నిందాస్తుతి
>> Saturday, September 8, 2012
భగవంతుని పూజించుట వలన మనస్సుకు శాంతి కలుగుతుంది. కొందరు ఆయనను స్నేహితుని వలె భావించుట జరుగుతుంది. మరికొందరు ఆయన వారి స్వంతమనియు, ఆయనపై అలుక వహించి నిష్ఠూరములు పలికెదరు. గోపికలు శ్రీకృష్ణుని తమ ప్రియమైన వ్యక్తిగా భావించు కున్నారు. ఆయన కంసుని వధించిన తరువాత తిరిగి బృందా వనం రాలేదు. ఆయన తన ప్రియభక్తుడు మిత్రుడయిన ఉద్ధవ్ఞని వారియోగక్షేమములు కనుక్కొని రమ్మని బృందావనం పంపాడు. ఆయన వారిని కలుసుకున్నాడు. వారు శ్రీకృష్ణుని వియోగాన్ని ఈవిధంగా తెలియజేశారు. ధన్య: ఆ శ్యామసుందరుడు బహుక్రూరుడు, కంసుడు పూతన వంటి రాక్షసులను చంపాడు. అందువలన ఆయన మనస్సు ఎప్పుడో క్రూరమయిపోయింది. వారు మాత్రమే ఆయనకు ప్రియులు. అనగా లోకులను బాధించేవారిని మాత్రమే ఆయన స్మరిస్తాడు. శారీరకంగా చంపి, వారికి ఇంకొక జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని పలికింది.
విశాఖ : ఈ గోపిక ''ఆయన స్వతంత్రుడు కాదు అని ఆయనపై ఈ విధంగా నిందవేసింది. ఆయన స్త్రీలోలుడు కాని ధనముతో ఒక స్త్రీ ఆయనను ఆక్రమించుకుంది. అనగా శ్రీనాథుడు కాస్తా లక్ష్మీపతి అయ్యాడు. ఆయన వక్షస్థలాన్ని ఆవిడ ఆక్రమించింది. తన శరీరంపై ఆధిపత్యం లేని వాడు మమ్మల్ని ఎలా గుర్తు ఉంచుకుంటాడు అని పలికింది.
మిగిలిన గోపికలందరూ! శ్రీకృష్ణునిపై ఈవిధముగా నిందలు మోపారు. ఆయన గుణశీలాలు లేనివాడు. ఇతరులకు కూడా. ఉండనివ్వడు. అనగా మానసికంగా ఎప్పుడో ఆయన వశం అయిపోయాము. శరీరాలు మాత్రమే శవాలవలె ఇక్కడ ఉన్నాయి. ''శవాలకు అనుభూతులు ఎక్కడయినా! ఉంటాయా అని గోపికలు ప్రశ్నించారు. స్త్రీలను అందరినీ ఆయన తేడా లేకుండా బాధించాడు. పుట్టిన వెంటనే తల్లి అయిన దేవకికి, దూరమయి ఆమెకు మనోవేదన కలగజేసాడు. పెరిగిన తరువాత యశోదకు దూరమై ఆమె ఆశలు అడియాశలు చేసాడు. శారీరకంగా మాకు దూరంగా ఉంటూ మానసికంగా మమ్మల్ని హింసిస్తున్నాడు అని నిట్టూర్చారు. అందరికీ అతీతంగా రాధ కూర్చుని ఉంది. ఉద్ధవ్ఞడు ఆమె వద్దకు వెళ్లాడు. ఆమె శ్రీకృష్ణునితో సంభాషిస్తూ ఉంది. శ్రీకృష్ణుడు తేజోరూపముతో ఆమెతో విహరిస్తూ, ఆమెకు సమాధానాలు చెబుతున్నాడు. ఉద్ధవ్ఞడు ఇలా అనుకున్నాడు. ''శ్రీకృష్ణా నీవ్ఞ ఎంతటి మాయగాడివి. నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావ్ఞ. నేను ఏదో గొప్పజ్ఞానిని, నీ ఇష్టసఖుని అను కున్నాను. నీవ్ఞ ఎవరికి స్వంతం కాదు. కాని అందరూ! నీ స్వంతం అని ద్వారకకు తిరిగి వెళ్లాడు. అక్కడ యధావిధిగా శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చాడు.
శ్రీరామదాసు (కంచర్ల గోపన్న) భద్రాచలములో శ్రీరామునికి ఆలయం నిర్మించాడు. దానికి కావలసిన ధనాన్ని పన్నుల రూపములో వసూలయిన డబ్బును వాడాడు. ఆయన గొల్కొండ నవాబు పాలనలో పన్నులు వసూలు చేయు అధికారి ఫలితంగా నవాబు ఆగ్రహాన్ని రుచి చూసాడు. అనగా జైలుపాలయ్యాడు. అక్కడ ఎన్నో కీర్తనలు రచించాడు.
కారాగారము గోడలపై నఖచిత్రాలు చిత్రీకరించాడు. ''సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము రామచంద్రా ఆ పతకమునకు పట్టే పదివేల వరహాలు అని రామునికి విన్నవించుకున్నాడు. ఇంకా ఆయన కరుణించలేదని ''ఎవడబ్బ సొమ్మునుకున్నావ్ఞ రామచంద్రా అని ఆక్రోశించాడు. ఫలితంగా రాముడు, లక్ష్మణుడు తానీషాకు కలలో కనబడి సొమ్మును చెల్లించారు. ఆయన కన్నులు తెరిచి చూడగా నిజముగానే కాసులు అక్కడ ఉన్నాయి. శ్రీరామదాసు విడుదల అయ్యాడు. బ్రతిక ిఉన్నంతకాలం శ్రీరాముని సేవలో తరించాడు. ఈవిధముగా భక్తులు, భావావేశములో భగవంతుని తమ స్వంతము అనుకొంటారు. కాని ఆయన ఎవ్వరికి స్వంతము కాదు. అందరూ! ఆయన స్వంతమే.
- ర్యాలీ రమాసీత
0 వ్యాఖ్యలు:
Post a Comment