శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నీలకంధర నిన్నెనమ్మితిరా ! నీ లీలజూపర ! ఫాలలోచన! భక్తమందారా ! [ bhajan]

>> Sunday, November 11, 2012




నీలకంధర నిన్నెనమ్మితిరా ! నీ
లీలజూపర ! ఫాలలోచన! భక్తమందారా !


౧ జాలమేల కపాలమాల ! త్రిశూలధర ! నన్నేలు ధరలో!
 బాలకులలో బేలనై  నీలీలగన ఈ  లీల వేడితి
జాలి ఇసుమంతైన జూపుమురా ! ఏలీల బ్రోతువొ
కాలమదహర శైలసంచారా !



౨    మరువకను నీ స్మరణజేసెడి ! పరమభక్త జనాళికెల్లను

పరమసుఖముల నిచ్చిగాసెడు ! దొరవునీవని తలచి మదిలో !
 మరిమరీ  స్మరిఇంపుచుంటినిరా  !
కరుణాసముద్ర ! సరగునను శరాణార్ధి ననుగనరా !

౩ మంగళాకర ! మహేశ్వర ! సత్సంగ నీ బంగారు పదములు
రంగుమీరగ నాదుమదిలో పొంగుచును వేడంగనిడితి
భుజంగభూషణ ! జంగమాకారా !
గంగాధరా ! నను కృంగదీయుట కూడదంటినిరా !

౪  సర్వ జీవాధార శుభకర ! గర్వులను మదమణచి సుజనుల !
సర్వదా రక్షించిబ్రోచెడి ! నిర్వికల్ప నిరామయా !
సంసారబాధలకోర్వజాలనురా !
సర్వాధిపతి!  నే  నుర్విలో నిక్కట్లు బడలేరా !


౫  పొందుగను ఇలచోడవరపుర మందునున్నటువంటి బుధజన
వందితా    గౌరీశ నినునే  పొందుగోరి నుతించుచుంటిని
నందివాహన వందనంబిదెరా !
కందర్పమదహర  ! మందుడను! మహలక్ష్మిదాసుడరా ! 

3 వ్యాఖ్యలు:

Unknown November 11, 2012 at 4:23 PM  

చాలా బాగున్నదండి,హాయిగా సాగింది పాట.

Unknown November 11, 2012 at 4:24 PM  

చాలా బాగున్నదండి,హాయిగా సాగింది పాట.

ఎందుకో ? ఏమో ! November 11, 2012 at 8:49 PM  

:-) ఆహా! అయితే ఈ కార్తిక మాసం లో ఇలాంటివి మరిన్ని హరిసేన ద్వారా expect చేయ్యోచ్చన్నమాట!! థాంక్స్ అండి !!

హర హర మహా దేవా శంభో శంకర

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP