శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మతం మత్తు అంటివి కదా ఎర్రన్నా ! ఇదేంది ముందస్తు క్రిస్మస్ పండుగ జరుపుతుంటివి ??!!!!!

>> Tuesday, December 31, 2013

నాకైతే కొన్నివిషయాలు భలే  ఆశ్చర్యాన్ని ,అయోమయాన్ని కలిగిస్తుంటాయి .అటువంటివాటిలో కమ్యూనిష్టు అన్నాయిలు చెప్పే,చేసే పనులు కొన్ని. చిన్నప్పుడు అంటే ..నేను ఇంటర్ చదివేప్పుడు ఏ ఐ ఎస్ ఎఫ్ . లోనూ కొంతకాలం ఆర్ ఎస్ యు  ల పట్ల అభిమానం కలిగి ఉండేవాడిని. అప్పట్లో  విద్యార్థి ఎన్నికల్లో రిప్రజెంటెటివ్ గాకూడా పోటీచేసిన వీరాభిమానం కూడా ఉంది. అప్పట్లో మతం మత్తుమందు! అన్నకమ్యూనిష్ట్  స్లోగన్  చాలా గొప్పగా అనిపించేది [అర్ధంకాకున్నా]  .  మతంమత్తు వంటిదని  పాశ్చాత్య దేశాల అనుభవాలనుంచి గ్రహించి ప్రమాదకరమని మన కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకులు ఇక్కడకూడా అదే స్లోగన్ ను సంవత్సరాల తరబడి  చెబుతూనే ఉన్నారు. నాలాంటి వాడికి అర్ధంకాకపోయినా పరవాలేదు గాని వాల్లకేడర్ కూడా అర్ధం కాకపోవటమే విచిత్రం.

ఇంతకూ ఇదెందుకు చెబుతున్నానంటే .!  మొన్న మా వినుకొండలో సీ,పి.ఐ వాల్లు సెమీక్రిస్ట్ మస్ వేడుకలు గ్రాండ్ గా జరిపారు. ఇలా చాలాచోట్ల జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో తప్పేముంది ? అనుకుందామంటే వాల్లెప్పుడు ఏదీపావళికిగాని,దసరాకుగా మరే పండుగలుగాని జరపటంకాదు కదా ! కనీసం శుభాకాంక్షలన్నా చెప్పిన పాపాన పోయినట్లు గుర్తులేదు.  మరిప్పుడు ఇలా మతం మత్తునుండి ముద్దెందు కయిందో అర్థం కావటం లేదు.  నీకర్థం కాదు. వాల్లన్నది హిందూ మతం గూర్చి అని అంటారా ?
నిజమే ! కావచ్చు.

అందుకే నేమో ! వైసీపీ, నుండి టీడిపీ,కాంగ్రెస్ లవరకు అందరూ  తమ పార్టీలతరపున క్రిస్ట్మస్ లు, ఇతరులపండుగలు ఘనంగా జరుపుతూ  ఉన్నారు గానీ హిందువుల పండుగలకు ఈమాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదు.  కారణాలు హిందువులు ఊహించుకోవచ్చు.

ఏంచేద్దాం . గుత్తగుంపుగా వేయగలిగేలా ఊరికి ఒకవందఓట్ల హిందూ ఓట్ బాంక్ ఉండగలిగితే  గాని హిందువుల దుస్థితి తొలగించుకోలేరేమో !!!!

2 వ్యాఖ్యలు:

SIVARAMAPRASAD KAPPAGANTU January 1, 2014 at 4:35 PM  

మతం మత్తుమందు లాంటిది అంటె హిందూ మతం అని ఈ "ఎర్రోళ్ళ" ఉద్దేశ్యం. మొన్నీ మధ్య మోడీ ఫొటో తో సాంటా క్లాజ్ బొమ్మ చెస్తే ఘోరం జరిగిపోయినట్టు ఈ ఎర్రోళ్ళు/సెక్యులర్ మూఢాచారులు రగడ చెయ్య ప్రయత్నించారు. కొన్ని కొన్ని రోగాలు పొయ్యె ముందు ఎక్కువ చేస్తాయని వైద్య శాస్త్రం చెబుతుంటుంది. ఈ సెక్యులర్ మూఢాచారపు రోగం కూడా అటువంటిదే.

Hari Babu Suraneni January 3, 2014 at 3:41 AM  

భరత ఖండంలో హిందూ ధర్మం యెప్పుదు పుట్టింది, యెలా వృధ్ధి చెందింది, యెవరి వల్ల వృధ్ధి చెందింది? యెవరూ చెప్పలేరు! అదొక జీవ నది. నిరంతర ప్రవాహం. ఇవన్నీ పిల్ల కాల్వలు. ఇవ్వాళో రేపో ఇంకిపోక తప్పదు.ఇవన్నీ ఇంకిపోయాక కూడా ఆ జీవనది అలా పారుతూనే ఉంటుంది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP