శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగానికి గోత్రనామాలు పంపండి

>> Friday, February 8, 2013

శ్రీ రామ







భగవద్బంధువులకు  హనుమత్స్మరణపూర్వక నమస్కారములు  .  హనుమత్ప్రభువుల అనుగ్రహం వలన   హనుమత్ రక్షాయాగం  లోభాగంగా  రాష్ట్ర వ్యాపితంగా హనుమాన్ చాలీసా  పారాయణములు ,రామనామ జపములు జరుగుతున్నవి.  ఈనెల  21  న పూర్ణాహుతి  జరుగనున్నది.  ఈ కార్యక్రమములో  గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున ఆహుతులు సమర్పించబడతాయి.  ఐతే మీ గోత్రనామాలతో పూజ జరగాలంటే  మీరు  ఈ శనివారం నుండి పూర్ణాహుతి అయ్యేవరకు మద్యమాంసాదులను భుజించరాదు. నిత్యం హనుమాన్ చాలీసానుగాని, లేక శ్రీరామ నామము గానీ మీ శక్తిమేర జపించాలి . ఇందుకోసం ఎవరికీ ఏమీ పంపవలసి లేదు.
ప్రసాదములు పంపమని కోరేవారు మాత్రం మీ స్వంతఖర్చులు భరించవలసినదే.


ఇక ఎప్పటిలా ఈ యాగమునకు కావలసిన ద్రవ్యములు [ఆవునెయ్యి, కొబ్బరి కాయలు, ఫలములు,పుష్పములు, ఇత్యాదులు] ,అన్నదానం పుణ్య,గ్రంథ వితరణ ,వంటి కార్యక్రమములలో భాగస్వాములవ్వవలెనని కోరుకున్నచో    వారు మమ్మల్ని సంప్రదించి మేము తెలుపు ఎక్కౌంట్ నంబర్ కు మాత్రమే పంపవల్సి ఉన్నది .  కొందరు  ఫోన్లు  చేసి  వారి ప్రాంతము నుండి వచ్చే వారి ద్వారా పంపవచ్చునా అని అడుగుతున్నారు. దయచేసి ఎక్కౌంట్ కు మాత్రమే పంపితే అవి స్పష్టం గా అందరి పరిశీలనలో పారదర్శకంగా ఉంటాయి. ఇలా ఈ కార్యక్రమములలో పాల్గొన్నవారందరికీ  ప్రసాదములు పోస్ట్ ,కొరియర్ లలో పంపబడతాయి .కనుక మీరు మీ అడ్రెస్ ను, మీరు పంపిన ద్రవ్యవివరాలను  మెయిల్ ద్వారా గానీ ఎస్ ఎమ్ ఎస్ ద్వారాగానీ  తెలియపరచటం మరచిపోవద్దు.   ఇక యాగమునకు వచ్చువారు సంప్రదిస్తే వారికీ వారి ప్రాంతం నుండి రూట్  వివరంగా తెలియపరచబడుతుంది . మామూలుగా  హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ మీదుగా వినుకొండ చేరవచ్చు, బెంగళురు..విజయవాడ నుండి వినుకొండకు రైలు, బస్సు మార్గ ముంది.   ఒంగోలు నుంచి బస్సులోనూ, కర్నూల్ వైపునుండి కూడా బస్సురూట్లలో వినుకొండ చేరుకోవచ్చు  . అక్కడ నుండి అరగంట ప్రయాణం .


durgeswara@gmail.com
9948235641





0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP