శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

'సాధన కష్టమైన కార్యము కాదు'

>> Saturday, October 19, 2013

                           స్వామి సుందర చైతన్యానంద
సాధన విషయంలో ఆధ్యాత్మిక సాధకులకు అనేక విషయాలు తెలిసి ఉండినా, 'సాధన కష్టమైన కార్యము కాదు' అనే ముఖ్య విషయము మాత్రము చాలా మందికి తెలియదు. ఇక్కడే సాధకులు తెలియకుండానే బండ బరువును సాధనలో మోస్తూ ఉంటారు. ఇష్టమైన వ్యక్తిని మనం ప్రేమిస్తూ ఉన్నాము. ఇష్టమైన వారిని గూర్చి ఎవరైనా చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్నాం. లేదా, మనమే ప్రేమతో పలుకుతున్నాం. ఇష్టమైన కార్యాలను శ్రద్ధతో, ఉత్సాహంతో చేస్తున్నాం. ఈ విషయాల్లో ఎక్కడా కూడా కష్టం తెలిసిరావటం లేదు.  ఉదయించే సూర్యుని అందాన్ని చూస్తున్నాం. సముద్రంలో లేచిపడే అలలను చూస్తున్నాం. ఎత్తైన ఆలయగోపురాన్ని చూస్తున్నాం, పచ్చని పొలాలను, పర్వత శ్రేణులను చూచి ఆనందిస్తున్నాం. ఈ కార్యాలలో కష్టం ఉందా? లేదు. అయితే పరమాత్మ కొరకు మనం ఆచరించే సాధనలలో కూడా లేనట్లే. పువు్వలోని అందాన్ని చూడటానికైనా నేను కొద్దిగా ప్రయత్నించాలేమో గాని పరమాత్మను దర్శించటానికి ఆ మాత్రం ప్రయత్నం కూడా అవసరం లేదు. పరమాత్మ ఎవరో కాదు. మన స్వరూపమే. ప్రాణానికి ప్రాణమైనవాడు. మనసుకు మనసైనవాడు. మనసు వెనుక మహిమ తానై శోభించువాడు. తూర్పున సూర్యోదయం జరుగుతూ ఉంటుంది. అభిముఖంగా బాటసారి నడుస్తూ ఉంటాడు. అతడు నడుస్తూనే ఉంటాడు. పుణ్యకాలం కాస్త కారిపోతుంది. ఏదో ఆలోచిస్తూ ముందుకుపోతూ ఉంటాడే గాని అందమైన సూర్యోదయాన్ని వీక్షించడు. కళ్లముందే కాంతులు దివ్యంగా పరచియున్నా, దర్శించి ఆనందించే భాగ్యానికి నోచుకోడు. ఉన్నది ఏదైనా తెలియకుండా ఉన్నంత వరకు ఆ ఉన్నది ఉండినా ప్రయోజనం ఉండదు. ''ఉన్నది-తెలియకుండా ఉన్నది. అన్నీ జీవితంలో ఇలాగే ఉన్నాయి. కష్టాలు లేనివారు ఎవరు ఈ ప్రపంచంలో? అలా ఉన్నట్లు తెలిసినవారు ఎందరున్నారు? కష్టాలు పడటం వేరు. వాటి పూర్వా పరాలను అర్థంచేసుకోవటం వేరు. ''ఎన్ని కష్టాలొచ్చినా అతడికి కనువిప్పు కలుగలేదు. బాధలు చుట్టుముట్టినా అతడి మనసు భగవంతుని వైపు మరలటం లేదు అని చాలా మంది అంటూ ఉండటం మీరు వింటూనే ఉంటారు.
బాధలున్న వారు బాధల నుండి విడిపడేందుకు అన్యులను ఆశ్రయిస్తారు కాని భగవంతుని వైపు ఎందుకు తిరుగుతారు? ఆకాశాన్ని మేఘాలు క్రమ్మినట్లు మనిషిని కష్టాలు చుట్టేస్తే, దిక్కుతోచక మనిషి దుఃఖించగలడేమో గాని ప్రార్థించగలడా? బోరున విలపించగలడేమో గాని తన హృదయావేదనను పరమాత్మకు వినిపించగలడా? బాధలున్నంత మాత్రాన భగవంతుడు తెలిసిరాడు. బాధలను గుర్తించాలి. అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నంతో గాని, ఇతరుల సహకారంతో గాని బ్రతుకులో బాధలు దూరం కావు అనే గొప్ప సత్యాన్ని బుద్ధి దర్శించగలగాలి. అంతేకాదు. జీవితంలో ఎదురయ్యే ఉపద్రవముల న్నిటినీ తొలగించి, అనంతానందమును ప్రసాదించే శక్తి పరమాత్మకే ఉంది అనే సత్య విషయం అర్థం కావాలి. అప్పుడే మనసు భగవంతుని వైపు తిరుగు తుంది. అంతవరకు కష్టాలు ఉంటాయి. కాని అర్థం కాకుండా ఉంటాయి.  అర్థమైతే, సాధన కష్టం కాదు. ప్రేమకార్యాలలో కష్టాలుండవు. మనం ప్రేమించేవారికి, వారిపై మనకున్న ప్రేమకి పెద్ద తేడా లేదు. సాధ్యరూపుడైన పరమాత్మకు, పరమాత్మకు సంబంధించిన సాధనకు మధ్య కూడా పెద్ద తేడా లేదు. అది గ్రహించిన మరుక్షణం నుండి సాధన గాలిలాగ తేలిపోతూ ఉంటుంది. తేలికగా ఉంటుంది. ప్రతిక్షణం మనస్సులో పరమాత్మే తేలుతూ ఉంటాడు. ప్రపంచం మునుగుతూ ఉంటుంది. ''భావగ్రాహి జనార్దనః. మన భావాన్ని గ్రహించేవాడు భగవంతుడు. కాదు కాదు. మనభావాన్ని భగవంతుడే గ్రహించగలడు. తనకంటూ పరమాత్మకు భావాలు లేవు. కనుక నీ భావాలను అర్థం చేసుకుంటాడు. ఇతరుల పరిస్థితి వేరు. వాళ్లు తమ భావాలను జోడించి మనల్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. అందుచేతనే ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికి అర్థం కాకుండా మిగిలిపోతారు. పరమాత్మ నీ భావాల్ని గ్రహిస్తాడు. నీ మొరవింటాడు. నీ మాటల్ని ప్రేమతో ఆలకిస్తాడు. ఎలా పిలిచినా పలుకుతాడు. పరమాత్మ మెచ్చుకొనేటంతటి గొప్ప భాష మన వద్ద లేదు. మనం భావస్ఫూర్తితో ఏది పలికినా, అది పరమాత్మకు ప్రియంగా ఉంటుంది. నీ పలుకుల్లో వ్యాకరణ దోషాలున్నాయని పరమాత్మ నీకు దూరంగా పోడు. మనలోకి వ్యాకరణ వైభవాన్ని చూచి మనల్ని గుర్తించటానికి పరమాత్మ మేష్టారు కాదు. పరమాత్మకు కావలిసింది భాషావేత్తలు కారు. భక్తులు. భక్తులలో భాషా వైభవం తొంగి చూడవచ్చు. భాష ఉన్నవారందరూ భక్తులు కాలేరు. మనం భక్తులం కావాలి. ఏం చేయాలి? భక్తి చేయాలి. ఇంకేం చేస్తాం? మరేదో చేస్తే మరొకర మవుతామేమోగాని భక్తులం ఎలా అవుతాము? ఒక నిర్జన ప్రదేశంలో నడచి వెళ్తున్నాము. మార్గ మధ్యంలో ఒక చెట్టు క్రింద కూర్చుని కళ్లు మూసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. అప్పుడు మనమెక్కడున్నాం? చెట్టుక్రింద లేము. ఆలయంలో ఉన్నాం. పరమాత్మ మన మనస్సులో కదలిన క్షణాన మన దేహం దేవాలయం అవుతుంది. 'దేహో దేవాలయః ప్రోక్తః. దేహము దేవాలయంగానే ఉంది. కాని, తెలియకుండా ఉంది. భక్తి చేయగానే తెలియనది తెలుస్తుంది. దేహమున్నంత మాత్రాన అది దేవాలయం కాలేదు. భావన చేరితేనే, భక్తి భావన చేరితేనే దేహం ఆలయంగా శోభిస్తుంది.
పువు్వ అందంగా అగుపిస్తుంది. భావనతో దానిని పరమాత్మకు నివేదిస్తే అది ఆరాధనగా మారుతుంది. ''వేద్యం తెలిసి వస్తే, ఏది ఇచ్చినా 'నైవేద్యం అవుతుంది. ఫలపుష్పాలే కావు, పత్ర తోయాదులు కూడా నైవేద్యాలు. అవి కూడా చేతికి అందకపోతే, ఉన్న చేతుల్ని ఏకం చేసి 'నమః అనటమే. అది కూడా సమర్పణమే.      

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP