శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందువుల పవిత్రక్షేత్రంతిరుపతిపరిధిలో లో ఇస్లామిక్ యూనివర్శిటీ నిర్మాణం తప్పులేదట? అది తప్పని వాదించటం హిందూమతోన్మాదమట.. హిందువులకు మానవహక్కులుండవా???

>> Thursday, January 2, 2014

ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో  మానవహక్కుల కార్యకర్తలమని ప్రకటించుకున్న వారు  తిరుపతిలో కడుతున్న ఇస్లామిక్ యూనివర్శిటీ నిర్మాణం లో ఏమాత్రం తప్పులేదని , ఇదంతా హిందువులు చేస్తున్న గోలేనని వ్రాసిన విషయాన్ని ఇక్కడ చూడండి

http://www.andhrajyothy.com/node/49309

 ఒకవైపు న నిజనిర్ధారణ కమిటీలుగా ఏర్పడ్డమేధావులు , ఇది అక్రమంగా నిర్మిస్తున్న కట్టడమని తేల్చారు. భవనం కూల్చేయాలని కలెక్టర్ గారు  ఆర్డర్ జారీ చేశారు. అది తిమ్మప్ప దేవాలయానికి సంబంధింన భూమని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. మూడేళ్లవరకు అనామకంగా ఉన్న స్త్రీ [ఈ నిర్వాహకురాలు] హఠాత్తుగా కోట్లరూపాయల ధనం వెచ్చించగలిగేస్థితి ఎలావచ్చిందో,దానికి చట్టబద్దత ఏమిటో ,దేవునికే ఎరుక. ఇక పేద విద్యార్థుల చదువుకోసమనే సాకుతో వ్యూహాత్మకంగా దీన్ని నిర్మిస్తున్నవారు, అసలు అంతమంది ఆదపిల్లలను ఒకచోట ఉంచటానికి జిల్లాకలెక్టర్ గారి అనుమతి కూడా తీసుకోలేదు. అది మానవహక్కుల కార్యకర్తలకు చట్ట వ్యతిరేకంగా అనిపించదు. ైతరులు మాత్రం చట్టప్రకారం ఉండాలని నీతులు చెబుతారు,.  ఇంకా ఓ మాటన్నారు.వేములవాడ గర్భగుడిలోనే దర్గా ఉంది ,ఇక్కడ మదర్శాకు తప్పేమిటీ? అది లౌకిక విలువలకు సామరస్యానికి ప్రతీకట.


అవును ....ఆలయాలు ఆక్రమించి కట్టిన మసీదులు దర్గాలు లౌకిక భావనకు చిహ్నాలైపోయి..అయ్యా ,మా ఆలయాల పరిసరాల ప్రశాంతతను దెబ్బతీసే  పనులు కూడదు ,అని నోరెత్తితే   అది హిందువుల మతోన్మాదమని  తిట్టించుకునే హీనస్థితి దాపురించింది మాకు  .

ఏదైనా మసీదు ముందునుండి ఉరేగింపు వెళితే దాన్ని తమ ప్రశాంతతకు భగంగకరమని వ్యతిరేకించేవారు. ఇతరుల పుణ్యక్షేత్రాలపట్ల గౌరవం చూపవద్దా? వాటికన్ సిటీలోనో ,,మక్కాలోనో ఓ చిన్నదేవాలయం కట్టడానికి ఎట్టిపరిస్థితులలో అంగీకరించరు. అంటే అవి మతోన్మాదదేశాలని  ఈ హక్కుల కార్యకర్తలు ప్రకటించగలరా?
పోనీ ఏదన్నా  ఖాళీగా ఉన్న ఇతరమతసంస్థల స్థలంలో దేవాలయాల నిర్మాణాన్ని సమర్ధించగలారా ?
పేదవిద్యార్థుల కోసం పవిత్రక్షేత్రాలలో మతప్రచార కార్యక్రమాలకు పాల్పడాలా ? ఇక  వేరే చోటులేదా ?
ఎందుకండీ ! ఈ ముసుగులు ..   అక్రమంగా నిర్మిస్తున్న [ఆమాట చట్టం ప్రకారం చూసే చెప్పండి] కట్టడాన్ని అడ్డుకోకుండా లౌకికవాద ముసుగులో ...ఓటుబ్యాంకు రాజకీయాల ను అడ్డం  పెట్టుకుని మద్దతు కూడగట్టుకోవడానికి  రచిస్తున్న వ్యూహాలివి. మానవహక్కులు హిందూయేతరులకే కాదు.. హిందువులకూ ఉంటాయి. అది తెలుసుకోండి . చట్టం ప్రకారం నడుచుకోండి. ఇంతగా ఇతరమతాలను గౌరవిస్తున్న హిందువులను ఇంకా చులకనగా చూడకండి


1 వ్యాఖ్యలు:

Saahitya Abhimaani January 3, 2014 at 11:18 AM  

మానవ హక్కులవాళ్ళు సామాన్యంగా దొంగలు, హత్యలు చేసేవాళ్ళ ను వెనకేసుకొచ్చేవాళ్ళేకదా! హిందువులు తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ గురించి ఆందోళన చేస్తుంటె వాళ్ళకెందుకు. హ్యూమన్ రైట్స్ అన్న పేరు పెట్టుకుని, చివరకు నిజమైన హ్యూమన్ రైట్స్ పరువు తీస్తున్నారు ఈ "ఎర్ర" హ్యూమన్ రైట్స్ గాళ్ళు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP