పెద్దవరం హనుమత్ క్షేత్రం విశిష్ఠత
>> Wednesday, November 30, 2011
పెద్దవరం హనుమత్ క్షేత్రం విశిష్ఠతగూర్చి కొద్దిగా చెప్పాలి .
నాగార్జునసాగర్ కాలువలు తవ్వేప్పుడు దరిశి బ్రాంచకెనాల్ డిజైన్ ఈ హనుమత్ క్షేత్రం నుండే వెల్లుతుంది. అందువలన అక్కడ విగ్రహాలు ఆలయం తొలగించి మరొక్కచోటకు తరలించాలని నిర్ణయం జరిగింది. కాలువల తవ్వకం మొదలెట్టి ఈక్షేత్రం ను తొలగించేందుకు బుల్డోజర్లు తదితర యంత్రాలు దింపారు . ముందుగా క్షేత్రం లో నిలువెత్తు ఉన్న స్వామి మూర్తిని తవ్వి తొలగించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. ఇక యంత్రాలసహాయంతో తొలగించాలని ప్రయత్నం మొదలెట్టారు . చిత్రంగా యంత్రాలు స్వామి సమీపానికి రావటం... ఆగిపోవటం ...రావటం... ఆగిపోవటం. మరలా స్టార్ట్ చేసినా ఇదే స్థితి .మరొక డ్రైవర్లచేత ప్రయత్నించినా ఇదే పరిస్థితి. ఇక యంత్రాలడ్రైవర్లకు అకారణంగా విపరీతమైన భయం ఆవహించి చెమటలు పట్టి కూలబడటం తో భీతిల్లిన పర్యవేక్షకులు వెంటనే కాంట్రాక్టర్ కు కబురు చేయటం జరిగింది . ఆయనవచ్చి పరిస్థితి చూసి అధికారులతో సంప్రదించి తన పలుకుబడి ఉపయోగించి డిజైన్ లో మార్పులు చేపించి క్షేత్రం ముందుగా తవ్వకాలు జరిపేట్లు చేశారు. ఇప్పటీకీ నాటి పరిస్థితిని కళ్ళారా చూసిన వృధ్ధులు కల్లకు కట్టినట్లు స్వామి మహాత్మ్యాన్ని వివరిస్తుంటారు .
1 వ్యాఖ్యలు:
అద్భుతం...జై హనుమాన్
Post a Comment