శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవారిసేవకై తిరుమల బయలుదేరుతున్న "రామదండు"లో చేరాలనుకున్నవారు సంప్రదించండి

>> Saturday, November 10, 2012











భక్తజనబంధువులందరికీ నమస్కారములు


  పరమపవిత్రమైన  తిరుమల క్షేత్రంలో శ్రీవారి దివ్యపాదపద్మములచెంత  సేవచేయటం పూర్వజన్మ సుకృతం . అటువంటి అవకాశం   శ్రీవారిసేవ అనే కార్యక్రమంద్వారా టిటీడి అందరికీ అందిస్తున్నది .     ఈభగవత్సేవలో సాధ్యమైనంతమందికి దక్కాలనే  ఉద్దేశ్యంతో   శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం   " రామదండు" పేరుతో  ఓ సేవాబృందాన్ని ఏర్పాటుచేసి  తిరుమలకు విడతలవారీగా పంపాలని  నిర్ణయించుకున్నది .   ఇందులో పాల్గొనటానికి ఏకైక అర్హత  స్వామిపై భక్తిని కలిగియుండటమే .   ఎవరయినా పాల్గొనవచ్చు. కాకుంటే శారీరిక శ్రమకూడా ఉంటుంది కనుక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.  రోజుకు ఆరేడు గంటలపాటుటిటీడీ వారు నిర్ణయించిన చోట సేవాకార్యక్రమాలలో పాల్గొనాలి. అదీకాక  ప్రతినిత్యం ఉదయాన్నే  బృందమంతా కలసి నిర్వహించే విష్ణుసహస్రనామ పారాయణ,ధ్యాన,సంకీర్తనాదులలో నూ తప్పనిసరిగా పాల్గొనవలసి ఉంటుంది.

ఇక ఈ బృందంలో కూలీలనుండి ఐయ్యేయెస్ లదాకా అందరూ ఉంటారు. కనుక అందరూ కలసి ఉండవలసినదే . అక్కడ డార్మెటరీలో లాకర్లు ఇస్తారు .చాపలు ఇస్తారు. నేలమీదే నిద్రించాలి . భోజనం స్వామివారి నిత్యాన్నదానపథకంలో చేయాలి.
నిజానికి  ఇదొక దీక్ష . నిరంతరం స్వామి నామస్మరణం . స్వామిధ్యానం ,స్వామివారి భక్తులకు మనం చేసుకునే సేవ ఇది. దీనిద్వారా కర్మక్షయం జరిగి జీవితాలలో శుభాలుప్రాప్తిస్తాయి .  తెల్లని దుస్తులు ధరించాలి .ఆడువారు ముదురుఆకుపచ్చ వస్త్రాలు [ప్లైన్] ధరించాలి.

ఇక్కడ  పెద్దలపట్ల వినయము చిన్నవారిపట్ల ప్రేమాభిమానములతో మెసలుకుంటూ ,బృందనాయకత్వముసూచనలను తూచాతప్పకుండా పాటించి మసలుకోవాలి.  ఈవిధంగా ఒక్క వారం  సాగే మీసాధన  జీవితాలలో అద్భుతమైన శుభఫలితలను ఇస్తుంది." శ్రద్ధావాన్ లభతే విద్యా " అన్నారుకదా పెద్దలు. స్వామి అనుగ్రహానికి అవధులుండవు .ఆయన కరుణాసముద్రుడు . మనభక్తి స్థిరపరచుకోవటంపై మన ప్రాప్తం ఆధారపడిఉంటుంది


మొదటిసారిగా పంపుతున్న    ఈ బృందం     డిసెంబర్   22  - నుండి  సేవకుసిద్దమవుతున్నారు [తేదీ మూడురోజులలో ఖాయమవుతుంది ]    మూడుకోట్లదేవతలు ఆయన దర్శనం కోసం నిలుచుండే  ముక్కోటి ఏకాదశి [dec23]  నాటికే సేవలో ఉండాలనేది   మా ఆశ.  ఈ మొదటి బృందంలో   ఇప్పటికే ఎక్కువమంది చేరారు.

నేనుకూడా వస్తున్నాను. నిరంతరం ఉద్యోగాదులలో సతమతమయ్యే  వారిలో కొద్దిమందినైనా ఈ  సాధనాకార్యక్రమంలో  కలపాలని కోరికతో  ఇక్కడ తెలియపరుస్తున్నాము . మీలో  రాదలచుకున్నవారు  I ఈ నియమాలకు కట్టుబడి సేవకు సిద్దమయ్యేవారు  అతిత్వరగా నాకు  ఫోన్ లేదా మెయిల్ ద్వారా తెలుపగలరు  ఫోన్లోనైతే వివరంగా మాట్లాడవచ్చు.
జైశ్రీరాం

durgeswara@gmail.com     9948235641


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP