శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శుభ భావనతోనే ఒత్తిడిపై విజయం

>> Tuesday, June 12, 2012


ఆలోచన చేయడం అన్నది మన జీవితంలో ఒక అంతర్భాగం. మనం ఆలోచించకుండా ఏ పని చేయలేం. మన ఆలోచన ఎల్లప్పుడు సకారాత్మకమైన శుభ భావనతో కూడిన ఆలోచన ఉండాలి. నకారాత్మక భావన లేదా అశుభ భావనతోకూడిన ఆలోచన మనలో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి అవి మన అనారోగ్యానికి మార్గాలు అవుతాయి.

joyఒక గ్లాసులో సగం నీరు నింపబడి ఉంది. ఒకరు గ్లాసుకు సగం నీరు ఉందని, సగం ఖాళీగా ఉందని అన్నారు.మొదట వ్యక్తి చెప్పిన మాట ప్రకారం పాజిటివ్‌ (శుభభావన)తో కూడిన ఆలోచనగా చెప్పవచ్చు. మరొక వ్యక్తి నెగిటివ్‌, (అశుభ భావన)తోకూడిన ఆలోచన గల వ్యక్తిగా చెప్పవచ్చు.ఆలోచన చేయడం, అనేది గొప్ప కళ. అదే పనిగా ఆలోచనల వెంట పరుగు పెట్టడం వల్ల మీ ఇప్పటి ఆనందానికి విఘాతం కలిగిస్తాయి. మీ జీవితంలో గతించిన కాలంతో కొంత చేదు అనుభవం ఉండి ఉండవచ్చు. అది మీ జీవితాన్ని దయనీయ స్థితికి మార్చవచ్చు.ఈ సందర్భంగా ఒక కథను మీకు చెప్పాల్సిందే...

అతను ఒక ఇంజన్‌ డ్రైవర్‌. అతను ఎప్పుడు ఆనందంగాను, శుభ భావనల తోనే శుభ సంక ల్పాలతోనే ఉండేవాడు. తాను ప్రతి విషయంలోనూ వెలుగుల తో కూడిన అనుభూతిని పొందేవాడు. సకరాత్మక ఆలోచనలే తప్ప మరే ఆలో చనలు లేని మనస్తత్వం అతనిది.అనుకోకుండా ఒకరోజు అతనికి తీవ్ర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక కారు అతని శరీరంపై నుండి వెళ్ళింది. అప్పుడు అతని కాలుకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అతని కాలు పూర్తిగా (నడిచే స్థితిలో లేదు). చచ్చుబడి పోయింది. అతని మిత్రులు అతను ఇక జీవితంలో వెలుగు ఆనందం ఉండవు అనుకున్నారు. మిత్రులు ఆసుపత్రిలో కలిసేందుకు వెళ్ళారు.

అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అతని చూచేందుకు వచ్చిన మిత్రులను ఓదార్చే పనిలోపడ్డాడు. గతంలో ఎలా ఆనందంగా ఉన్నాడా అదే ఆనందాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేశాడు. నేను ఇప్పుడు నా గాయాన్ని శుభ్రపరుచుకుని ఒక బూటును కొనుగోలు చేయాలి. అది నా డబ్బును, సమయాన్ని కాపాడుతుంది అని సమాధానమిచ్చాడు.ఆ విధంగా మన సమస్యను పరిష్కరిం చేందుకు ఆరోగ్యకరమైన శుభభావన శుభ సంకల్పాలను పద్ధతిని జీవితంలో అనుసరించాలి.

నేటి సమాజంలో మనం ఒత్తిడిని స్వాగతిస్తున్నాము. తత్ఫలితంగా చాలా దీర్ఘ కాలిక అనారోగ్యాలు కొన్ని తెచ్చుకుంటున్నాము. ఉదాహరణకు: చక్కెర వ్యాధి, డయాబెటిస్‌, ఒత్తిడి, ఉద్రేకం, ఉద్వేగం, నిస్సహాయత, నిరాశ, నిర్లిప్తత, తత్ఫ లితం గుండె జబ్బులు, తీవ్రమైన హై.బి.పి., తదితర సమస్యలు. లేదా లో బి.పి. వంటి సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఈ సమస్య దాదాపు సర్వసా ధారణమనే చెప్పాలి. ఈ అంశాలపై ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, లేదా తప్పు-ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే స్థితికి నిర్ణయించే స్థితిలో కూడా లేకపోవడం విచారకరం. ఒకవేళ మనం సద్ధావన, శుభ సంకల్పాలతో కూడిన ఆలోచనలు చేయడం వల్ల మనం కొన్ని మంచి పనులు చేయగలం. మనకు లభించే సంకేతాలు కూడా శుభప్రదంగా ఉంటాయి.

శాంతి, ఆనందం, నియంత్రించుకోవడం వంటి విషయాలు భగవంతుని బహుమతిగా చెప్పవచ్చు.
ఒక నిరుపేద ఆనందంగా ఉండవచ్చు లేదా తాను ఒత్తిడి నుండి లేని జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు. తన జీవితాన్ని తానే పద్ధతిగా నియంత్రించుకుంటూ జీవిస్తే ప్రతిరోజు ఆ నిరుపేద శ్రీమంతుని కన్నా చాలా సంతోషంగా ఉండగలడు.మనం ఒత్తిడిని అధిగమించాలి, లేదా ఒత్తిడిని తొలగించాలి. అన్నీ ప్రశ్నలకు పరిష్కారం ఏమిటి? చాలా సులభం. ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏమిటి ఎమీ లేదు.

మనకు ఏది ప్రాప్తమో అదే మనకు ముందే నిర్ణయిం చబడుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి. అది కూడా మనం చేసే చర్య ప్రతిచర్య, కర్మల మూలంగానే అన్న విషయాన్ని గుర్తించాలి.మన మనసును, మెదడును ఏమి కావాలో అది మాత్రమే తీసుకోవడం అవ సరం లేని విషయాన్ని వదిలి వేయడం వంట అంశాలను ఆచరించడం ద్వారా ఒత్తిడి నుంచి మనం బయట పడటం సాధ్యం.

ఆధ్యాత్మికంగాను - ఆరోగ్యంగాను ఉన్న వ్యక్తి ఆనందంగా ప్రశాంతంగా నిద్రి స్తూ ఉంటాడు. అందుకే వారిలో ఒత్తిడి ఉండదు. అయినప్పటికీ ఆయన ఏ రాజ్యానికి రాజు కాదు ఆయన వ్యక్తిగత సత్సంబంధాలు, సంతృప్తి, తోపాటు సరిదిద్దుకునే ప్రవృత్తి ఆయన మెదడును మైండ్‌కు మాత్రమే సాధ్యం. ఈ ప్రపంచంలో వెబ్‌లో తాను కోల్పోయిన దానిని వెతకవచ్చు. చాలా ఆత్రంగా తనకు కావాల్సిన అంశం కోసం వెతకడం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందలేడు.

మనల్ని మనం పరమాత్మకు సమర్పణ చేసుకోవడం ద్వారా యథాతధంగా జీవిస్తూనే సందర్భా నుసారంగా అన్నింటికీ తట్టుకుని, సర్దుకుపోవడంతో పాటు ఇదంతా సృష్టి నాటకంలో ఒక భాగమనే భావన ఉన్నప్పుడు మనం ఒత్తిడికి గురికానవసరం లేదు. మనం గతించిన కాలం గురించి ఆలోచన అది కల, భవిష్యత్తు సూన్యంగా తోస్తుంది లేదా భవిష్యత్తు తెలియదు. కేవలం వర్తమాన పరిస్థి తులు మాత్రమే మనకు వర్తిస్తుంది. వర్తమానంలో ఉన్నతంగా జీవించేందుకు మనం చేసే కర్మలు విధులే మన భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దగలదు.

ఆధ్యాత్మికత, రాజయోగం మాత్రమే మన మనసును, మెదడును మనం చేసే కృషిని నిర్దేశించగలదు. శక్తివంతులను చేయగలదు.తద్వారా చివరికి ఆనందమయ జీవితాన్ని జీవించేందుకు వీలు కలుగుతుంది. దీని ద్వారా వాస్తవిక సన్మార్గాన్ని అనుసరించడం ద్వారా ఎప్పటికి కోల్పోని శాంతిని, నీతి నిజాయితీతో కూడిన గుణాలు గల ఆత్మగా పరంధామున్ని చేర గలం.
- బ్రహ్మకుమారీస్‌, 9010161616

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP