శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సుపరిపాలనకు రామాయణం మంచి పాఠం... బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్

>> Wednesday, November 21, 2012

సుపరిపాలనకు రామాయణం మంచి పాఠం
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్

లండన్, నవంబర్ 20 : "సుపరిపాలనకు రామాయణం మంచి పాఠం'' ఈ వ్యాఖ్యలు చేసింది ఏ హిందువో లేదా భారతీయుడో కాదు. స్వయానా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్! తన అధికార నివాసం వద్ద దీపావళి పార్టీని నిర్వహించిన ఆయన భారత ఇతిహాస గ్రంథం రామాయణ గొప్పదనాన్ని కొనియాడారు. "ప్రజలకు రక్షణ, అనురాగం, దిద్దుబాటు ఎలా అందించాలో రామాయణం చాటి చెప్పింది. ఇది మంచి పాఠంలాంటిది. మంచి ప్రభుత్వం అలాంటి పాలనే ప్రజలకు అందించాలి. బ్రిటన్ లో మేము ఆ సుపరిపాలనకే ప్రయత్నించాలి'' అని కామెరూన్ వ్యాఖ్యానించారు.

బ్రిటన్‌లో జరుపుకునే బోనఫైర్ రాత్రి సంబరాల కంటే దీపావళి సంబరాలే ఆధ్యాత్మికంగా మెరుగైనవని వెల్లడించారు. చెడుపై మంచి సాధించిన విజయానికే ఈ రెండింటినీ జరుపుకుంటున్నామని ఇదే వీటి మధ్య ఉన్న పోలికన్నారు. బ్రిటన్‌లో భారత రాయబారి జైమిని భగవత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించడంపై భగవత్‌కు కామెరూన్ శుభాకాంక్షలు తెలిపారు.

andharajyothy . daily  . today

1 వ్యాఖ్యలు:

Anonymous November 21, 2012 at 2:57 PM  

మన వారు "కవి" లు కదా, ఇటువంటివి కనపడవు, వినపడవు. రామాయణం మన ప్రభువులకు బూతులా కనపడుతుంది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP