శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జనవరి ఒకటికి,ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక దర్శనాలకై గొడవచేసే "విఐపీ" లు తిరుపతి లో అక్రమంగా నిర్మిస్తున్న యూనివర్సిటీ గూర్చి నోరు మెదపరేం ?

>> Saturday, December 28, 2013

గతసంవత్సరం  ముక్కోటి ఏకాదశి నాడు అక్కడ శ్రీవారి సేవలో వున్నది మాబృందం. ఆరోజు దర్శనానికై వచ్చిన ప్రముఖులు  జగత్ప్రభువును దర్శించుకుంటూన్నామన్న ధ్యాసలేకుండా ,తామొచ్చేసరికి స్వామివారు దర్శనమివ్వటానికి తయారుగా ఉండాలనేంత దర్పం ప్రదర్శించటం, సామాన్యభక్తున్ని ఒక్కక్షణం కూడా స్వామి ముందు నిలవనివ్వకుండా లాగివేసే అధికారగణం  ఈ వీ ఐ పీల పట్ల అడుగులకు మడుగులొత్తుతూ గంటలతరబడి వారికి దర్శనం కల్పించటానికై తపనపడటం చూశాను.    నాకో విషయం అర్ధం కావటం లేదు . కొండ ఏదో త, తాతగారి ఆస్తిలా భావించి  తమ అధికారప్రదర్శన  చేసే వీఐపీ లు సాక్షాతూతిరుపతికొండపాదాల సమీపంలో అనుమతుల్లేకున్నా అడ్డగోలుగా ఇతరమత ప్రచారాలు,అందుకు యూనివర్శిటీలనే నిర్మిస్తుంటే ,పత్రికలు చానల్లు ఈ అక్రమాలనుగూర్చి ఎలుగెత్తి చాటుతున్నా వీళ్లకు ఏమాత్రం వినపడటం లేదు. ఒక్కళ్లన్నా ఇది తప్పు అనే సాహసంచేయటం లేదు. అమ్దరికీ లేనిది మాకెందుకు అని వీల్లనుకోవచ్చు. కానీ అందరికీ లేనిది మాకెందుకీ ప్రత్యేక దర్శనాలని మామూలువాల్లలా దర్శనాలకు రావటం లేదే ?

వీల్లనే కాదు మనం కూడా ఆలోచించాలి .  మనపూజలు,కళ్యాణోత్సవాలు ,కొబ్బరికాయలు మొక్కుబడులు, ఇంతవరకేనా ? మనకు ఆపరమపురుషుని తో సంబంధం ? అక్కడ జరగబోయే అనర్ధాలగూర్చి సంకేతాలందుతున్నా మనకుస్పందనలేం ఉండవా?
దేవాధి దేవుడి దివ్యస్థలంపట్ల మన జాగ్రత్త అవసరమా అనకండి
దివ్యక్షేత్రాలన్నీ మనకోసం ఆపరమపురుషుని దివ్యానుగ్రహాన్ని ప్రసరింపజేయటానికి ఉద్భవించినవి. అవి మనకోసమే గాని ఆయనకోసం కాదు. కాబట్టి వీటీ పట్ల శ్రధ్ధాశక్తులు జాగ్రత్తలు మనకే అవసరం. ఈ దివ్యస్థలాల వైభవానికి, సంరక్షనకు కావలసిన స్పందనలు మననుండే రావాలి .
ఇక్కడ మనకు ఆయన పట్ల గల నిజమైన విశ్వాసం ఏమిటో కూడా నిరూపించుకోవలసిన అవసరం కూడా ఇమిడిఉంది?
దివ్యక్షేత్రాలలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలపట్ల,అపచారాపట్ల మన  నిరసనలను మనం తెలుపకుంటే ,కేవలం ఆయన దర్శనం ,లడ్డూప్రసాదం మాత్రమే మనకు చాలనుకుంటే మనకంటే విశ్వాసఘాతకులు ఇంకెవరూ ఉండరేమో ? [మన్నించండి కఠినంగా మాట్లాడుతున్నందుకు. మనసుపెట్టండి]  జైశ్రీరాం
తిమ్మప్ప ఆలయం స్థలంలోనే అక్రమంగా  కడుతున్న కడుతున్న ఇస్లాంమిక్ యూనివర్శిటీ

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP