దళిత ముసుగులు వేసుకొని అన్యమతస్థులను ప్రోత్సహిస్తూ, హిందూ స్వామీజీలను కించపరిచే వారి అంతుచూస్తామని మాలమహానాడు హెచ్చరించింది.
>> Saturday, November 3, 2012
హైదరాబాద్, నవంబర్ 3 : దళిత ముసుగులు వేసుకొని అన్యమతస్థులను
ప్రోత్సహిస్తూ, హిందూ స్వామీజీలను కించపరిచే వారి అంతుచూస్తామని
మాలమహానాడు(ఆర్ఎస్ రత్నాకర్) హెచ్చరించింది. తెలంగాణ ఇన్‌చార్జి
అనిల్‌కుమార్, గ్రేటర్ అధ్యక్షుడు జి.ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి
బాలస్వామితో కలిసి ఆయన శనివారం ఇక్కడ మాట్లాడారు. ఇటీవల హిందూమతం నుంచి
దూరంగా వెళ్లిన దళితులను తిరిగి హిందూమతంలోకి ఆహ్వానించేందుకు స్వామి
పరిపూర్ణానంద చేపట్టిన యాత్రను అన్య మతస్థులు కొందరు అడ్డుకొనేందుకు
యత్నించడాన్ని ఖండించారు.
స్వామిజీ యాత్రలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయడం ఎలా తప్పు అవుతుందో దళిత బహుజన పార్టీ నేత కృష్ణస్వరూప్ చెప్పాలన్నా రు. దళిత ముసుగులో దళితులను హిందూ మతం నుంచి దూరం చేసి అన్యమత అభివృద్ధికి కంకణం కట్టుకొన్న కొందరు.. అంబేద్కర్ ఆశయాలను భూస్థాపితం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిిందూ దళితుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పరిపూర్ణానంద చేపట్టిన యాత్రకు దళితుల మద్దతు ఉంటుందన్నారు.

andhrajyothy.daily 4-11-2012
1 వ్యాఖ్యలు:
ఇది మంచి పరిణామం.
Post a Comment