శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కార్తీకమాసపూజలకు గోత్రనామాలు పంపండి

>> Tuesday, November 13, 2012

కార్తీక మాసం పరమపవిత్ర పుణ్యకాలం . శివకేశవులిరువురికీ ప్రీతికరమైన ఈ మాసంలో జరిగే పూజలతో ఆథ్యాత్మికవాతావరణం వెల్లివిరుస్తుంది లోకాన .    ప్రతిక్షేత్రం   విశేషపూజలు .శివాభిషేకములతో దివ్యహారతులతో దివ్యనామసంకీర్తనలతో మార్మోగిపోతుంది.  పూర్వకాలంలో ప్రతివారూ తమసమయాలను ఇందుకు కొంతసమయాన్ని కేటాయించుకుని ఆలయాలలోనో , ఇళ్లలోనో తమ ఆథ్యాత్మిక సాధనలను కొనసాగించుకునేవారు . అయితే  ఈ కాలంలో భక్తిభావాలకోసం కేటాయించుకునేందుకు వీలుకక ఇరవైనాలుగుగంటలూ భుక్తిమార్గంలో పోరాడటానికే సరిపోతున్నది. ఆర్తి మనసులో ఉన్నా అవకాశం కలగటంలేదు ఆథ్యాత్మిక సాధనలకు.
   ఈస్థితిని ఊహించిన భవిష్యద్రష్ఠలగు మహర్షులు దీనికి కూడా పరిష్కారం కూడా సూచించారు. పూజను పనిగా చేయకుండా పనిని పూజగా మరల్చుకునే నైపుణ్యాలను అలవరచుకోమని సుచించారు. అందుకు దివ్యమార్గం నామస్మరణ . మనశరీరం పనిలో నిమగ్నమైఉన్నా మనసు దేవదేవుని పై లగ్నం చేయగల అవకాశం  నామస్మరణద్వారా కలుగుతుంది.

 ఈ కార్తీకంలో   శివాపంచాక్షరిని నిరంతరం స్మరించడం ద్వారా బోలాశంకరుని  కృపమనపై అపారంగా వర్షిస్తుంది.
సద్గురువుల సాన్నిధ్యం లభిమ్చనివారుకూడా గురూపదేశం లేకుండాకూడా జపిమ్చగల మంత్రరాజములు పంచాక్షరి అష్టాక్షరి మంత్రములు.
అలా నామస్మరణ   చేసే భక్తులకోసం   "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం" వారి తరపున రుద్రాభిషేకములు అర్చనలను నిర్వహిస్తున్నది . మీగోత్రనామాలు పంపితే ప్రతి రోజూ వరుసవారీగా వారి గోత్రనామాలతో అభిషేకం ,అర్చనలు నిర్వహించటం జరుగుతుంది . అయితే గోత్రనామాలు పంపినవారు వారి అర్చన రోజున నామస్మరణ తప్పనిసరిగా చేయాలి. లేకుంటే ఆనలైన్ పూజలంటూ ఇదొక ప్రహసనంగా మిగిలిపోతుంది. విమర్శలపాలవుతుంది,
 మీఅందరి  కీ పరమశివుడు పరమశుభములను ప్రసాదించాలని  ప్రార్ధిస్తూ
ఓం నమః శివాయ  

5 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. November 13, 2012 at 9:46 AM  

అవిరళమైన సేవల నహర్నిశలీరు తరించు చుండి, మా
కవి వివరించి చూపుచు మహాద్భుత భక్తి ప్రపత్తి గొల్పుచున్
భవునకు సేవ చేయగను పంపుడుగోత్రము నామధేయమం
చు వదాన్య! తెల్పితిరె!సుందర సద్గుణ! వందనంబయా!
చింతా రామ కృష్ణా రావు
కౌశికస గోత్రము,
అర్థాంగి:- విజయ లక్ష్మి.
సకుటుంబము.

mahadev November 13, 2012 at 10:28 PM  

chala bagundi

mahadev November 13, 2012 at 10:29 PM  

chala bagundi

dg,kdhli. November 14, 2012 at 2:35 AM  

1. Ennolla gotram
Narsimha reddy, Nirmala, Swathi,Naveen kumar reddy
2. mudunolla gotram
parameshwar reddy, pallavi, sai prasiddi, sai prakhyat reddy

sree December 1, 2012 at 11:33 PM  

dechetla gotram
moturi sreedhar
sudha
bhavya
bhanu
Rasagna

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP