శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మే కోపగిస్తే ఆదుకునేదెవరు ?

>> Saturday, May 18, 2013

ప్రకృతి అంతా శ్రీమాత స్వరూపం. లోకంలో తనబిడ్డలైన సకల జీవరాసియొక్క ఆలనాపాలనా చూస్తుంది.ఆకలితీర్చటానికి అనేకానేక మార్గాలలో ఆహారాన్ని అందజేస్తుంది .  తల్లి సహనశీల . తన బిడ్డల తప్పులనూ కాస్తుంది. కానీ శృతిమించినప్పుడు సరిచేయటానికీ వెనుకాడదు.  ప్రస్తుతం  మనం [మానవులం] ప్రకృతి మాత ఇచ్చిన సమస్త సంపదలనూ దుర్వినియోగం చేస్తూ ధ్వంసం  చేసే పనిలో ఉన్నాము.  అందుకేనేమో ఆతల్లి  కోపఛ్చాయలు మనకు అప్పుడప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి.

మొన్న ఆదివారం ఉదయమల్లా మండిపోయే ఎండ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో  పెనుగాలి వీచింది. ఆ వాయువిజృంభణ చూచి   మా ఊరిప్రాంతం పావుగంటసేపు  గడగడా వణికిపోయింది . ఇళ్లకప్పులు లేచాయి చెట్లు విరిగాయి . కరంట్ స్థంభాలు నేలకొరిగాయి .
ఇక మా పీఠ ఆవరణలో  చెట్లు నిలువునా కూలాయి . రేకుల షెడ్డు పైకెగిరి సిమెంట్ రేకులు  ముక్కలుముక్కలుగా మారాయి.  ఎంత ఎండకు కూడా చల్లగా ఉండే ఆశ్రమప్రాంతం  కూలిన చెట్లను తొలగించటంతో వేడిసెగలు కక్కుతుంది .
గత ఆదివారం  నుండి విద్యుత్ సరఫరా అగిపోయి ఇదిగో రాత్రి [వారం రోజుల తరువాత ] మొదలైంది .    మానవులం  సమిష్టిగాచేస్తున్న మూర్ఖపు పనుల ఫలితంగా  ప్రకృతిలో ఉన్న  ఇతరజీవరాశి కి కలిగే బాధను చూడలేకనేమో ? ఆతల్లి ఇలా కొద్దిగా కోపగించినది. అదే ఆ తల్లి ప్రళయరూపంలో కనిపిస్తే పూనుకుంటే పరిస్థితి ఎలాఉంటుందో ? 
దిక్కెవ్వరు తల్లీ నీవు తప్ప . అని నమస్కరించు కోవటం తప్ప చేయగలిగనదేముంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP