January 22, 2014 at 8:46 PM  

నిజమే, అయినా అందరికీ హిందువులే మతతత్వ వాదులుగా కనిపిస్తారు - అదేమిటో మరి?!

ఎస్పీ జగదీష్ January 24, 2014 at 1:13 AM  

వ్యాపార మతాల్లో ఇవన్నీ మామూలే నండి... ధర్మానికి హాని చెయ్యడం, వ్యక్తిగత స్వార్ధం మాత్రమే పరమార్ధం. ప్రజల్లో మూర్ఖత్వాన్ని బాగా పెంచి పోషిస్తున్నాయి ఈ మతాలు... మంచి ఉదాహరణ చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP