శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్టేట్ 7th రాంక్ సాధించిన మా ఈ చిరంజీవిని ఆశీర్వదించండి

>> Saturday, April 21, 2012

మట్టిలో మాణిక్యాలు ఇలానే ఉంటాయి .సానబెడితే వాటి వెలుగు కనిపిస్తుంది. ఈ ఫోటోలో అమ్మాయి అక్షరాభ్యాసం నుండి మాదగ్గరే చదివింది . రైతు బిడ్డ తండ్రి పేదరైతు.చక్కగా చదువుతుంది. దైవభక్తి,వినయవిధేయతలు ఆభరణాలు . పొలం పనిలో ధిట్ట .ఇద్దరి పని ఒక్కతే చేస్తుంది . స్కూల్ మూసివేశాక ఈ అమ్మాయిని వినుకొండలో గీతాంజలి విద్యాసంస్తలలో చేర్చాము . స్కూల్ మూసివేసినందుకు కన్నీటిపర్యంతమై వెళ్లలేక వెళ్ళింది.వాళ్లనాన్న వెంకటరమణారెడ్డి అయితే మాస్టర్ గారూ నాకు బయటచదించే ఓపిక లేదు చదువు మానిపిస్తానన్నాడు .నేను ఆస్కూల్ వాళ్లతో మాట్లాడతానని చెప్పి ఫీజు తక్కువకట్టేలా చూసాము. ఇప్పుడు ఇంటర్ మీడియేట్ మొదటిసంవత్సరంలో రాష్ట్రం లో 7 వ ర్యాంక్ సాధించింది. మొత్తం 470 మార్కులకు గారు 460 మార్కులు సాధించింది. హనుమాన్ చాలీసా నిత్యపారాయణం చేస్తుంది . ఇంటికొస్తే పొలంపనులకెళుతుంది.

హైమా ! నువ్వు కలెక్టర్ కావాలి చదువుతావా ? నీకు కావలసిన సహాయంఅందేలా నేను ప్రయత్నిస్తాను అన్నాను. తప్పనిసరిగా సార్ ! అని ఆత్మవిశ్వాసం తో పలికింది . స్వామి అనుగ్రహిస్తే సహాయంచేసే వారు దొరకకపోరు . ఈ అమ్మాయిని ఉన్నతస్థాయిలో చూడకపోము !
జైశ్రీరాం

స్టేట్ 7th రాంక్ సాధించిన మా ఈ చిరంజీవిని ఆశీర్వదించండి

15 వ్యాఖ్యలు:

Sravya V April 21, 2012 at 10:21 PM  

Oh great ! Congratulations !

కాయల నాగేంద్ర April 21, 2012 at 10:23 PM  

హైమా! congratulation. మనస్పూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను. నువ్వు తప్పకుండా కలెక్టర్ అవుతావు.

వనజ తాతినేని/VanajaTatineni April 21, 2012 at 10:34 PM  

Hyma.. Congrats! All the best for your future studies.
Durgeswara gaaru.. Mattilo maanikyaalani teerchididde Bhadhyata ni teesukuntunnaaru. Swami anugraham tappakundaa untundi. alaage Hyma ki saayam andinche sahrudayulu untaaru.
manchi pani kai spoothi nisthunna meeku..abhinandanalu.

రవిశేఖర్ హృ(మ)ది లో April 21, 2012 at 10:43 PM  

అమ్మాయికి అభినందనలు.మట్టిలో మాణిక్యం .మీ సేవాదృక్పథం గొప్పది

Unknown April 22, 2012 at 4:13 AM  

All the best to Haima

Unknown April 22, 2012 at 4:13 AM  

All the Best to Haima

చిలమకూరు విజయమోహన్ April 22, 2012 at 6:46 AM  

హైమకు అభినందనలు,ఆశీస్సులు.

ఫోటాన్ April 22, 2012 at 7:10 AM  

Congrats Hyma !!!

భాస్కర రామిరెడ్డి April 22, 2012 at 8:51 AM  

హైమ కు అభినందనలు. మీ కోర్కెను తీర్చగలదని ఆశిస్తున్నాను.

psm.lakshmi April 22, 2012 at 8:57 AM  

congratulations Hyma. God bless you.
psmlakshmi

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు April 22, 2012 at 10:37 AM  

హైమకూ మీకూ అభినందనలూ. ఈ అమ్మాయి మరెన్నో మెట్లు ఎక్కి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ, ఆ ముచ్చట్లు మీరు ఇక్కడ మాతో పంచుకోవాలనీ నా అభిలాష.

anrd April 24, 2012 at 1:19 AM  

దుర్గేశ్వర గారికి అభినందనలు. మరియు ఇతరులకు సహాయం చేసే ఇలాంటి మంచివారికి దేవుని ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి. హైమకు అభినందనలు మరియు ఆమె జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ.....శుభాకాంక్షలు..

Yogi April 24, 2012 at 4:44 PM  

Durgeswara Rao garu, meeku Hyma ku maa hardika abhinandanalu.

rajachandra April 26, 2012 at 2:16 AM  

Hyma.. Congrats! All the best for your future studies.

Ravinder Gandham April 27, 2012 at 3:58 AM  

Hymaku Shubakankshalu, Bavishyathula collector kavalani korukuntu..

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP