శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పరమాచార్య వాణి [ ౩ వ సంకలనం

>> Monday, May 20, 2013

పరమాచార్య వాణి # 10
Inline image 1

"ప్రతీ కుటుంబము ఈశ్వరుని పూజ చేయాలి. అవకాశము, వీలు కుదిరిన వారు, పెద్దల/గురువుల నుండి ఇవ్వబడిన/ఉపదేశం పొందిన విశేష పూజావిధానాలను అవలంబించాలి. ఉదాహరణకి పంచాయతన పూజ వగైరా. ఇలా పెద్దల నుంచీ పరంపరాగతముగా రాకపోయినా (గురువుల నుండి ఉపదేశం పొందకపోయినా..), అటువంటి కుటుంబాలు కూడా ప్రతీ రోజూ లఘువుగా పూజ తప్పనిసరిగా చేయాలి. ఇలా లఘుపూజ సుమారు పది నిమిషాలలో పూర్తి చేసేయాలి. ఆఫీసులకి వెళ్ళేవారు, కనీసం ఈ లఘు పూజ అయినా చేసి వెళ్ళాలి.

ప్రతీ ఇంటిలోనూ పవిత్రమైన ఘంటా నాదం ప్రతీ రోజూ వినబడాలి".

-------------------------------------------------------------------------------------------

పరమాచార్య వాణి # 19Inline image 1
"ఎవరైనా మన పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నా, మనల్ని దూషించినా, నింద చేసినా మనము వారి పట్ల ఆగ్రహం చెందకూడదు. మన ఒకరి వల్ల మాట పడవలసిన వారిమా కాదా అనే విషయం మన అంతరాత్మకి తెలుసు. ఒక్కొక్క సారి మనం ఎదుటి వ్యకికి ఏ అపకారమూ ఇతఃపూర్వం చేయకున్నా కూడా, ఆ వ్యక్తి వచ్చి మనల్ని దూషించడమో/తూలనాడడమో/నింద చేయడమో చేయవచ్చు. అనగా అన్ని సార్లూ మనం మన తప్పిదాల వల్లనే మాటపడకపోవచ్చు. కానీ ఇంకొక నిజం కూడా ఏమిటంటే, మనం కూడా గత జన్మలలో ఎన్నో ఎన్నో పాపాలు చేసి ఉన్నాము. అమ్మవారి ఎదుట మనం చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి, మన పాపాలను కడిగివేయమని అమ్మవారిని కన్నీళ్ళతో ప్రార్ధించాలి. అప్పుడూ మాత్రమే మనం ఎదుటి వ్యక్తిని వేలు ఎత్తి, ఆ వ్యక్తిలో ఉన్న దోషములు ఎంచడానికి అర్హులము".

-----------------------------------------------------------------------------------------------

పరమాచార్య వాణి # 20
Inline image 1

"ఆహారం తీసుకోవడం వల్ల, ఆకలి తీరుతుంది. కానీ అగ్నిలో ఎన్ని పదార్ధాలను వ్రేల్చినా, ఆ అగ్ని శాంతిస్తుందా?? లేదు. ఎన్ని పదార్ధాలను తీసుకువచ్చి అగ్నిలో వేసినా, అది వాటినన్నిటినీ దహించివేసి ఆఖరికి నల్లని బూడిదగా మారుస్తుంది. కామము కూడా అటువంటిదే. కామం నుంచి పుట్టిన కోర్కెలను తీర్చినకొద్దీ,  అది అగ్ని శిఖలా ఇంకా ఇంకా పైకి లేస్తుంది, కామం తీరిన కొద్దీ ఇంకా దాని దాహార్తి పెరుగుతుంది తప్ప. తరగదు. (ఇక్కడ కామము అంటే కేవలం తుఛ్చ కామము మాత్రమే కాదు, ఇంద్రియ లౌల్యాల వలన కలిగే అన్ని కోరికలు అని అన్వయించుకోగలరు.) నిజానికి అగ్ని పదార్ధాలను కాల్చి నల్లని బొగ్గు చేసినట్లుగా, కామము మన మనసుని అంధకారపూరితం చేస్తుంది. ఒక కోరిక తీరిన వెంటనే తాత్కాలికముగా తృప్తి చెందుతుంది, మళ్ళీ ఇంకో కోరిక కావాలని బయలుదేరుతుంది. ఇలా ఒక దాని వెంట కోరికలు వస్తూ ఉంటే చివరికి, మనశ్శాంతి కోల్పోయి, చివరికి క్రోధమునకు, అమితమైన దుఃఖానికి గురవుతాము".

పరమాచార్య వారి పై మాటలు చదివితే, గీతాచార్యుని ఈ శ్లోకములు జ్ఞప్తికి వచ్చినవి..
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాక్రోధోఽభిజాయతే II
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాత్ బుధ్ధి నాశో బుద్ధి నాశాత్ప్రణస్యతి II

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP