శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

లుకేమియా వ్యాధిని నయం చేసే తాంబూలసేవనం ..ఇదీ భారతీయ ఆచారములలో వైద్యవిజ్ఞానం

>> Friday, September 21, 2012

మనం మన ఆచారాలపట్ల  తృణీకారభావనతో ఉండి అపూర్వమైన  వైద్య  విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామో  నేటి పరిశోధనలు తెలుపుతున్నాయి . ఏదైనా పెద్దవారు చెప్పినప్పుడు ఆ.. పాతచింతకాయ పచ్చడి  అనే చులకభావనతో మన అతితెలివితేటలతో ఆయా ఆచారాలపట్ల నిరాసక్తులమవటమే గాక కొత్తతరాలకు వాటిని పూర్తిగా దూరం చేస్తున్నాము .
మనకు తాంబూలసేవనం ఒక ఆచారం.  తాంబూలమివ్వటమంటే వాళ్లను గౌరవించటంగా భావిస్తాం. దానిలోతు విషయాలు తెలియకున్నా తాంబూలాన్నో తమలపాకులనో వాడటం ద్వారా ఎంతో గొప్ప  ఔషధాన్ని మనకు తెలియకుందానే తీసుకుంటూన్నాము. ఇప్పుడు శాస్త్రవేత్తలు తమలపాకులపై చేసిన పరిశోధనాఫలితాలు  ఓ అద్భుతమైన విషయాన్ని  తెలుపుతున్నాయి .

తమలపాకులతో తాంబూలం వేసుకునే సాంప్రదాయం లుకేమియా వ్యాధిగ్రస్తులకు వరం కానున్నది. ఈ ఆకులలో "హైడ్రాక్సిరావికోల్" అనే రసాయనం రక్తకేన్సర్ ను నియంత్రించగలదని కోల్ కతా లోని "ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ . ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్" శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఇంకేం  మీరూ భోజనానంతరం ఓ తాంబూలం స్వీకరించండి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP