శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సింగపూర్ లో సమస్యల లో చిక్కుకుని ఉన్న వీరిని కాపాడు స్వామీ !

>> Tuesday, December 11, 2012

గతవారం లో మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది , అందులో ఒకసోదరి  తాను సింగపూర్ నుండి మాట్ళాడుతున్నానని మీతో  కాస్త వివరంగా మాట్లాడటానికి అవకాశమివ్వగలరా అని అడిగింది. గొంతులో దిగులు మాటలను బట్టి అర్ధమవుతున్నది. అయ్యో ! దానికేమమ్మా మాట్లాడమని చెప్పాను.

నేను మీబ్లాగు తరచుగా చూస్తూ ఉంటానండి.  మేమొక సమస్యలో చిక్కుకుని ఉన్నాం . ఎటూదారి కనపడక దిక్కుతోచటం లేదు. వారం రోజులుగా మీతో మాట్లాడాలని నాఆవేదన చెప్పుకోవాలని  అనిపిస్తున్నది. అందుకే ఈవేళ ఫోన్ చేశానండి .  అని దుఖపూరిత కంఠంతో చెబుతున్నారావిడ
పరవా లేదమ్మా ! విషయం చెప్పు . నాకు చేతనైన సలహా నేనిస్తాను అని ఊరడించాను .

స్వామీ ! మాది మధ్యతరగతి కుటుంబం .  సింగపూర్ లో ఉద్యోగం చేస్తున్నాము . పదిసంవత్సరాలు కష్టపడి పైసా పైసా కూడబెట్టి  ఇక్కడ ఒక  ఇల్లు కొన్నాము.    ఎవరి దృష్టి సోకిందో మాఆనందం ఎంతోకాలం నిలబడలేదు. మొన్న దసరాకు గృహప్రవేశం చేశాము. కానీ  ఇరవైరోజులు గడవకముందే మా ఆయనకు ఉద్యోగం పోయింది. మాకు కష్టాలు మొదలయ్యాయి . తీవ్రమైన ఇబ్బందులలో ఉన్నాము .ఏమి  చేయాలో అర్ధంకావటం లేదు స్వామీ!  ఈ సమస్యను నేను మా నాన్నగారికి కూడా చెప్పలేదు , మీకే చెప్పుకుంటున్నాను . ఎందుకో మీకు చెప్పుకుంటే ఆవేదన తగ్గుతుందనిపించి చెప్పుకున్నాను.మావాల్లకు  తెలిసినా నాతరపున వాల్లుగానీ ఆయన తరపున వాల్లుగానీ సహాయం చేయగలస్థితిలో లేరు అని దుఃఖించినది ఆ తల్లి.

పరవాలేదమ్మా ! కష్టాలు ,సుఖాలు రెండు తప్పవుకదమ్మా ! కాకుంటే మనప్రయత్నాలన్నీ వృధా అయినాకైనా భగవంతుని ఆశ్రయించి మన కష్టాలు తొలగించుకోవాలనుకోవటం మంచి మార్గం.  అని చెప్పాక నాకొక  చిన్న అనుమానం వచ్చింది . అమ్మా! మీరు కొన్న అపార్ట్ మెంట్ లో గతంలో ఉన్నవాల్లకెలా ఉంది అనడిగాను. అందులో ఉన్నవాల్లు  "డైవోర్స్" తీ సుకుని ఎవరికి వారవటం వలన అమ్మారు . మేము కొన్నాము అని చెప్పిందావిడ.

అయ్యో ! ఇల్లు కొనేప్పుడు కొన్ని శుభలక్షణాలున్నాయా ;లేవా ? అని చూసుకోవాలి కదమ్మా !

ఇక్కడ మనకులాగా అన్ని వివరాలు తెలుసుకోవటం కుదరదండి . దానివల్లఅని బాధపడిందావిడ

సరేనమ్మా ! ఇప్పుడు ఆఇల్లు వేరేవాల్లకు అమ్మితే పోలా ? అనడిగాను
ఇక్కడ చట్టాలప్రకారం సింగపూర్ లో నివాసముండేవారు ఇంటిని కొన్న ఐదుసంవత్సరాలవరకు అమ్మటం కుదరదండి ...  ఉద్యోగంలేక .సంపాదనలేక ఏమిచేయాలో తెలియటం లేదని భయపడుతున్నారాసోదరి  . నిత్యం భగవంతుని నమ్మి ఉండి కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతున్న మాకీ ఆపద  ఎందుకొచ్చిందో !ఏదో మార్గం చెప్పండి అని ఆవేదనతో కోరినది ఆ అమ్మ.

భయాలను దూరం  చేసే స్వామి! ఆపదలలో భక్తులకండయై నిలచే ఆంజనేయస్వామి ఉన్నరమ్మా ! కష్టాలు వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించాలనిపించటం కూడా ఆయన కృపయే. మీరు నిత్యం స్వామి ప్రదక్షిణలు మొదలుపెట్టండి . రోజుకు పదకొండుసార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి .అని ఒక సాధనామార్గం చెప్పాను. అయితే ఈసాధనాకాలంలో కొన్ని నియమాలను కూడా సూచించాను.  ఆవిడ శనివారం తరువాత మొదలుపెడతానన్నారు . నాకు మళ్ళీ ఫోన్ రాలేదు.
అయితే నిత్యం నాబ్లాగు చూస్తానన్నారు కనుక మీకు ఇంకొక సారి చెబుతున్నానమ్మా

స్వామిని ఆశ్రయించి నవారు నిరాశచెందరు.  ఇలాంటి క్లిష్టస్థితిలో ఉండి స్వామి అనుగ్రహంతో శుభాలుపొందినవారెందరినో నేను చూశాను. కాకుంటే మనకు భక్తి విశ్వాసాలు ముఖ్యం. అవసరం కోసం ఆయనను ఆశ్రయిమ్చినట్లుకాక  మనకు అత్యంత ఆప్తునిగా భావిమ్చి ఆయనదగ్గర మీ ఆవేదన వెల్లడించుకోండి.  మీదుఃఖాన్నంతా ఆయనతో చెప్పుకోండి. మీరు మీఅబ్బాయి గూర్చి కనపరుస్తున్నారే ప్రేమ ..ఆప్రేమ భావనతో స్వామిని కొలవండి .  తప్పక మీకు శుభం కలుగుతుంది. ఇది మీభక్తి కి ఒక పరీక్ష. అంతేకాదు స్వామి అనుగ్రహానికి మరొక ఉదాహరణకూడా అవుతుంది.

మీతరపున స్వామిని మేముకూడా వేడుకుంటాము ఇక్కడ .

జైశ్రీరాం ... జైహనుమాన్

2 వ్యాఖ్యలు:

minabe December 11, 2012 at 7:45 PM  

Ridiculous advice...you gave to her
What if she doesn't beleive in God
What if she is a muslim or Christian.
People loose jobs for many reasons..
instead of advicing them to be strong and try for a different job you tell them to sit and pray...Does it bring his job back
shame...

మనోహర్ చెనికల December 11, 2012 at 10:07 PM  

ఆ తల్లి బాధలు త్వరలో గట్టెక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

తల్లీ , ఆ స్వామి అనుగ్రహం తో సాధించలేనిదేమీ లేదు. అసాధ్యసాధకస్వామి ఆయన, మనస్పూర్తిగా ఆయన్ని శరణు వేడండి, ఆయనే చూసుకుంటాడు, మిమ్మల్ని ఒదార్చడానికో మాయ చెయ్యడానికో చెప్పడంలేదు, త్రికరణశుద్ధిగా నేను నమ్మినది, అలా నమ్మిన వాళ్ళు చెప్పినదే నేను చెప్తున్నాను. హనుమ అని చేతి మీద రాసుకుని ప్రార్ధించినా చాలు, పరిగెత్తుకు వస్తాడు ఆయన...........

మీ కష్టం తొలగిపోయి, సంతోషంగా ఉన్నామని రాసే లేఖ కోసం ఎదురుచూస్తూ ఉంటాము, మేమూ మీ కోసం ఆ స్వామిని ప్రార్ధిస్తాం.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP