చిన్నారికివ్వరే చేమంతులారతీ ! పొన్నారి కివ్వరే పొగడాలహారతీ !
>> Monday, October 22, 2012
అనంతకోటి బ్రహ్మాండములను సృష్టించి పాలించే తల్లి బిడ్డలపై కరుణతో తనకు తానే సృష్టించుకుని కోట్లాది దేవీగణాలతో ఉద్భవించిన రోజు ఈరోజు. దుర్గాష్టమి గా లోకంలో విఖ్యాతమైన ఈరోజు అమ్మలగన్న యమ్మ చిన్నారియై ,సేవలందుకున్నది . ప్రభాతసమయాన మేలుకొలుపులతో నిదురలేచిన చిట్టితల్లికి బాలభోగములు సమర్పించి శ్రీ సూక్త ప్రకారంగా అభిషేకములు నిర్వహింపబడ్డాయి .
తదన<ంతరం దివ్యగంధానులేపనములతో వివిధపుష్ప మాలికకలతో అలంకరణలు జరిపి అర్చనలు చెసి హారతు లెత్తారు. సువాసినుల కుంకుమార్చనలు సేవకుల సంకీర్తనలతో
పర,మానందభరితయై చిరునవ్వులు విరబూస్తూ ఉన్న మోముతో దర్శనమిచ్చి కరుణించినది . సాయం కాలవేళ సంధ్యహారతులు సంకీర్తనార్చనలు అందుకుని డోలోత్సవ సేవలతో మనసుయ్యాలలూగించిన తల్లి మా అమ్మయై అందాల తల్లియై అనుగ్రహించినది .
జైజై దుర్గే .
0 వ్యాఖ్యలు:
Post a Comment