శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భేష్ రా! హుస్సేన్ ! హనుమత్ప్రభువు అనుగ్రహంతో ,జీవితాన్ని ,జీవనాధారాన్నీ సాధించుకున్నావు .

>> Saturday, January 18, 2014

సార్  ! నాకు జాబ్ వచ్చింది. రాత్రి   ఫోన్ లో ఆనందంతో   మా పిల్లవాడు హుస్సేన్  చెప్పాడు.
 చాలా ఆనందం కలిగింది. స్వామి అనుగ్రహంతో విజయం సాధించుకున్నావు రా !   అభినందించాను నేను.
వీనిని వెనుక రక్షకునిగా స్వామి ఉండి  జరుపుతున్న లీలలు గుర్తువచ్చి ఆయన భక్తరక్షకుడన్న బిరుదు ఎలానిజమో మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను.

మాదగ్గర  షేక్ హుస్సేన్ అనే పిల్లవాడు పదవతరగతి దాకా చదివాడు. నిరుపేదకుటుంబం. తండ్రి దర్జీ. తల్లి కూలి పనులకు వెళుతుంది . వేరేచోటునుండి మాగ్రామం అచ్చి నివాసం ఉంటున్నారు. మాపాఠశాలలో చేర్చారు. వారి ఆర్ధికపరిస్థితి తెలుసుకనుక ఇస్తే ఫీజు తీసుకునేవాల్లం లేదంటే లేదు.  మంచిపిల్లవాడు.

పిల్లలందరితో పాటు వీడూ హనుమాన్ చాలీసా చక్కగా పారాయణం చేస్తాడు.  పదవతరగతి అయిపోయాక ఐటిఐ  చేశాడు .  మధ్యలో ఖాళీగా ఉండకుండా ఎలక్ట్రీషియన్ పని చేసేవాడు .స్థానిక కరెంట్ హెల్పర్లవద్ద ప్రైవేట్గా పనిచేశాడు కొన్నాళ్ళు. ఆరున్నర అడుగుల ఎత్తుతో అమితాబచ్చలా ఉన్నా కరెంట్ స్థంభాలు అవలీలగా ఎక్కుతాడు. కాకుంటే వీనికొక చిన్నలోపం ఉంది. స్నేహం పేరుతో దగ్గరైనవాడెవడు ఏదిచెప్పినా అందులో మంచీచెడ్డలు ఆలోచించకుండా నమ్మేస్తాడు.అదొక్కటె లోపం.   ఇలా చిల్లరపనులుచేస్తూ బాధ్యత లేకుండా ఉన్నాడని వాణ్ణి పిలచి మందలించమని వాల్లమ్మ గారు వచ్చి మాఆవిడదగ్గర వాపోతుండేది . నేను గట్టిగా అరుస్తానని నాకు కనపడకుండా వెళ్ళినా వాళ్లటీచర్ గారుఒరే !హుస్సేన్  ఒకసారి రామ్మా అని పిలిస్తే మాత్రం వెంటనే వచ్చి వాలతాడు.

వీడెక్కడ చెడుసావాసాలతో గాడితప్పుతాడో అని భయంగా ఉండేది నాకు .   స్థిరమైన పని లేక గాలివాటంగా ఉన్నసమయంలో ఓసారి వచ్చి  సార్! నేను ఆంజనేయస్వామి దీక్షచేస్తాను సార్ ! అనడిగాడు. చాలామంచింది. చేయమని చెప్పి దీక్ష ఇప్పించాను.  చక్కగా దీక్షపూర్తిచెశాడు. స్వామి అనుగ్రహం వానిపై ఉంది

.వాడు కరెంట్ హెల్పర్లవద్ద పనిచేస్తాడని చెప్పానుకదా . వీడు , వీన్తో పాటు సాంబానాయక్ అనే వీడిఫ్రెండ్ ఇద్దరు కలసి  ఓరోజు పొద్దుటే నూజండ్ల నుండి కమ్మవారి పాలెం వైపు వచ్చే కరెంట్ లైన్ చెక్ చేయటానికి వెళ్ళారు . ఇక్కడ సబ్ స్టేషన్ లో సప్లై ఆపివేసి మరీ . దారిలో ఇంకొకడు కనపడితే వాణ్ని తీసుకుని వెళ్ళారు . దారిలో ఓచోట కరెంటుస్థంభంపై లోపం గమనించి సరిచేయటానికి పూనుకున్నారు. సహజంగా స్థంభాలు నేర్పుగా ఎక్కుతాడుగనుక  హుస్సేన్ నే పైకెక్కమని చెబుతారు. కానీ స్వామి అనుగ్రహం వలనారోజు మిగతావాళ్ళు ఒరే !నువ్వు ఇంకాముందుకు కమ్మవారిపాలెందాకా వెళ్ళు చెక్ చెసుకుంటూరమ్మని వాన్ని ముందుకు పంపి తోడువచ్చిన నారాయణ అనేవాణ్ణి పైకెక్కించి సాంబా నాయక్ క్రిందనుంచుని ఫోన్ చేసుకుంటున్నాడు . ఈలోగా సబ్ స్టేషన్ లో సిబ్బందిలో ఎవడో  వీళ్ళు లైన్లు చెక్ చేస్తున్నారన్న విషయం తెలియక  మెయిన్లు ఆన్ చేయటం పైన పనిచేస్తున్న కుర్రవాణ్ణి  మృత్యువు మింగివేయటం క్షణాల్లో జరిగిపోయింది.
స్వామి అనుగ్రహం చేత అపమృత్యువు నోటినుండి వీడుతప్పించబడ్డాడు ఆరోజు.

ఈపని కాదని కొంతకాలం హైదరాబాద్ లో పనిచేశాడు. మధ్యలో జెన్కో లో జె.ఎల్.ఎమ్. పోస్ట్ లుపడితే  టెస్ట్ వ్రాశాడు చాలీసా పారాయణం సాగిస్తూ. ఈమధ్య  నేషనల్ హైవే లో పనులుచేస్తున్న కాంట్రాక్టర్లవద్ద పనిచేస్తున్నాడు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది . ఇంటికి వచ్చినప్పుడు, ఫోన్ చేసినప్పుడూ  నువ్వెప్పుడూ చాలీసా పారాయణం మరువవద్దు. స్వామి పాదాలు విడువవద్దు అని అచెబుతుండేవాడిని . నమ్మకంతో ఆయనను ఆశ్రయించి ఉండేవారికి సకలశుభాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్పేమాటకు నిదర్శనంగా  నిన్న జెన్కో  పరీక్షాఫలితాలు ప్రకటించారట. నెట్లో సెలక్ట్ లిస్ట్ చూసి వెంటనే నాకు ఫోన్ చేశాడు రాత్రి . శుభం. స్వామిని నమ్మి ఆశ్రయించి ఉండు , అంతా ఆయన అనుగ్రహంతో సాగుతుంది అని దీవించాను--

జై హనుమాన్
జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP