శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రథసప్తమి నాడు ఆచరించవలసిన విధులు

>> Monday, February 4, 2013

ప్రియ భగవత్ బంధువులారా మీ అందరికి నమస్కారం
17.2.2013- మాఘ సుద్ధ సప్తమి -   రథ సప్తమి.  ఈ సందర్భంగా ప్రత్యక్ష
పరమేశ్వరుడైన శ్రీ  సూర్య భగవానుని గూర్చి కొన్నివిషయాలు ప్రార్ధన
పురస్తరంగా మననం చేసుకుందాం.
నవగ్రహ అధిపతి గా కూడా శ్రీ సూర్యభగవానుని మనం పూజిస్తాం.  సప్తాశ్వ రధ
ఆరుడుడై వెలిగే ఆ స్వామికి నమస్కారములతో

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర - దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
అని మనం సదా ప్రార్దిస్తున్న  ఆ సూర్య భగవానునికి ప్రీతీ పాత్రమైన రోజుగా
రథ సప్తమి మనం జరుపుకుంటూ ఉంటాం.  మాఘ సుద్ధ సప్తమి "రథ సప్తమి"  గాను
మరియు శ్రీ సూర్య జయన్తిగాను జరుపుకోవడం ఆనవాయితి.
సుర్యదయత్  పూర్వమే ఇంటి ముంగిలిలో  రథం ముగ్గులు వేసి సూర్య భగవానుని
స్వాగతిస్తాం.
ఆనాడు భక్తులు అర్కపత్రము  అంటే జిల్లేడు ఆకు తలపై ఉంచుకుని దానిపై
రేగిపండు పెట్టి తల స్నానం చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పటిస్తారు.
శ్లోకాన్ని  ప్రత్యేక ఫైల్ గా జత పరుస్తున్నాము.
ఇలా చేస్తే ఏడు జన్మలనుంచీ వస్తున్న పాపపు రాసి నశిస్తుంది అన్నది వైదిక నమ్మకం.
సూర్య భగవానునికి నివేదనగా  పొంగలి చేస్తారు.   ముందుగ  ప్రదేశాన్ని
గోమయం తో  (ఆవు పేడ)  సుద్ధి చేసి  గోమయం తో చేసిన పిడకల్ని చక్కగా
గుండ్రంగా  ఒక దాని పై ఒకటి అమర్చి వెలిగించి, ఆ పిడకల పొయ్యిమీద ఇత్తడి
పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి, పాలు పొంగు వస్తున్న తరుణంలో కొత్త
బియ్యం, బెల్లం అందులో వేసి చిక్కగా నివేదనకు సిద్ధం గా చెక్ర పొంగలి
వండుతారు.  దీనినే శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.  ఈ పొంగలి
ప్రసాదం  చిక్కుడు ఆకులో పెట్టి నివేదన చేస్తారు.  వితరణ కూడా చిక్కుడు
అకులోనే చేస్తారు.
మీ అందరికి తెలిసినదే - పాలు పొంగించడం ఆ ఇంటి వృద్ధి కి  సంకేతమని, మనం
నూతన గృహ ప్రవేశం చేసిన, అద్దె ఇల్లు మారిన ఈ పాలు పొంగించడం అందుకే మన
సంప్రదాయమయింది.

ఇంకో విషయం,  ఈ పర్వదినాన, పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడు
కాయల్ని వాడి  కొబ్బరి  ఆకు పుల్లల సహాయంతో రథంగా చేయడం, సూర్యదేవుని
రధంగా దానిని భావించి పూజించడం కూడా మనం పల్లెల్లో ఇప్పటికీ చూసి
తీరాల్సినదే .

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్  - ఆరోగ్య ప్రదాతగా  శ్రీ సూర్యదేవుని చెప్తారు.
ఈ మహా పర్వదినాన మనం అందరం ఆ సూర్య భగవానుని భక్తీ, శ్రద్ధ లతో  పూజించి
పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.  ఆదిత్యహృదయం,  సూర్య
స్తోత్రం, నవగ్రహ స్తోత్రం  తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు
వాక్యం.

సర్వేజనాః సుఖినో భవంతు
మీ
శ్రీ సాయి పథం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP