శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తాను కదలి భక్తులను కాపాడిన కొండగురునాథుని పునః ప్రతిష్ఠ

>> Friday, February 8, 2013

కొండగురునాథ స్వామి వారి కొండపై జరిగిన దుశ్చర్య గూర్చి గత పొస్ట్ లో తెలిపి ఉన్నాము. స్వామి మహిమ మరోసారి ఈచర్యతో లోకానికి వెల్లడైనది.   కొండపై ఈఘాతుకానికి ఒడగట్టినవారు ముందుగా  కొండపై ఉన్న నీటి దొన లో విషపదార్థాలు కలిపారు. ఆతరువాత వెళుతూ స్వామి వారి మూర్తులైన దారుశిలలను కదలిమ్చినట్లు తెలుస్తున్నది .     స్వామి వారికి ఈ బుధ్ధి కల్పించి ఉండక ఆయనను కదలిమ్చక పోయి ఉంటే ఘోరం సంభవించేది. రేపు ఇరవై అయిదున స్వామి వారి తిరుణాళ్ల కు లక్షలాది మంది జనం తరలి వస్తారు.  కొండపై కివచ్చిన జనం ముందుగా ఆ  నీటి దొనవద్దకు వెళ్ళి  ఆజలాలను త్రాగటం,అలాగే పొంగళ్ళు పెట్టుకోవటానికి వాడి ఉండేవారు . ఆవిషపు నీటిని తాగితే  ఎంత ఘోరం సంభవించి ఉండేదో తలచుకోవటానికే భయం కలుగుతుంది.  భక్త జన సంరక్షణార్ధమై కాబోలు స్వామి తాను దుండగల చేతిలో కదలటం ..అదీ విషయం గంటవ్యవధిలో ఓ భక్తుడు కొండపైకి వెళ్ళి గమనించేలా చేయటం ద్వారా  తెలియపరచారు. ఆరాత్రి స్వామి సన్నిధిలో ఉన్న భక్తులు పొద్దుటే నీటి దొనవద్దకు వెళ్ళి నీటిలో విషపదార్థాలు కలిపిన విషయం గమనించతం ఈప్రమాదం తప్పిపోవటం స్వామి కరుణకు నిదర్శనం.

 మేము  చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ విషయం తెలియపరచి  భక్తజనాన్ని చైతన్యపరచి    ఉద్యమాన్ని వేగంవంతం చేయటంతో పోలీసులు దర్యాప్తు వెంటనే ప్రారంభించారు .ఐతే  కొందరు   ఏదో ఒత్తిడివారి పై వస్తున్నట్లు తెలుస్తున్నది.
స్వామి వారి భక్తుల ఆవేదన  వలన  స్వామి పున; ప్రతిష్ఠ కార్యక్రమం  రేపటి నుంచి ప్రారంభమై సోమవారం జరుగనున్నది. రాజమండ్రి ప్రాంతం నుంచి రుత్విక్కులు కొండపైకి చేరుకుంటున్నారు . రేపొద్దుటనుంచి ప్రతిష్ఠాకార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి.
జై శ్రీ కొండగురునాథ .

2 వ్యాఖ్యలు:

anrd February 8, 2013 at 9:34 AM  

స్వామి వారు దయామయులు. జై శ్రీ కొండగురునాథ .

Unknown February 8, 2013 at 6:03 PM  

meeru chaala manchi pani chestunnaru. great. continue cheyyandi.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP