శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కొండగురునాథుని కొండపై అపచారానికి పాల్పడిన దుర్మార్గులు

>> Tuesday, February 5, 2013


 గుంటూరు జిల్లాలో  ప్రసిధ్ధ క్షేత్రం కొండగురునాథ స్వామి    కొండపై అపచారం జరిగింది. క్షేత్రప్రాశస్త్యాన్ని దెబ్బతీయాలనే దుర్మార్గపు ఆలోచనతో దుండగలు సోమవారం సాయంత్రం  స్వామి వారి దారుశిలా మూర్తులను పెకలించారు.    మనరాష్ట్రంలోనే కాక పలు రాష్ట్రాలలో  స్వామిని కులదైవంగా కొలచే భక్తులున్నారు. గురప్ప పొంగలి అనేపేరుతో  ఇంటిలో ఏశుభకార్యం జరగాలన్నా ముందుగా పొంగల్లు చెల్లి స్తారు. అటువంటి ప్రాశస్త్యం గల క్షేత్రంలో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటారు . మాఘపౌర్ణమి రోజు తిరునాళ్ళ జరుగుతుంది. లక్షలాదిమంది భక్తులు ఆరోజు స్వామి దర్శనానికి తరలి వస్తారు.
 మాగ్రామ సమీపంలో గల కొండపై వెలసిన స్వామి ఆలయంలో ఈ సంఘటన జరిగాక రాత్రిని విషయం తెలసి మేమంతా కొండపై చేరుకున్నాము . ఈరోజు ఉదయం పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలన జరిపారు. సుమారు సాయంత్రం ఐదుగంటల ప్రాంతం లో ఈసంఘటన జరిగినట్లు తెలవటం , అక్కడున్న  దొన[నీటి కుంట] లో విషపదార్థాలు కలపతం చూస్తే ఇది  ఖచ్చితంగా   హైందవ పుణ్యక్షేత్రాలపై కావాలని దాడులు చేస్తున్నవారి పనేనని, భక్తులు ఆరోపిస్తున్నారు.
  విషయం తెలిసిన భక్తులు తండోపతండాలుగా కొందకు తరలివస్తున్నారు. ఈసాయంత్రం ఆరుగంటలకు కొండవద్ద అన్నిగ్రామాల ప్రజలతో ఒక సమావేశం ఏర్పాటుచేస్తున్నాము
క్రింద వీడియోలో స్వామి క్షేత్రాన్ని దర్శించండి.





1 వ్యాఖ్యలు:

anrd February 7, 2013 at 5:48 AM  

అయ్యో ! ఇలా ఎందుకు చేస్తారో ఏమిటో ? వాళ్ళకి దేవుడంటే భయం కూడా ఉండదు కాబోలు..

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP